Wednesday 17 October 2018

హిందూ దర్శనాలు వాటి తత్వాల సంకలనం



హిందూ తత్వ చింతన లో 6  సంప్రదాయాలు ఉన్నాయి. వాటి తత్వ చింతన వేదాల నుండి వచ్చినదే. అవి
1 . సాంఖ్య
2 . యోగ
3 . న్యాయ
4 . వైశేషిక
5 . పూర్వ మీమాంస
6 .ఉత్తర మీమాంస
సాంఖ్య దర్శనం.

సంప్రదాయాల లో కొంత సారూప్యం వున్నావైరుధ్యం కూడా ఉంది. ముందు మొదటిది ఐన సాంఖ్య సంప్రదాయాన్ని గురించి తెలుసుకుందాము. 

ఐతిహ్యం ప్రకారం సంప్రదాయాన్ని ప్రారభించినవాడు కపిలుడు. సంప్రదాయం అతి పురాతనం ఐనది. క్రిస్తు శకం 5  శతాబ్దం లో ఈశ్వర కృష్ణ రాసిన "సాంఖ్య కరిక" సంప్రదాయం యొక్క అతి ప్రాచీనమైన గ్రంధం. సాంఖ్య అనగా రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది సంఖ్య రెండవది సరి ఐన జ్ఞానం.

సాంఖ్య దానికి అదే ఒక పూర్ణమైన పధ్ధతి కాదు. ఎందుకంటే అది దాని బోధనలు ఎలా అనుసరించి జీవితంలో సఫలం చేసుకోవాలో చెప్పదు. దాన్ని అనుసరించడానికి "యోగ" సంప్రదాయం సహాయం చేస్తుంది. అందుచేత సాంఖ్య- యోగ రెండిటిని కలిపి ఒకే పూర్ణమైన పద్ధతిగా వ్యవహరిస్తారు.

సాంఖ్య రెండు సత్వాలను అంగీకరిస్తుంది. అవి "పురుషుడు" మరియు "ప్రకృతి"

సాంఖ్య ఒక బుద్ధి కుశలత కల పధ్ధతి. అది పురుషుడు మరియు ప్రకృతి మధ్య స్పష్టమైన భేదం ఉంది అని నమ్ముతుంది. అనేకమంది పురుషులు ఉన్నారు అని నమ్ముతుంది సాంఖ్య. అది దేముడి ఊసు ఎత్తదు .

మనకు కనిపించే ప్రతి వస్తువు మరియు పదార్థం ప్రకృతి యొక్క పరిణామం వల్ల ఏర్పడినదే. అవి ప్రకృతి లో అంతర్గతంగా ఉండి సృష్టి సమయంలో బయటికి వచ్చి విలయం సమయంలో మల్లి దానిలో ఇమిడిపోతాయి.

పురుషులు అందరు ఒక శుద్ధమైన ఇంద్రియాతీత స్మ్రుతి ని కలిగి ఉంటారు. వారు ఒక కడపటి జ్ఞానం కలవారు మరియు వారి జ్ఞానం సమస్తానికి మూలం. పురుషుడు ఒక స్వచ్ఛమైన పదార్థం. అది అనిర్వచనీయమైనది ఊహకు అందనిది. అది కారణం లేనిది, అనాది నుండి ఉన్నది మరియు సమస్తాన్ని ఆవరించి ఉన్నది. పురుషులు అందరు సమానమే కేవలం సంఖ్యలో మాత్రం వేరు అంతే.  

ప్రకృతి అనుభవించబడేది, పురుషుడు అనుభవించేవాడు. పురుషుడి కి అనుభవించడానికి మోక్షం పొందడానికి ప్రకృతి సహాయం కావాలి. సంసారానికి కైవల్యానికి కూడా అంతే.

పురుషుడు బంధనానికి, మోక్షానికి, పుణ్యానికి, పాపానికి అతీతం. పురుషుడు నేను అనే భావం వల్ల బుద్ధి వల్ల తాను బంధనాల  లో ఉన్నాడు అనుకుంటాడు. పురుషుడు తన స్వచ్ఛమైన ఉనికిని ఎప్పుడు గ్రహిస్తాడో అప్పుడు సర్వ బంధనాల నుండి విముక్తుడు అవుతాడు.

