Sunday, 27 October 2024

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

 

భారత దేశం లో రాజు లేదా జమిందార్  బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినా సరే, అది కేవలం తమ స్వలాభం కోసం, పౌరుషం కోసం చేసారు తప్ప దేశాన్ని బ్రిటిష్ వారి నుండి విముక్తం చేద్దాం అనే ఉద్దేశంతో కాదు. ఆలా బ్రిటిష్ వారిని భారతదేశానికి ఒక పెద్ద ప్రమాదం అని భావించి వారిని దానికోసం ఎదిరించిన వాడు కేవలం టిప్పు సుల్తాన్ అతని తండి హైదర్ అలీ మాత్రమే. 

1857  లో జరిగిన మొదటి స్వతంత్ర సంగ్రామం కూడా ముఖ్యంగా డల్హౌసీ యొక్క "Doctrine of Lapse" అనబడే  విధానానికి విరుద్ధంగా జరిగింది. దాని ప్రకారం ఎవరైనా రాజు కు స్వంత సంతానం లేకపోతె వారు పెంచుకున్న వారికి సంస్థాన ఇద్దామా వద్ద అన్నది బ్రిటిష్ వారి ఇష్టం. వారు ఇచ్చే సంస్థాన పెన్షన్ లకు కూడా అదే విధానం వర్తిస్తుంది. మొదటి స్వతంత్ర సంగ్రామం లో పాల్గొన్న రాజులు  అందరు కూడా బ్రిటిష్  వారి విధాన వలన నష్టపోయిన వారే. కోపంతోనే వారు తిరుగుబాటు చేసారు. 

2019  సంవత్సరం లో  సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల అయ్యిందిఅందులో ఆయన మొదటి స్వతంత్ర పోరాటం చేసాడు అని చెప్పబడిందినరసింహారెడ్డి  బ్రిటిష్ వారి మధ్య యుద్ధం 1848  సంవత్సరం లో అయ్యిందిఅంతే కాదు నరసింహారెడ్డి చేసిన పోరాటం స్వతంత్రం కోసం కాదుఆయనకు ఇచ్చిన అతి తక్కువ పెన్షన్ అయిన నెలకు 11  రూపాయలు పెంచుకోవడం కోసం. ఆయన ఎప్పుడూ భారత్ దేశానికి బ్రిటీష్ వారి నుండి స్వతంత్రం కోరలేదుతనకు బ్రిటిషువారినుండి అన్యాయం జరిగింది అని పోరాటం చేసాడు అంతేఅంతే కాదునరసింహారెడ్డి 5000 సైనికులు ఉన్న తన సైన్యం తో, స్వంత జమిందారీలోనే పేద ప్రజలు జీవించే 4-5  గ్రామాలను కొల్లగొట్టాడు కూడా 

కానీ ఆయనకంటే ముందే బ్రిటిష్ వారితో పోరాటం సలిపిన అనేక భారతీయులు ఆంధ్ర దేశీయులుతెలుగువారు ఉన్నారుఅందులో ముఖ్యుడు తమిళనాడుకుచెందిన వీరపాండ్య కట్టబొమ్మన్ పేరు మీరు వినే ఉంటారుకట్టబొమ్మన్ ను బ్రిటిష్ వారు మొదటి పాళెగార్ యుద్ధంలో 1800  సంవత్సరంలో ఓడించారువిజయనగర సామ్రాజ్యం లోని జమిందార్,రాజా లను పాళెగార్ అని పిలిచేవారు

ఇందులో ఆంధ్ర దేశంలో బ్రిటిష్ వారితో జరిగిన మొదటి ముఖ్య తిరుగుబాటులను గురించి రాస్తున్నానుసైరా సినిమా విడుదల కాగానే  నూజివీడు రాజా నారయ్యప్పారావు గారి మీద ఒక వీడియో సోషల్ మీడియా లో వచ్చిందిఅందుకే  నోట్ రాద్దాము అని నాకు అనిపించింది.                                     

