Saturday 24 August 2019

వెలమల చరిత్ర ఆరంభం- కాకతీయ సామ్రాజ్యం.


పల్నాటి యుద్ధం క్రిస్తు శకం 1178 -82  మధ్యలో జరిగింది. అందులో బ్రహ్మనాయుడు రేచెర్ల గోత్రజుడైన వెలమ దొర  అని చెప్పబడింది. ఆ తరువాత క్రిస్తు శకం 1199 లో రాజ్యానికి వచ్చిన గణపతిదేవుని కొలువులో పద్మనాయక వెలమలు ముఖ్య పాత్ర పోషించారు.

అలాగే వారు అయన వారసులు ఐన రుద్రమదేవి, ప్రతాపరుద్రుని కొలువులో ముఖ్యపాత్రలు పోషించారు. వారు కాకతీయ సామ్రాజ్య విచ్చిన్నం తరువాత నల్గొండ లోని రాచకొండ రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.        

వెలమల చరిత్ర కాకతీయ సామ్రాజ్యంతో ఘాడంగా ముడిపడి ఉంది. అందుచేత వెలమ చరిత్రకు కాకతీయ సామ్రాజ్య చరిత్ర మూలం. ఇక్కడ కాకతీయ సామ్రాజ్య చివరి చరిత్ర క్లుప్తం గా  పరిశీలిద్దాము. 

రాణి రుద్రమ దేవి కి కొడుకులు లేరు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారు రుయ్యమ, రుద్రమ మరియు ముమ్మిడమ్మ. ముమ్మిడమ్మ పుత్రుడు ప్రతాపరుద్రుడు. ఆయనను రుద్రమదేవి దత్తత స్వీకరించి తన తరువాత కాకతీయ సామ్రాట్ చేసింది. ప్రతాపరుద్రుని కాలం లో కాకతీయ సామ్రాజ్యం ఉచ్చ స్థితిని చేరింది, కానీ తరువాత అది ముక్కలుగా విడిపోవడం కూడా ప్రారంభం అయ్యింది. ప్రతాపరుద్రుడు తన రాజ్యం లోనే వెలమ రెడ్డి, కాయస్థ రాజుల తిరుగుబాటులను ఎదుర్కోవలసి వచ్చింది.

నాయంకర విధానాన్ని ప్రతాపరుద్రుడు ప్రక్షానలం చేసి సామ్రాజ్యాన్ని 77  నాయంకరాలు గా విడతీసి వాటిని తనకు విశ్వాసపాత్రులైన సైన్యాధిపతులకు అప్ప చెప్పాడు. ప్రక్షానలం లో వాటిలో ఎక్కువ నాయంకరాలు వెలమలకు ఇవ్వబడటం వల్ల అప్పటి స్థానిక  చరిత్రల ప్రకారం రెడ్డి సైన్యాధిపతులకు కోపం వచ్చింది.

1303 -1310  సమయ లో కాకతీయ సామ్రాజ్యం మీద ముస్లిం దండయాత్రలు జరిగాయి. అది అదనుగా చూసుకుని గండికోట సామంత రాజు ఐన వైదుంబ మల్లిదేవుడు మరియు నెల్లూరు రాజైన రంగనాథుడు స్వతంత్రం ప్రకటించారు. అప్పుడు కాకతీయ సైన్యాలు జుట్టాయిలెంక  గొంకారెడ్డి నాయకత్వం లో మల్లిదేవుని తిరుగుబాటు అణచి గండికోట ను స్వాధీనం చేసుకున్నాయి.

ఇంతలో పాండ్య రాజ్యం లో అంతః కలహాలు చెలరేగాయి. అది అదనుగా చూసుకుని ప్రతాపరుద్రుడు సైన్యంతో పాండ్యులను ముట్టడించారు. యుద్ధం లో ప్రతాపరుద్రుని సైన్యాధిపతులు  ఐన ముప్పిడి నాయక, పెదరుద్ర, రేచెర్ల ఎర దాచానాయక మరియు దేవరినాయకులు ముఖ్య భూమిక పోషించారు.