మంచి, చెడు క్రియలు  స్వర్గానికి, నరకానికి దారి తీయవచ్చు కానీ సరి ఐన జ్ఞానం మాత్రమే పురుషుడిని విముక్తుడిని చేస్తుంది.  సాంఖ్య చెప్పే మోక్షం లో సుఖం కానీ అసుఖం కానీ ఉండదు. అప్పుడు భావం అనేదే నశించిపోతుంది.

సాంఖ్య ప్రకారం పురుషుడి బంధన అనేది ఒక కట్టు కధ. బంధించబడేది, విముక్తి చెందేది రెండూ ప్రకృతి మాత్రమే.

సాంఖ్య దేముడి ఊసు ఎత్తకపోవడానికి కారణం అది వర్ణించిన ప్రకృతి, పురుషుల వలన సమస్త విశ్వాన్ని వర్ణించవచ్చు.

తత్వాన్ని చాల వరకు సులభతరం చేసి అర్ధం అయ్యేలా చెబుదాము అనుకున్నాను. కానీ ఎంత చేసినా ఇప్పుడు కూడా ఇది తత్త్వం గురించి పరిచయంలేని వారికి అర్ధం అవక తల పై నుండి పోతుంది. ఆలా జరిగిన వారు నన్ను సహృదయంతో క్షమించాలి.

నా ఉద్దేశం మనకు కేవలం మన మతం మాత్రమే కాక మన తత్త్వం  కూడా అందరికి గ్రాహ్యం కావాలి అని. తరువాతి భాగంలో "యోగ" తత్వాన్ని గురించి రాస్తాను. "యోగాన్ని" అర్థం చేస్కోవడం సులభం ఎందుకంటే అది మొత్తం సాంఖ్య యొక్క తత్వాన్ని తీసుకుంటుంది. తరువాత మోక్షాన్ని చేరే పద్ధతిని ఉటంకిస్తుంది.  

యోగ దర్శనం.

 యోగ శాస్త్ర గురువు పతంజలి. అయన రచించిన "యోగ సూత్రాలు" అనే గ్రంధం యోగ దర్శనానికి మూలం.

ఆయనకు యోగ అంటే శరీరం యొక్క స్వాధీనాన్ని సాధించి, ఇంద్రియ జ్ఞానంతో బుద్ధితో  పురుషుడి మధ్య, ప్రకృతి మధ్య సరి ఐన విచక్షణ గ్రహించటానికి చేసే ఆధ్యాత్మికమైన ప్రయత్నం.

యోగ దర్శనం సాంఖ్య యొక్క తత్వాన్ని పూర్తిగా గ్రహిస్తుంది. కానీ మరి సాంఖ్య లో దేముడు అనే భావం లేదు కదా? యోగ, దేముడు అనే భావాన్ని సాంఖ్య తత్వానికి  జోడిస్తుంది. యోగ ప్రకారం దేముడు అన్ని పురుషుల కంటే ఉత్తమమైన, భిన్నమైన పురుషుడు. అందుచేత యోగ ను ఈశ్వర సాంఖ్య అని కూడా అంటారు.

అష్టాంగ యోగ శరీరం మీద, భావాల మీద, మనసు మీద మనకు అధికారం ఉండాలి అని చెప్తుంది. ప్రపంచ బంధాలు, సుఖాలు శరీరాన్ని మరియు బుద్ధిని ఇతర మార్గంలోకి మళ్లిస్తాయి. వాటిని జయించటానికి యోగ అష్టాంగ పద్ధతిని మనకు సూచిస్తుంది. ఆపద్ధతిలో కింద సూచించిన క్రియలు ఉన్నాయి.

