Sunday, 25 February 2024

JAMINDARI REVOLTS ON THE BRITISH IN ANDHRA PRADESH.

  మధ్యనే సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల అయ్యింది. అందులో ఆయన మొదటి స్వతంత్ర పోరాటం చేసాడు అని చెప్పబడింది. నరసింహారెడ్డి  బ్రిటిష్ వారి మధ్య యుద్ధం 1848  సంవత్సరం లో అయ్యింది. కానీ ఆయనకంటే ముందే బ్రిటిష్ వారితో పోరాటం సలిపిన అనేక భారతీయులు ఆంధ్ర దేశీయులు, తెలుగువారు ఉన్నారు. అందులో ముఖ్యుడు అయిన వీరపాండ్య కట్టబొమ్మన్ పేరు మీరు వినే ఉంటారు. కట్టబొమ్మన్ ను బ్రిటిష్ వారు మొదటి పాళెగార్    యుద్ధంలో 1800  సంవత్సరంలో ఓడించారు. విజయనగర సామ్రాజ్యం లోని జమిందార్,రాజా లను పాళెగార్ అని పిలిచేవారు. విషయం మీద నేను ఇంకొక నోట్ రాసాను. ఇది దాని మీద రెండవ నోట్. ఇందులో ఆంధ్ర దేశంలో బ్రిటిష్ వారితో జరిగిన మొదటి ముఖ్య తిరుగుబాటులను గురించి రాస్తున్నాను. సైరా సినిమా విడుదల కాగానే  నారయ్యప్పారావు గారి మీద ఒక వీడియో సోషల్ మీడియా లో వచ్చింది. అందుకే రెండో నోట్ రాద్దాము అని నాకు అనిపించింది

నూజివీడు రాజా మేకా రంగయ్యప్పారావు గారి తిరుగుబాటు.

 కట్టబొమ్మన్ కంటే కూడా ముందు 1778-83  లో నూజివీడు రాజా అయిన మేకా నారయ్యప్పారావు గారు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసారు. బ్రిటిష్ వారు మొదటిగా నారాయప్పరావు గారి  పూర్వీకులు అయిన వెంకయ్య అప్పారావు గారి నుండి దివి పరగానా కు చెందిన బందరు లో కోట కట్టుకొనుటకై అనుమతి పొందారు. వారు క్రమముగా బలవంతులు అయ్యి నిజాం నుండి ఉత్తర circar లు  పొందారు. బ్రిటిష్ వారి బలము పెరగడం వలన వారు సహజంగా జమీందారులు మీద సామంత రాజులు మీద తమ ఆధిపత్యం అధికంగా ప్రకటించటం మొదలు పెట్టారు.

 దానితో అసమ్మతిఁ చెంది కొంత మంది జమీందారులు తిరుగుబాటు చేసారు. అందులో ముందు 1778-83  సంవత్సరంలో నారయ్యప్పారావు గారు, తరువాత 1794  లో విజయనగర రాజు  అయిన  చిన విజయరామరాజు చేసిన తిరుగుబాట్లు పెద్దవి.

 బ్రిటిష్ వారు బలపడి కొంత కాలం తరువాత నూజివీడు సంస్థానం స్వాధీనపరచుకొనుటకు చూసిరి. అది సహించక నారయ్యప్పారావు గారు బ్రిటిష్ వారికి  కప్పము కట్టడం నిలిపివేసిరి. అందుకు కోపించి బ్రిటిష్ వారు 1783  సంవత్సరంలో కల్నల్ మౌంట్ గోమరీ నాయకత్వంలో నూజివీడు కోటను ముట్టడించిరి.అయన క్రింద ఇద్దరు మేజర్ లు, ఆరుగురు lieutenant లు బ్రిటిష్ సేనలను నడిపిరి.  

 బ్రిటిష్ దళాలు 21  రోజులు కోటను ముట్టడించి ఉన్నాయి. కానీ వారు కోటను ఆక్రమించటానికి వెనుకాడారు ఎందుకంటే దగ్గరలోనే పాల్వంచ జమీందారు అయిన రామచంద్ర అశ్వారావు గారు సేనతో నూజివీడు కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు అని వారికి తెలిసింది. ఒకవేళ కోటను ఆక్రమించటానికి ప్రయత్నం చేస్తే  వెనుకనుండి పాల్వంచ సేనలు తమను ముట్టడిస్తాయి అని, అప్పుడు తాము రెండు సైన్యాల మధ్య చిక్కుకుని అపార నష్టం పొందుతాము అని వారికి అనిపించింది..

 21  రోజున నారయ్యప్పారావు గారు కోటలో సభ జరిపి సమాలోచన చేసిరి. అప్పటికి బొబ్బిలి యుద్ధం జరిగి కేవలం 26  సంవత్సరాల కాలం మాత్రమే అయ్యింది. అక్కడ జరిగిన ప్రాణ నష్టం అందరి మదిలోను మెదిలింది. బ్రిటీష్ వారిని ముట్టడిస్తే అపార ప్రాణ నష్టం తప్పదు అని చెప్పి, వారికి లొంగకుండా కోటలో నుండి తప్పుకొనుట మంచిది అని నిర్ణయానికి వచ్చారు. తరువాతి రోజు తెల్లవారుజామున వ్యూహం ప్రకారం కోట పశ్చిమ గోడను ఫిరంగి తో ఛేదించి 10 ,000  మంది వెంట రాగా నారయ్యప్పారావు గారు బ్రిటిష్ సేనలను చీల్చుకుని Sunkollu  అడవి ని చేరి, అక్కడ ఉన్న రామచంద్ర అశ్వారావు గారి సేనతో కలిసి భద్రాచలం ప్రాంతానికి వెడలిరి. పోరాటం లో ఒక బ్రిటిష్ lieutenant మరియు 194  మంది బ్రిటిష్ సైనికులు మరణించారు.