కాకతీయ సామ్రాజ్యం పైన ముస్లిం మొదటి దండయాత్ర 1303  సంవత్సరం లో జరిగింది.ఢిల్లీ సుల్తాన్  అయిన అల్లాఉద్దీన్ ఖిల్జీ తన సైన్యాధిపతి మాలిక్ ఫ్యాక్రుద్దిన్ జునా ను ఒక పెద్ద సైన్యంతో ఓరుగంటిని ముట్టడించడానికి పంపాడు. సైన్యాన్ని వెలమ నాయకులు ఐన రేచెర్ల వెన్నమనాయక మరియు పోతుగంటి మైలి ఉప్పరపల్లి దగ్గర ఓడించారు. 

తిరిగి 1309  లో అల్లాఉద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ ను ఓరుగంటిని ముట్టడించడానికి పంపాడు. యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఓడి సంధి చేసుకున్నాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణించగానే ప్రతాపరుద్రుడు ఢిల్లీ కి కడుతున్న కప్పం చెల్లించడం ఆపేసాడు.

అప్పుడు ముబారక్ ఖిల్జీ ఖుస్రో ఖాన్ కి సైన్యం ఇచ్చి ఓరుగంటిని ముట్టడించడానికి పంపాడు. యుద్ధం లో ఏమి జరిగిందో చారిత్రక ఆధారాలు లేవు. కానీ అమిర్ ఖుస్రో ప్రకారం ప్రతాపరుద్రుడు యుద్ధంలో ఓడించబడి పెద్ద మొత్తం ఢిల్లీ సుల్తానుకు చెల్లించాడు.

కాకతీయ సామ్రాజ్యం మీద చివరి ముస్లిం దండయాత్ర సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ సమయంలో 1321 -22  లో జరిగింది. ముస్లిం సైన్యాలు వచ్చి యువరాజు అయిన జునా ఖాన్ లేదా ఉలుఘ్ ఖాన్ లేదా మహమ్మద్ బీన్ తుగ్లక్ సారధ్యంలో ఓరుగంటిని ముట్టడించాయి. ముట్టడి 6  మాసాలు సాగినా సరే  ముస్లిం సైన్యాలు గెలవలేక పోయాయి. ఇంతలో ముస్లిం గుడారాల్లో ఢిల్లీ సుల్తాన్ చనిపోయాడు అని ఒక పుకారు పుట్టింది. అది చూసి ఇద్దరు ముస్లిం సైన్యాధిపతులు తిరుగుబాటు చేసి ప్రతాపరుద్రుని తో మంతనాలు చేసారు. దాని వలన ఉలుఘ్ ఖాన్ సైన్యం వేణు తిరగవలసి వచ్చింది. తిరోగమనం చేస్తున్న ముస్లిం సైన్యాలను ప్రతాపరుద్రుని సైన్యం వెంబడించి గొప్ప నష్టం కలిగించింది.

ఉలుఘ్ ఖాన్ దేవగిరి దుర్గానికి తిరోగమించి అక్కడ కొత్త సైన్యం కోసం నిరీక్షించాడు. ఢిల్లీ నుండి సైన్యం రాగానే ఉలుఘ్ ఖాన్ తిరిగి ఓరుగంటిని ముట్టడించాడు.  ఇంతలో ప్రతాపరుద్రుని సైన్యం లో కుల బేధాలు పెరిగి పోయాయి. రెడ్డి సైన్యాధిపతులకు కాకతీయుల మీద వెలమ సైన్యాధిపతుల మీద కోపం వచ్చింది. దానికి తోడు వారి అశ్వ దళం కానీ ఫిరంగులు కానీ ముస్లిం సైన్యాల వాటికి దీటు అయినవి కాదు.