1. యమ- విసర్జనం లేదా విడిచిపెట్టుట
2. నియమ- స్వయం సంస్కారం
3. ఆసన- యోగ ఆసనాలు
4. ప్రాణాయామ- ఊపిరి వ్యాయామం
5. ప్రత్యాహార- భావాలను స్వాధీనంలో ఉంచుకోవడం
6. ధారణ- బుద్ధిని ధ్యానం చేస్తున్న దాని మీద నిలపడం
7. ధ్యాన- ఆపకుండా ధ్యానం చేయడం
8. సమాధి-ధ్యానంలో ధ్యానం చేసే మనసు ధ్యానం చేసే వస్తువుతో లీనం అవడం

సమాధిలో 2  రకాలు ఉన్నాయి.

అందులో మొదటి రకాన్నిసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇందులో మనసు, ధ్యానం నిలిపిన వస్తువు ఒకదానిలో ఒకటి లీనం అవుతాయి. కానీ ధ్యానం యొక్క ఎరుక ఉంటుంది.

రెండవ రకం అసంప్రజ్ఞాత సమాధి. ఇందులో మనసు ధ్యానం చేయబడే వస్తువు రెండూ ఏకం అయిపోతాయి. ఇందులో రెండిటికి తేడా నశించిపోయి ధ్యానం యొక్క ఎరుక కూడా పోతుంది.

పతంజలి దేముడిని ఒక విశేష పురుషుడిగా భావించాడు. దేముడు ఎప్పుడూ విముక్తంగానే బంధం లేకుండానే ఉంటాడు. దేముడు కర్మ సిద్ధాంతానికి అతీతం. అయన సర్వ శక్తిగలవాడు, సర్వ వ్యాప్తంగా  ఉంటాడు, అయన సర్వజ్ఞుడు.

అయన శుద్ధమైన జ్ఞానం కలవాడు. దేముడి మీద భక్తి కలిగి ఉండటం ఏకాగ్రత పొందడానికి ఒక సరి ఐన మార్గం. దేముడు పురుషుడు మరియు ప్రకృతి మధ్య సంభందం ఏర్పడడానికి, నశించటానికి కూడా కారణం.    

వైశేషిక- న్యాయ దర్శనాలు .

దర్శనాల లో సాంఖ్య అతి ప్రాచీనం ఐనది అయితే, దాని తరువాత వచ్చింది వైశేషిక దర్శనం. ఇది బుద్ధ, జైన సంప్రదాయాల కంటే ప్రాచీనం ఐనది. అంటే దాదాపు క్రిస్తు పూర్వం 6    శతాబ్దం ముందే  ఆవిర్భవించింది.
దర్శనానికి మూల పురుషుడు కణాదుడు. ఆయనకు కనభుక్, ఉలూక మరియు కశ్యప అని కూడా ఇతర  నామాలు ఉన్నాయి.  

వైశేషిక మీద మొదటి గ్రంధం ప్రశాశ్తపాదుని "పదార్థధర్మసంగ్రహ"

వైశేషిక తరువాతి కాలం లో న్యాయ దర్శనం తో కలిసిపోయి ఒక పెద్ద దర్సనంగా రూపాంతరం చెందింది. 

ఒక వస్తువుని తీసుకుని దాన్ని ముక్కలుగా విభజించుకుంటూ పొతే చివరికి ఒక చిన్న ముక్క ఇక మాత్రం విభజించాడనికి సాధ్యం కానిది ఏర్పడుతుంది. అదే అణువు.

వైశేషిక దర్శనం ప్రకారం భూమి సమస్తము అణువుల కలయిక వల్ల ఏర్పడింది. అణువులకు ఆది కానీ అంతం కానీ లేవు. అణువులు సృజించబబడవు  అలాగే అవి నాశనం కూడా అవ్వవు. సృష్టి అణువులు వివిధ కలయికల వల్ల ఏర్పడింది, అలాగే నాశనం అంటే కలయికలు  నశించిపోవడం.

అణువుల లో 4  రకాలు ఉన్నాయి. అవి భూమి, నీరు, అగ్ని మరియు వాయువు. అణువులు ఒకదానినుండి ఒకటి పరిమాణం లోను గుణం లోను భిన్నంగా ఉంటాయి. అవి గోళాకారంలో ఉంటాయి. అవి ఆత్మలతో పాటు సహజీవనం చేస్తాయి. మనకు కనిపించే ప్రపంచానికి కారణం అవే.