కట్టబొమ్మన్ కంటే కూడా ముందు 1778-83  లో నూజివీడు రాజా అయిన మేకా నారయ్యప్పారావు గారు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసారుబ్రిటిష్ వారు మొదటిగా నారాయప్పరావు గారి  పూర్వీకులు అయిన వెంకయ్య అప్పారావు గారి నుండి దివిపరగణా కు చెందిన బందరు లో కోట కట్టుకొనుటకై అనుమతి పొందారువారు క్రమముగా బలవంతులు అయ్యి నిజాం నుండి ఉత్తర  సర్కారులు  లు  పొందారుబ్రిటిష్ వారి బలము పెరగడం వలన వారు సహజంగా జమీందారులు మీద సామంత రాజులు మీద తమ ఆధిపత్యం అధికంగా ప్రకటించటం మొదలు పెట్టారు. 

దానితో అసమ్మతిఁ చెంది కొంత మంది జమీందారులు తిరుగుబాటు చేసారుఅందులో ముందు 1778  సంవత్సరంలో నారయ్యప్పారావు గారుతరువాత 1794  లో విజయనగర రాజు  అయిన  చిన విజయరామరాజు చేసిన తిరుగుబాట్లు పెద్దవి. 

నూజివీడు రాజా మేకా నారయ అప్పారావు  తిరుగుబాటు. 

బ్రిటిష్ వారు బలపడి కొంత కాలం తరువాత నూజివీడు సంస్థానం స్వాధీనపరచుకొనుటకు చూసిరిఅది సహించక నారయ్యప్పారావు గారు బ్రిటిష్ వారికి  కప్పము కట్టడం నిలిపివేసిరిఅందుకు కోపించి బ్రిటిష్ వారు 1783  సంవత్సరంలో కల్నల్ మౌంట్ గోమరీ నాయకత్వంలో నూజివీడు కోటను ముట్టడించిరి.అయన క్రింద ఇద్దరు మేజర్ లుఆరుగురు lieutenant లు బ్రిటిష్ సేనలను నడిపిరి.   

బ్రిటిష్ దళాలు 21  రోజులు కోటను ముట్టడించి ఉన్నాయికానీ వారు కోటను ఆక్రమించటానికి వెనుకాడారు ఎందుకంటే దగ్గరలోనే పాల్వంచ జమీందారు అయిన రామచంద్ర అశ్వారావు గారు సేనతో నూజివీడు కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు అని వారికి తెలిసిందిఒకవేళ కోటను ఆక్రమించటానికి ప్రయత్నం చేస్తే  వెనుకనుండి పాల్వంచ సేనలు తమను ముట్టడిస్తాయి అనిఅప్పుడు తాము రెండు సైన్యాల మధ్య చిక్కుకుని అపార నష్టం పొందుతాము అని వారికి అనిపించింది.. 

21   రోజున నారయ్యప్పారావు గారు కోటలో సభ జరిపి సమాలోచన చేసిరిఅప్పటికి బొబ్బిలి యుద్ధం జరిగి కేవలం 26  సంవత్సరాల కాలం మాత్రమే అయ్యిందిఅక్కడ జరిగిన ప్రాణ నష్టం అందరి మదిలోను మెదిలిందిబ్రిటీష్ వారిని ముట్టడిస్తే అపార ప్రాణ నష్టం తప్పదు అని చెప్పివారికి లొంగకుండా కోటలో నుండి తప్పుకొనుట మంచిది అని నిర్ణయానికి వచ్చారుతరువాతి రోజు తెల్లవారుజామున వ్యూహం ప్రకారం కోట పశ్చిమ గోడను ఫిరంగి తో ఛేదించి 10 ,000  మంది వెంట రాగా నారయ్యప్పారావు గారు బ్రిటిష్ సేనలను చీల్చుకుని Sunkollu  అడవి ని చేరిఅక్కడ ఉన్న రామచంద్ర అశ్వారావు గారి సేనతో కలిసి భద్రాచలం ప్రాంతానికి వెడలిరి పోరాటం లో ఒక బ్రిటిష్ lieutenant మరియు 194  మంది బ్రిటిష్ సైనికులు మరణించారు. 