పులి మీద పుట్ర లా సంకుల సమరం జరుగుతుండగా బొబ్బా రెడ్డి అనే సైన్యాధిపతి తన సైన్యాన్ని యుద్ధ భూమి నుండి వెనక్కు తీసుకున్నాడు. కాకతీయ సైన్యం ఓడిపోయింది. అనేక మంది ప్రతాపరుద్రుని సైన్యాధిపతులు యుద్ధం లో అసువులు కోల్పోయారు. ప్రతాపరుద్రుడు ముస్లిం సైన్యాలకు బందీగా చిక్కి అవి ఆయనను ఢిల్లీ తీసుకుని పోతుండగా నర్మదా నది లో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు.  

SINGULARITY AND THE BIG BANG THEORY.


Our Universe began about 13.7 billion years ago as per the Big Bang theory which is accepted by a very large majority of astronomers and cosmologists.

A solid proof for this is the Microwave Background radiation coming in to us from all sides of the Universe. As far as our sightings and measurements go, no object in the universe is older than 13.7 billion years. This indirectly indicates that this may indeed be the age of the Universe.

Traditional Big Bang Theory says that the Universe began with a ‘Singularity” or a single point, which is a point of infinite density and temperature. At this point physical rules known to us do not operate and it is beyond conventional physics. So at the point of explosion or the Big Bang we cannot even postulate the parameters that existed.

Cosmologists suspect that the forces that rule the Universe today—Gravity, Electromagnetism and the Nuclear were unified into a singular force at the time of the Big Bang. Incidentally when Albert Einstein died he was working on the Unified field theory that puts all the 3 forces into one.

Scientists have picked up the story of the Universe at 10 raised to the power of -36 seconds after the Big Bang. At that point scientists believe that the Universe underwent an extremely brief and dramatic period of expansion, expanding faster than the speed of light.

This rapidly expanding Universe had very less matter, but it had huge amounts of dark energy. As per cosmologists it is the dark energy that is driving the current expansion of the Universe which is actually accelerating.

The sudden inflation has cooled down the superhot Universe, but when dark energy got converted into ordinary matter and energy the Universe heated up again.  

Just after inflation the Universe was filled with hot and dense Plasma. But by the time of 10 raised to the power of minus 6 seconds from Big Bang it has cooled down enough to allow protons and neutrons to form.

In the first 3 minutes after the Big Bang the protons and neutrons fused together and formed a positive Deuterium ion and the Deuterium ion  in turned joined up to form the positive Helium ion. But these are just positively charged ions without any interaction with the electrons. It took 380,000 years after Big Bang for electrons to combine with the positive ions and form atoms.

The first stars started shining only 300 million years after the Big Bang. Over time stars gravitated together to form galaxies and planets coalesced around some of the newly forming stars.  

All this is fine, but how did that singularity which led to the Big Bang come into being? For that we have no answers at all. Time itself started with the Big Bang, so before that there was nothing called time. In fact what is time? It is nothing but duration between 2 events. At the time of singularity there was nothing else but that itself, so there is no question of time either. Time only started with the Big Bang.

In this context I am reminded of the Nasadiya Sukta of the Rigveda. I give below two verses from the Sukta.

Then there was neither death nor immortality
nor was there then the torch of night and day.
The One breathed windlessly and self-sustaining.
There was that One then, and there was no other.

At first there was only darkness wrapped in darkness.
All this was only unillumined cosmic water.
That One which came to be, enclosed in nothing,
arose at last, born of the power of heat.

You can judge the similarities of the Sukta and Singularity. Of course this does not mean that the Vedas knew about singularity, but it certainly shows its advanced thought. Other things were also mentioned in the Sukta which is highly skeptical, but I have given here the only 2 verses that are relevant to my point.