అణువులు వాటికీ అవి స్తబ్దంగా ఉంటాయి. వాటికి చలనం కలుగ చేసేది ధర్మం మరియు అధర్మం. రెండు వ్యక్తిగత ఆత్మల లో ఉంటాయి.  

వైశేషికం వేదాల అధికారాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. కణాదుడు ఎప్పుడూ భగవంతుడిని గురించి ప్రస్తావించలేదు కాని వైశేషిక సూత్రాల మీద గ్రంధాలూ రాసిన వారు అందరు ప్రసస్తపాద, శ్రీధర, ఉదయన తో సహా అందరు దేముడి ని నమ్మిన వారే.

వైశేషిక ప్రకారం వేదాలు చెప్పేది నిజం కాని అవి అది లేనివి కాదు అలాగే అవి రచయిత లేనివి కూడా కాదు. అవి భగవంతుని వాక్కు. భగవంతుడు సర్వాంతర్యామి, అది అంతం లేనివాడు మరియు సర్వోత్కృష్టుడు. కర్మ సిద్ధాంతం ధర్మం అధర్మం అనే వాటి సాయంతో దేముడిని నడుపుతాయి.

అణువులు ఆత్మలు దేముడితో సహజీవనం చేస్తాయి. అవి దేముడి లాగే అది అంతం లేనివి. దేముడు వాటిని సృష్టించలేడు. ఆయన కేవలం అణువులకు మొదటి సారి  తోసి కదిలిస్తాడు అంతే.    

వైశేషిక ప్రకారం బంధం అనేది అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది. సరి ఆయన జ్ఞానం వలన మోక్షం వస్తుంది.

ఆత్మ అజ్ఞానం వల్ల కర్మ చేస్తుంది. కర్మ వలన పాపం పుణ్యం అనేవి కలుగుతాయి. వేదాల లో చెప్పిన విధంగా చేసిన కర్మల వలన పుణ్యం, దానికి వ్యతిరేకంగా చేసిన దాని వలన పాపం కలుగుతాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలకు పుణ్యాలకు ఫలితం అనుభవించాల్సిందే. బాదం నుండి వీడాలి ఆంటే ఆత్మ కర్మ అనేదే మానుకోవాలి.

కర్మ మానుకున్నపుడు పాపం పుణ్యం ఆత్మకు చేరడం ఆగిపోతుంది. అలాగే పాట కర్మలు అన్ని క్షీణించిపోతాయి. అప్పుడు ఆత్మ బుద్ధి ని శరీరాన్ని వదిలి దాని యొక్క స్వచ్ఛమైన గుణాన్ని తెలుసుకుంటుంది. అదే మోక్షం. మోక్షంలో నొప్పి అనేది పూర్తిగా నశించిపోతుంది.

అప్పుడు ఆత్మ దాని యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకత ను కలిగి ఉండి దాని కదే ఉంటుంది. అప్పుడు ఆత్మ  కు ఏమి తెలియదు, అది ఏమి గ్రహించదు ఏమి చేయదు.    

న్యాయ దర్శనానికి మూల పురుషుడు గౌతముడు. ఆయనకు అక్షపాద అని నామాంతరం కూడా వుంది.
గౌతముని "న్యాయ సూత్రాలకు" వాత్సాయనుడు తన "న్యాయ భాష్యంలో" భాష్యం రాసాడు. 
  
పూర్వ మీమాంస

మనం ఇదివరకు చెప్పుకున్న దర్శనాల లో సంఖ్యా-యోగ న్యాయ-వైశేషిక సంబంధం కల పద్ధతులు అని ఎలా అనుకున్నామో అలాగే పూర్వ మీమాంస-ఉత్తర మీమాంస రెండూ కూడా సంబంధం గల పద్ధతులు.

