కాకినాడ పక్కనే ఉన్న పక్కనే ఉన్న పిఠాపురానికి చెందిన ఒక ప్రిన్సెస్, తన జీవితం ఎంతో వేగంగా జీవించి మరణించింది అంటే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. భారత దేశం లోని ప్రిన్సెస్ కుటుంబాలలో ఈమె సృష్టించిన తరంగాలు మరి ఏ ఇతర ప్రిన్సెస్ కూడా సృష్టించలేదు. కానీ పాపం ఆమె జీవించిన చివరి సంవత్సరాలు పుత్రుని కోల్పోవటంవలన కలిగిన వ్యధతో కూడినవి.
సీతాదేవి 1917లో మద్రాసులో పిఠాపురం రాజా, రావు వెంకట కుమార మహిపతి కృష్ణ సూర్యారావు దంపతులకు జన్మించింది.
సీతాదేవి మొదట ఉయ్యూరు జమీందారు, (7 గురు అన్నదమ్ములు ఉండటంవలన 18 పరగణాలు 288 గ్రామాలు కల నూజివీడు ఎస్టేట్ 7 ముక్కలుగా చీల్చబడింది. అందులో ఒకటి ఉయ్యూరు, అది కాక అందులో మీర్జాపురం, కపిలేశ్వర పురం, శనివారపుపేట ఇంకా మూడు ఎస్టేట్ లు ఉన్నాయి. ఇప్పటి గుడివాడ కూడా వారి ఎస్టేట్ లోనిదే.) Andhra University EX VC శ్రీ M R అప్పారావు గారిని వివాహం చేసుకుంది, అయితే ఆమె ఒక SOCIALITE, కానీ MR అప్పారావు గారు దానికి విరుద్ధం. అందుచేత ఆమె ఆయనతో సంతోషం గా ఉండలేకపోయింది. నిజామ్ కోడలు యువరాణి నీలోఫర్ సీతాదేవికి సన్నిహితురాలు. MR అప్పారావు గారితో, ఆమె ఒక కొడుకు విద్యుత్ కుమార్ అప్పారావుకు( Nickname TALLY) కు జన్మనిచ్చింది.
ఆమె 1943లో మద్రాసు రేస్ కోర్స్‌లో బరోడా మహారాజా ప్రతాప్ సింగ్ రావ్ గైక్వాడ్‌ను కలిసింది. అప్పుడు అతను ప్రపంచంలోని 8వ అత్యంత సంపన్నుడిగా మరియు భారతదేశంలో నిజాం తరువాత 2 వ అత్యంత సంపన్న రాజుగా పరిగణించబడ్డాడు.
గైక్వాడ్ ను ఆమె మనస్తత్వం పూర్తిగా ఆకర్షించింది. ఆయన పూర్తిగా ఆమె ఆకర్షణ లో పడిపోయాడు. సీతాదేవి కూడా గైక్వాడ్ ని ఇష్టపడింది, బహుశా అది అతని సంపద వల్ల కావచ్చు.అయితే అతనికి అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. అంతేకాదు గేక్వాడ్ తాతగారు వారి రాష్ట్రంలో ఏ పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండకూడదని నిబంధన కూడా పెట్టి ఉన్నారు.
గైక్వాడ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు, కానీ ఆమె అప్పటికే వివాహం చేసుకుంది మరియు MR అప్పారావు గారి నుండి విడాకులు అవుతాయి అని ఆమెకు, గైక్వాడ్ కు కూడా నమ్మకం కలగలేదు. కాబట్టి గైక్వాడ్ యొక్క న్యాయవాదుల సూచన మేరకు ఆమె ఇస్లాం మతంలోకి మారింది, దీని ద్వారా ఆమె మునుపటి వివాహం రద్దు చేయబడింది. ఆమె తిరిగి హిందూ మతంలోకి మారి గైక్వాడ్‌ను వివాహం చేసుకుంది.
అప్పుడు గైక్వాడ్ రాజా బహుభార్యత్వంపై రాష్ట్ర చట్టాన్ని ఉల్లంఘించాడని ఆంగ్లేయులు భావించారు మరియు సంజాయిషీ అడగడం కోసం అతనిని పిలిచారు. కానీ అతను ఆ విషయం పైన బ్రిటిష్ వారిని ఒప్పించగలిగాడు. కానీ బ్రిటిష్ వారు చివరి వరకు ఆమెను మహారాణి అని సంభోదించలేదు. 1946 లో గైక్వాడ్ ఆమెను యూరప్ పర్యటనకు తీసుకువెళ్లారు మరియు వారు మొనాకోలోని మోంటే కార్లోలో ఒక భవనాన్ని కొనుగోలు చేశారు. సీతాదేవి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు.
గైక్వాడ్ తరచుగా బరోడాలోని సంపదను మొనాకోకు తీసుకువస్తూ ఆమెను సందర్శించేవాడు. ఈ జంట అమెరికా కు 2 పర్యటనలు చేసారు, అప్పుడు అమెరికా ప్రయాణించడానికి మరియు షాపింగ్ లో వారు 10 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అది దాదాపు 1950 దగ్గర్లో జరిగింది. అంటే 1 కోటి అమెరికన్ డాలర్ లు. ఇప్పుడు దాని విలువ 82 కోట్ల రూపాయలు.
ఈ జంట బరోడా నిధి నుండి అమూల్యమైన ఆభరణాలను మొనాకో బదిలీ చేసారు (మీరు సీతాదేవి, బరోడా మహారాణిలోని వికీపీడియా పేజీలో వాటి జాబితాను కనుగొనవచ్చు) స్వాతంత్య్రానంతరం మన అధికారులు కొన్ని ఆభరణాలను తిరిగి పొందగలిగారు కానీ మిగిలినవి సీతాదేవికి చేరాయి.