 భద్రాచలం కొండ ప్రాంతం అవటం వలన, ప్రజలు నారయ్యపారావు గారు, అశ్వారావు గార్ల పక్షం అందటం వలన బ్రిటిష్ వారు ఆయనను ఏమీ చేయలేకపోయారు. చివరికి రాజముండ్రి కలెక్టర్, మైలవరం జమీందార్లు వారితో మంతనాలు సలిపి రాజీకి తెచ్చి నారయ్యపారావు గారి కుమారుడు అయిన వెంకట నరసింహ అప్పారావు ( ధర్మ అప్పారావుగారికి  సంస్థానం అప్పగించిరి. ఈయనకు లార్డ్ క్లయివ్ స్వయంగా శాశ్వత sannadu ( సంస్థానాన్ని పాలించడానికి అధికారం  )  ఇచ్చెను

  

విజయనగర రాజా చిన విజయరామరాజు తిరుగుబాటు.

 తరువాతి పోరాటం విజయనగర సంస్థానం నుండి జరిగింది. ముందుగా తండ్రి మరణించే సమయానికి చిన విజయరామరాజు చిన్న బాలుడు కావటం వలన అతని సవతి అన్న అయిన సీతారామరాజు జమిందారికి దివాన్ అయ్యి పాలించాడు  ఆతను మహా క్రూరుడు.  1759 -68  మధ్య ఉన్న అరాజక పరిస్థితులు ఆధారంగా చేసుకుని అతను గంజాం, విశాఖపట్నం (ప్రస్తుత విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ) జిల్లాల లోని అందరు జమిందారులను ఓడించి కారాగారంలో బంధించి నిరంకుశంగా పాలన చేసాడు. అప్పటికి కేవలం గంజాం జిల్లాలోనే ఏకంగా 35 ,000  మంది సైన్యం, 34 కోటలు కలిగిన 20  మంది జమీందార్లు ఉన్నారు. అందులో పర్లాకిమిడి, ఘున్సూర్, మొహిరి, ప్రతాపగిరి జమీందార్లు అనేక పర్యాయాలు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసారు. వారందిరినీ సీతారామరాజు ఓడించాడు.

 సీతారామరాజు పాలన ను ప్రజలు కూడా ఏవగించుకున్నారు. విజయనగర బలం పెరిగి 1768  సంవత్సరానికి విజయనగర జమిందారును కాదని పాలించడం బ్రిటిష్ వారికి కష్టం అయిపొయింది. చిన విజయరామరాజు పెద్దవాడు అయ్యి సీతారామరాజు ని దివాన్ పదవి నుండి తొలగించాడు. దానికి కోపగించి సీతారామరాజు బ్రిటిష్ వారితో చేతులు కలిపాడు.

 బ్రిటిష్ వారు విజయనగర peshcus  పెంచడానికి, విజయనగర సైన్యాన్ని తగ్గించడానికి వారు బాకీ పడ్డ 8 .50 .000  peshcush  రొక్కం వసూలు చేయడానికి ప్రయత్నించారు. తాను బ్రిటిష్ వారికి peshcush  బాకీ పడలేదు అని విజయనగర జమీందారు నిరూపించాడు కానీ అది లెక్కపెట్టకుండా బ్రిటిష్ వారు విజయనగరాన్ని ఆక్రమించారు. కానీ జమీందారు మీద భక్తి ఉన్న రైతులు బ్రిటిష్ వారికి శిస్తు కట్టడానికి నిరాకరించారు. దానితో బ్రిటిష్ వారు జమిందారుకు నెలకు 1200 రూపాయలు పెన్షన్ గా నిర్ణయించి జమిందారును మచిలీపట్టణం వెళ్లిపోవలసింది గా ఆదేశించారు. జమీందారు ఆదేశాలు మన్నించక 1794  సంవత్సరం లో బ్రిటీష్ వారితో పద్మనాభం దగ్గర యుద్ధం చేసి వధించ పడ్డాడు.

 జమీందారు మరణం తరువాత జమీందారు కొడుకు అయిన నారాయణబాబు విశాఖ మన్యం లోని మక్కువ ప్రాంతం లో తల దాచుకున్నాడు. అక్కడ అతనికి కొండ దొరలు, భక్తులు అయిన సర్దారులు తోడ్పడ్డారు. 1802 సంవత్సరంలో నారాయణబాబు కు బ్రిటిష్ వారికి సంధి జరిగింది. దాని ప్రకారం నారాయణబాబు బ్రిటిష్ వారికి 6 ,00 ,000  రూపాయలు peshcush  చెల్లించాడు. బ్రిటిష్ వారు నారాయణబాబు కు అతని సంస్థానం తిరిగి ఇచ్చారు

 

No comments:

Post a Comment

THE CRUSADES.

  Religious wars are nothing new for the world. One such episode in World history is the Crusades fought between the Christians in Muslims i...