వేదాలలో మొదటి భాగం ఆయన సంహిత, బ్రహ్మణ భాగాన్ని కర్మ కాండ అంటారు.  వాటి తర్వాత వేదాల లో ఉన్న అరణ్యకాలు  ఉపనిషత్హులను కలిపి జ్ఞాన కాండ అంటారు.

పూర్వ మీమాంస వేదాలలో  మొదటి భాగం ఐన  కర్మ కాండ తో  ఉత్తర మీమాంస దానిలో రెండవ భాగం ఐన జ్ఞాన కాండ తో  వ్యవహరిస్తాయి .

మీమాంసకారుడు ఐన కుమారిల భట్టు రెండు దర్శనా మధ్య వారధిలాంటి వాడు. ఈయనతో శంకరాచార్యులు వాదన చేద్దాము అని వెళితే అప్పటికే అయన గంగానది వొడ్డున చితిలో దిగి ఆత్మాహుతుతి చేసుకుంటున్నాడు. అప్పుడు అయన శంకరాచార్యుని తన శిష్యుడు ఐన మండన మిశ్రా తో వాదన చేయమని చెప్పి చితిలో ప్రవేశించాడు.

పూర్వ మీమాంస వేదాలను అది లేనివి, రచయిత లేనివి మరియు సర్వజ్ఞమైనవి అని నమ్ముతుంది.

వేదాల లోని కర్మ కాండ కేవలం మంత్రాలూ బలులు మరియు ఆచారాలు మీద ఆధార పడినట్టిది కానీ మీమాంస లో  వేదాల పద్ధతి కి ఒక తత్వ సమాధానం కోసం వెతకటంవల్ల మరియు వేదాలలో ఉన్న స్వర్గం అనే దాన్ని మోక్షం అనే మార్గం గా మార్చటంవల్ల అది ఒక దర్సనంగా మారుతుంది.

దర్శనం యొక్క అతి ప్రాచీనమైన గ్రంధం జైమిని రాసిన "మీమాంస సూత్రాలు". ఇది దాదాపు క్రిస్తు పూర్వం 300  నుండి 200  మధ్యలో రాయబడింది. దాని మీద శబరస్వామి ఒక భాష్యం రాసాడు. భాష్యాన్ని కుమారిల భట్టు మరియు ప్రభాకర మిశ్రా వారి వారి పద్ధతిలో వివరించారు. వివరణల వల్ల  వారి పేర్లతో రెండు మీమాంస పద్ధతులు విడివడ్డాయి. వారు ఇద్దరు కొన్ని విషయాల లో విభేదిస్తారు. 

మీమాంస జ్ఞానం అంతా స్వయం ప్రమాణత్వం అని నమ్ముతుంది. జ్ఞానం అంతా వాస్తవమైనది. కొన్ని విషయాలలో ఆలా కాదు అనిపించటానికి కారణం ఇతర బాహ్య కారణాల వల్ల మాత్రమే.  

మీమాంస బాహ్య ప్రపంచం, మరియు ఆత్మలు వాస్తవమైనవి అని నమ్ముతుతుంది. ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని ఆత్మలు, అవి కాకుండా శరీరాలు లేని మోక్షం సాధించిన ఆత్మలు కూడా ఉంటాయి. అలాగే అంతులేని సంఖ్యలో అణువులు మరియు అది నుండి ఉండే అనంతమైన పదార్థాలు ఉంటాయి.

మీమాంస కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. అలాగే స్వర్గాన్ని, నరకాన్ని మరియు అది లేని వేదాలు పరమ సత్యం అని కూడా నమ్ముతుంది. దేముడు అనే సిద్ధాంతం అనవసరం అంటుంది మీమాంస.

మీమాంస ప్రపంచానికి అది అంతం ఉంది అని నమ్మదు. ప్రపంచం ఎప్పుడూ సృష్టించబడలేదు, అలాగే అది ఎప్పటికి నాశనం అవదు అని నమ్ముతుంది. ఆత్మలు శరీరాల లోకి వచ్చి వెళ్లినా, వస్తువులు జన్మించి నశించినా సరే ప్రపంచం మాత్రం ఒక పూర్ణంగా అంతం లేకుండా సాగిపోతుంది. ప్రపంచం ఎప్పుడూ ఇప్పుడు ఉన్నట్టే ఉంది కాని మారలేదు.