Another thing, we know about the singularity from which our Universe evolved, but can we assert that more such singularities did not exist in dimensions unknown to us and there may be other Universes as well where our physical laws do not hold? We cannot say anything on that, and there is no way of ascertaining that ever, because we have no means of detecting the other dimensions, and all our instruments come to naught in discovering them.

Friday 23 August 2019

దేముడు అనే భావం మీద నా ఆలోచన.


రోజు దేముడి మీద నాకు ఉన్న భావం మీకు చెప్పాలి అనిపించింది. క్కడ ఒక విషయం  చెప్పాలి. ఇది చదివి మీలో భగవంతుడు అంటే గాఢమైన భక్తి ఉన్నవారికి నచ్చకపోవచ్చు.  కానీ ఇది నా ఆలోచన మాత్రమే. ప్రతి తత్వ  సిద్ధాంతి, చివరికి అంత మహా మేధావి ఐన శంకరాచార్యులు సిద్ధాంతంలో కూడా తప్పులు ఉన్నాయి. అలాంటిది నేను ఎంత. ఇది నాకు తెలిసిన విశేషాల  నుండి నాకు వచ్చిన ఆలోచన మాత్రమే.   

ఇది తత్త్వం కాబట్టి అది అంటే అభిరుచి లేనివారు బోర్ అయిపోతారు. అలాంటివారు ఇది రాసినందుకు నన్ను క్షమించాలి. కానీ అలాంటి అభిరుచి ఉన్నవారిలో కొత్త ఆలోచనలను ప్రేరేపించడానికి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రాస్తున్నాను. 

నేను దేముడిని మన నుండి విడిగా ఉంటాడు అని నమ్మను. నా భావాన్ని దేముడు అని పిలవటం కన్నా ఒక శక్తి అంటే బాగుంటుంది. ఎందుకంటే దేముడు అనగానే మనం మనిషికి ఉన్న గుణాలు అన్ని దేముడికి ఆపాదించేసాము. అంటే మనకి ఉన్న శాంతం, కోపం, ప్రేమ, ద్వేషం  అన్ని దేముడికి ఆపాదించి చివరికి ఆయనను మంత్రాలు తెలిసిన ఒక  మహా మనిషి గా చేసేసాము. నేను ఊహించే శక్తి కి  అసలు లక్షణము ఉండదు. అది వేదాల లోని బ్రహ్మ పదార్థం లాంటిది. 

నా ఉద్దేశం ప్రకారం సర్వ విశ్వం యొక్క మొత్తమే ఒక శక్తి. అందులో మనం కూడా ఒక అంతర్భాగమే. శక్తి ని మనం ఎప్పుడూ నిర్వచించలేము ఎందుకంటే మనకు తెలిసిన ప్రమాణాలు కేవలం 3  మాత్రమే. అవి పొడవు, వెడల్పు మరియు ఎత్తు. ఐన్స్టెయిన్ చెప్పినట్టు మనం కాలాన్ని కూడా ఒక ప్రమాణం గా తీసుకుంటే అప్పుడు మనకు తెలిసిన ప్రమాణాలు నాలుగు అవుతాయి. కానీ విశ్వము అనబడే శక్తి అనంతమైన ప్రమాణాల లో విస్తరించి ఉంది. దాన్ని మనకు ఉన్న నాలుగు ప్రమాణాల సాయం తో ఎప్పటికి గ్రహించలేము. అంతే కాదు ఆత్మ అనేది లేదు. శరీరం ఉన్నంత కాలం ఉండే ఎరుక నే మనకి మనం అనే ఒక ప్రత్యేక గుర్తింపు ని ఇస్తుంది. శరీరం నశించగానే ఎరుక కూడా నశిస్తుంది. 

మరి ఆలా అయితే నేను అనే భావం రావటానికి కారణం ఏమిటి? దానికి సమాధానం మన మనసుకి కానీ మన విఙ్నానానికి కానీ తెలియదు. అదే కనుక తెలుసుకోగలిగితే మనము సర్వము తెలుసుకున్నట్టే. సర్వమే బ్రహ్మ పదార్థం. అదే అంతిమ సత్యం.