భద్రాచలం కొండ ప్రాంతం అవటం వలనప్రజలు నారయ్యపారావు గారుఅశ్వారావు గార్ల పక్షం అందటం వలన బ్రిటిష్ వారు ఆయనను ఏమీ చేయలేకపోయారుచివరికి రాజముండ్రి కలెక్టర్మైలవరం జమీందార్లు వారితో మంతనాలు సలిపి రాజీకి తెచ్చి నారయ్యపారావు గారి కుమారుడు అయిన వెంకట నరసింహ అప్పారావు ( ధర్మ అప్పారావు)  గారికి  సంస్థానం అప్పగించిరిఈయనకు లార్డ్ క్లయివ్ స్వయంగా శాశ్వత sannadu ( సంస్థానాన్ని పాలించడానికి అధికారం  )  ఇచ్చెను 

విజయనగర రాజా చిన విజయరామరాజు తిరుగుబాటు. 

తరువాతి పోరాటం విజయనగర సంస్థానం నుండి జరిగింది. ముందుగా తండ్రి మరణించే సమయానికి చిన విజయరామరాజు చిన్న బాలుడు కావటం వలన అతని సవతి అన్న అయిన సీతారామరాజు జమిందారికి దివాన్ అయ్యి పాలించాడు  ఆతను మహా క్రూరుడు.

  1759 -68  మధ్య ఉన్న అరాజక పరిస్థితులు ఆధారంగా చేసుకుని అతను గంజాంవిశాఖపట్నం (ప్రస్తుత విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలుజిల్లాల లోని అందరు జమిందారులను ఓడించి కారాగారంలో బంధించి నిరంకుశంగా పాలన చేసాడుఅప్పటికి కేవలం గంజాం జిల్లాలోనే ఏకంగా 35,000  మంది సైన్యం, 34 కోటలు కలిగిన 20  మంది జమీందార్లు ఉన్నారుఅందులో పర్లాకిమిడిఘున్సూర్మొహిరిప్రతాపగిరి జమీందార్లు అనేక పర్యాయాలు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసారువారందిరినీ సీతారామరాజు ఓడించాడు. 

సీతారామరాజు పాలన ను ప్రజలు కూడా ఏవగించుకున్నారువిజయనగర బలం పెరిగి 1768  సంవత్సరానికి విజయనగర జమిందారును కాదని పాలించడం బ్రిటిష్ వారికి కష్టం అయిపొయిందిచిన విజయరామరాజు పెద్దవాడు అయ్యి సీతారామరాజు ని దివాన్ పదవి నుండి తొలగించాడుదానికి కోపగించి సీతారామరాజు బ్రిటిష్ వారితో చేతులు కలిపాడు. 

బ్రిటిష్ వారు విజయనగర Peshcus  పెంచడానికివిజయనగర సైన్యాన్ని తగ్గించడానికి వారు బాకీ పడ్డ 8,50,000  peshcush  రొక్కం వసూలు చేయడానికి ప్రయత్నించారుతాను బ్రిటిష్ వారికి peshcush  బాకీ పడలేదు అని విజయనగర జమీందారు నిరూపించాడు కానీ అది లెక్కపెట్టకుండా బ్రిటిష్ వారు విజయనగరాన్ని ఆక్రమించారుకానీ జమీందారు మీద భక్తి ఉన్న రైతులు బ్రిటిష్ వారికి శిస్తు కట్టడానికి నిరాకరించారుదానితో బ్రిటిష్ వారు జమిందారుకు నెలకు 1200 రూపాయలు పెన్షన్ గా నిర్ణయించి జమిందారును మచిలీపట్టణం వెళ్లిపోవలసింది గా ఆదేశించారుజమీందారు  ఆదేశాలు మన్నించక 1794  సంవత్సరం లో బ్రిటీష్ వారితో పద్మనాభం దగ్గర యుద్ధం చేసి వధించ పడ్డాడు. 

జమీందారు మరణం తరువాత జమీందారు కొడుకు అయిన నారాయణబాబు విశాఖ మన్యం లోని మక్కువ ప్రాంతం లో తల దాచుకున్నాడుఅక్కడ అతనికి కొండ దొరలుభక్తులు అయిన సర్దారులు తోడ్పడ్డారు. 1802 సంవత్సరంలో నారాయణబాబు కు బ్రిటిష్ వారికి సంధి జరిగిందిదాని ప్రకారం నారాయణబాబు బ్రిటిష్ వారికి 6,00,000  రూపాయలు peshcush  చెల్లించాడుబ్రిటిష్ వారు నారాయణబాబు కు అతని సంస్థానం తిరిగి ఇచ్చారు

 

No comments:

Post a Comment