జైమిని ప్రకారం ధర్మం అంటే మానవులను కర్మ చేయించే ఒక ఆజ్ఞ. ధర్మం మరియు మోక్షం గురించి వేదాల మాత్రమే తెలుపుతాయి.

ప్రపంచంలో చేసిన కర్మ ఆత్మలో ఒక గ్రాహ్యం కాని శక్తి ని కలిగిస్తాయి. కర్మ తనకు ఉన్న అడ్డులు తొలగగానే సరి ఆయన సమయం రాగానే ఫలిస్తుంది. ఆత్మకు శరీరంతో ఉన్న బంధం వల్ల, ఇంద్రియగోచరత్వం వల్ల, బుద్ధి వల్ల  ఆత్మ శరీరానికి బంధించబడుతుంది.

ఆత్మకు ఉండే సాహచర్యం వలన ఆత్మ బంధించబడుతుంది. కర్మ చేయడం మానివేస్తే అది ఆత్మను దాని సర్వ గుణాలను త్యజింపచేసి దాని యొక్క స్వచ్ఛమైన స్థితికి తీసుకుని వెళుతుంది. అదే మోక్షం.

ఉత్తర మీమాంస లేక వేదాంత.

మన షడ్దర్శనాలలో ఆఖరిది ఉత్తర మీమాంస అనబడే వేదాంత దర్శనం

దర్శనానికి మూల గ్రంధం క్రిస్తు పూర్వం 5 శతాబ్దంలో రాయబడిన బాదరాయణుడి " బ్రహ్మసూత్రాలు". బాదరాయణుడు వేద వ్యాసుడు అనే పేరుతొ కూడా పిలువబడతాడు.

బ్రహ్మసూత్రాల మీద శంకరాచార్యులు, రామానుజాచార్యులు మరియు మధ్వాచార్యులు రాసిన భాష్యాలు ప్రామాణికమైనవి అని నమ్ముతారు. వేదాంతంలో వచ్చినముఖ్య సంప్రదాయములు బ్రహ్మసూత్రాలకు ముగ్గురు రాసిన భాష్యాల వలన వచ్చినవే. అవి 1 . అద్వైత, 2 . విశిష్టాద్వైత మరియు 3 . ద్వైత.

ముగ్గురిలో అతి ప్రాచీనం అయినవాడు శంకరాచార్యులు. ఈయన దాదాపు క్రిస్తు శకం 790  సంవత్సరంలో పుట్టి 32  సంవత్సరాలు జీవించాడు  ఆయన తరువాత రామానుజాచార్యులు దాదాపు క్రిస్తు శకం 1020  సంవత్సరంలో పుట్టి 102  సంవత్సరాలు జీవించాడు. అయన తరువాత మధ్వాచార్యులు క్రిస్తు శకం 1120  లో పుట్టాడు.    

మూడు సంప్రదాయాలలోను అద్వైతం ముఖ్యం ఐనది. విశిష్టాద్వైతం, ద్వైతం కేవలం భక్తి మార్గంలోనే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడం సాధ్యం అని నమ్ముతాయి. కాగా అద్వైతం, జ్ఞానం ద్వారా మాత్రమే బ్రహ్మస్వరూపాన్ని చేరుకోగలము అని భావిస్తుంది.

వైష్ణవానికిముఖ్య సంప్రదాయాలు ఉన్నాయివిశిష్టాద్వైత, ద్వైతాలు కూడా వైష్ణవం లో ఉన్న4 ముఖ్య సంప్రదాయాల్లో 2 .    

హిందూ తత్వ చింతనలో అద్వైతం ముఖ్యమైనది. అందుచేత అది ఏమి చెపుతుందో ఇప్పుడు చూద్దాము.