1994లో భారత అధికారులు జెనీవా ఖజానాలో ఒక ముత్యాల తివాచీని తిరిగి పొందగలిగారు. ఈ ముత్యాల తివాచీ ప్రస్తుతం దోహాలోని మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్‌లో ఉంది. సీతాదేవికి వెళ్లిన స్టార్ అఫ్ ది సౌత్ మరియు బరోడా రాష్ట్రానికి చెందిన ఇతర ఆభరణాలు ఆమ్‌స్టర్‌డామ్‌లోని నగల వ్యాపారుల వద్ద ఉన్నాయి.
సీతాదేవి 1945లో గైక్వాడ్‌కు సాయాజీ రావ్ గైక్వాడ్ అనే ఒక కొడుకును ఇచ్చింది. ఆమెకు ఆ అబ్బాయి అంటే ప్రాణం. ఆమె తన కుమారునికి ముద్దుగా ప్రిన్సి అని పేరు పెట్టింది.
గ్రీక్ షిప్పింగ్ Magnate అరిస్టాటిల్ ఓనాసిస్ ఆమె స్నేహితుడు. ఒనాసిస్‌కు అప్పట్లో పెద్ద సంఖ్యలో ఓడల సముదాయం ఉండేది మరియు ప్రపంచంలోని ఆయన అత్యంత ధనవంతులలో ఒకరిగా పరిగణించబడేవాడు. వాళ్ళ గ్రూప్ ని ఆ టైములో ఇంటర్నేషనల్ జెట్ సెట్ అని పిలిచేవారు.
1953లో ఆమె తన ANKLETS మీద వేసుకున్న వజ్రపు పట్టీలను లండన్ లో ఉన్న ప్రముఖ నగల వ్యాపారులకు విక్రయించింది. అందులో చాలా పెద్ద పచ్చలు మరియు వజ్రాలు ఉన్నాయి. ఈ ఆభరణాలను ఉపయోగించి ఆభరణాల వ్యాపారులు ఒక అందమైన నెక్లెస్‌ను తయారు చేసి డచెస్ ఆఫ్ విండ్సర్‌కు విక్రయించారు.
1957 లో డచెస్ ఆ హారాన్ని ధరించి న్యూయార్క్ లో ఒక బాల్ కి వెళ్ళినప్పుడు. బాల్ కి సీతాదేవి కూడా వెళ్ళింది. డచెస్ హారాన్ని బాల్ కి వచ్చిన వారు చాలా గొప్పగా ఉంది అని మెచ్చుకుంటూ ఉండగా, సీతాదేవి తన పాదాలమీద ఉన్నపుడు ఆ ఆభరణాలు ఇంకా అందంగా ఉండేవి అనేసింది.
డచెస్ దానితో పరాభవానికి గురి అయ్యి ఆ హారాన్ని ఆ ఆభరణాలు తనకు అమ్మిన వ్యాపారులకు కోపంతో తిరిగి ఇచ్చేసింది. సీతాదేవికి కార్లంటే చాలా ఇష్టం ఒక MERCEDES W 126 MERCEDES కంపెనీ కి ఆర్డర్ ఇచ్చి తనకు నచ్చిన విధానంలో తయారు చేయించుకుంది. అంటే ప్రపంచంలో అలాంటిది మరి ఇంకొక కార్ ఉండదు అన్నమాట. ఆమె వద్ద ఒక రోల్స్ రాయిస్ కూడా ఉండేది.
కారణం మనకు తెలియదు కానీ ఆమె 1956లో గైక్వాడ్‌కు విడాకులు ఇచ్చింది.
మొనాకో ప్రిన్స్ రైనర్ ఆమెకు మరియు ఆమె కుమారుడికి మొనాకో పౌరసత్వాన్ని ఇచ్చారు. విడాకుల తర్వాత కూడా ఆమె తన విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించింది మరియు చివరికి 1974 లో దానిని నిర్వహించడానికి ఆమెకు తన ఆభరణాలలో కొన్నింటిని విక్రయించాల్సి వచ్చింది.
దురదృష్టవశాత్తు, ఆమె కుమారుడు 1985లో తన 40వ పుట్టినరోజు తర్వాత మద్యపానం మరియు మాదకద్రవ్య వ్యసనాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. MR కి ఆమెకు పుట్టిన పూర్వపు కుమారుడు కూడా అతిగా మద్యం సేవించి మరణించడం ఒక విషాదం. 4 సంవత్సరాల తర్వాత ప్రిన్సీ మరణం వలన కలిగిన వ్యధతో ఆమె 1989 లో తన 72 వ సంవత్సరంలో మరణించింది.
సినిమా కథలా సాగిన ఆ సీతాదేవి జీవితం చూడండి. ఆమె వేగంగా కదులుతున్న తోకచుక్కలా జీవితంలో ప్రయాణం చేసింది. కానీ మరి అదే ఆమె స్వభావం. దాని ప్రకారమే ఆమె జీవించి మరణించింది. బహుశా ఆమె తన జీవితం అలా ఉండాలని కోరుకుంది. కానీ ఆమె ఊహించని పుత్ర మృతి వ్యధ ఆమెను చివరి 4 సంవత్సరాలు పీడించింది.
THE FOLLOWING LINK SHOWS A SMALL LIST OF THE JEWELS OF SITADEVI
https://www.instagram.com/thediamondtalk/reel/CqPEEaUjo-s/
No comments:
Post a Comment