తాను జీవించిన 32  సంవత్సరాల లోనే శంకరాచార్యులు భారతదేశ నాలుగు మూలల పర్యటించి, హిందూ ధర్మాన్ని, అద్వైతాన్ని బోధిస్తూ అనేక పూర్వ మిమాంసికులతో, బౌద్ధులతో, జైనులతో వాదనలు చేస్తూ దేశం 4 మూలలలోను  మఠాలు స్థాపించాడు.

అయన పర్యటన సమయంలో భారతదేశంలో ఒక పెద్ద సామ్రాజ్యంలేదు. దేశం అంతా ముక్కలుగా విడివడి ఉంది. అందుచేత దేశంలో మార్గాలు అన్ని దొంగలతో, దోపిడీదారులతో నిండి ఉండేవి. ఇక అరణ్య మార్గాలు అయితే చెప్పనక్కరలేదు. అయినా సరే శంకరాచార్యులు దేశాన్ని పర్యటించినపుడు విషయాన్ని మాత్రం లెక్కచేయలేదు.

సంప్రదాయం యొక్క మొదటి గ్రంధం క్రిస్తు శకం శతాబ్దం లో గౌడపాదుడు రాసిన "మాండూక్య కరిక".దీనినే "ఆగమ శాస్త్ర" అని కూడా అంటారు. గ్రంధం మాండూక్య, బ్రిహదారణ్యక మరియు చాందోగ్య ఉపనిషత్తుల నుండి భావాలను గ్రహిస్తుంది. శంకరాచార్యులు కరిక మీద భాష్యం రాసాడు.

శంకరాచార్యుని ప్రకారం అంతిమ సత్యం, ఆత్మ మరియు బ్రహ్మ స్వరూపం. అవి రెండు ఒకటే కానీ వేరు కాదు.

బ్రహ్మ స్వరూపం గుణాలు, వర్గాలు లేని ఒక స్వచ్ఛమైన స్పృహ. బ్రహ్మ స్వరూపం దాని యొక్క సామర్ధ్యం అయిన మాయ తో సృష్టించే, రక్షించే మరియు వినాశనం చేసే భగవంతుడిగా అగుపిస్తాడు. సర్వ ప్రపంచం బ్రహ్మస్వరూపం యొక్క రూపం మాత్రమే.

శంకరాచార్యుల ప్రకారం దృగ్గోచరం అయ్యే ప్రపంచం నిజమైనదే కానీ మాయ కాదు. అది ఈశ్వరుని యొక్క సృష్టి. జీవుడు బ్రహ్మస్వరూపం అనే నిజాన్నిమరచిపోయి కనబడే ప్రపంచం మాత్రమే నిజం అని నమ్మి అందులో తాను చేసేవాడిగాను అనుభవించేవాడిగాను భావిస్తుంది.

జీవుడు జ్ఞానం ద్వారా, కర్మతో నిమిత్తం లేకుండా తాను బ్రహ్మస్వరూపమే కానీ వేరు కాదు అని ఎప్పుడు గ్రహిస్తుందో అప్పటికి అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. దాని తరువాత జీవి మరణించాక చివరికి అది బ్రహ్మస్వరూపం లో ఐక్యం అవుతుంది.

ఈశ్వరుడు సర్వ సృష్టి కి మూలం కానీ వివిధ ప్రాణులు తమ కర్మల వలన వివిధ ఫలాలను సంక్రమించుకుంటాయి. సృష్టి కి ఎలా ఆది లేదో అలాగే కర్మలకు కూడా ఆది లేదు.

అందువలన సృష్టి అనేది అసలైన నిజం కాదు. అది కేవలం మాయ వలన ఆత్మ కు కలిగే భ్రమ మాత్రమే. మాయ నుండి ఆత్మ జ్ఞానం వలన తన స్థానం తాను తెలుసుకోగలుగుతుందో అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది

శంకరాచార్యులు ఒక గొప్ప మేధావి. అయన వేదాలలో చెప్పిన విషయాలు అన్నిటిని గ్రాహ్యం చేసుకుని వాటిని తర్కం ద్వారా విశ్లేషించి ఆయనకు నచ్చిన విధంగా ఒక పద్దతి ని తయారు చేసాడు.