 నేను అనే భావం కలిగించిన ఎరుక, బ్రహ్మ పదార్థం ఒకటే కానీ వేరు కాదు. వేదాలను ఉల్లేఖించి శంకరాచార్యుడు  చెప్పాడు, బ్రహ్మ పదార్థాన్ని అవిద్య అనేది ఆవరించి ఒక భ్రమ ను కలిగించి ఆత్మ కు ఒక ప్రత్యేకత లేదా ఎరుక ఇచ్చింది అని. విషయం తెలుసుకోగానే ఆత్మ బ్రహ్మ స్వరూపం లో ఐక్యం అయ్యి నేను అనే ఎరుక కోల్పోతుంది అని. 

కానీ నా ఉద్దేశంలో శంకరాచార్యుని భావంలో కూడా తప్పు ఉంది. బ్రహ్మ స్వరూపమే సర్వం అని అయన స్వయంగా వప్పుకున్నాడు. కానీ తరువాత దానిని మాయ భ్రమింప చేసి ఆత్మ అనే భావం కలిగించింది అన్నాడు.

బ్రహ్మ స్వరూపమే సర్వం అయితే మరి మాయ ఎక్కడనుండి వచ్చింది. మాయ కూడా అందులోనుండి వచ్చి ఉండాలి కదా. అంటే బ్రహ్మ స్వరూపం తనకు తానే మభ్య పెట్టుకుంటుందా.

దానికి తోడు బ్రహ్మ స్వరూపాన్నే మభ్య పెట్టగల శక్తి మాయకి ఉంటె అది బ్రహ్మ స్వరూపం కంటే శక్తివంతమైనదా. దీనికి జవాబులు లేవు. అంటే అంతటి గొప్ప తత్వ వేత్త ఐన శంకరాచార్యులు కూడా విషయం  లో పొరపాటు  పడ్డాడు.

నా ఉద్దేశ ప్రకారం బ్రహ్మ పదార్థం మనము ఒకటే కానీ అవి ఎప్పుడూ వేరు  కాదు. మరి భిన్నమైన రూపాలు ఏమిటి, విశ్వం ఏమిటి, జంతువులు, చెట్లు, పుట్టలు అన్ని ఏమిటి. మనం అనే ఎరుక ఎలా వచ్చింది. దానికి నా  సమాధానం ఏమిటంటే  మనము తెలుసుకోలేము అని. మనకి ఉన్న మితమైన బుద్ధితో అపరిమితమైన నిజాన్ని మనం ఎప్పటికి తెలుసుకోలేము. 

మనం అన్ని తెలుసుకోగలం అని అనుకోవటానికి కారణం మన అహంకారం. మనిషి దేముని దృష్టిలో ఎదో ప్రత్యేకం  అని మనం నమ్ముతాము. కానీ దేముడు అనేదే ఒక శక్తి. దానికి మనిషికి, ఒక ధూళి కణానికి ఏమి తేడాలేదు. పైగా దానికి మనిషి దాని నుండి వేరు అనే భావమే లేదు. ఎందుకంటే శక్తి కి భావం అనేదే ఉండదు. భావం అనేది మనిషి యొక్క లక్షణం. దాన్ని దేముడికి మనం ఆపాదిస్తాము.

ఆశ్చర్యం ఏమిటంటే అంత పురాతనమైన వేదాల లో కూడా విశ్వం గురించి అతి గహనమైన ఆలోచన ఉంది. "Hymn  of Creation  " అనేది రుగ్వేదం 10  మండలం లో ఉన్న Nasadiya  సూక్తం. చూడండి. దాన్ని కింద  ఇస్తున్నాను.

" అప్పుడు ఏమి లేకపోవటం కూడా లేదు, ఉండటం కూడా లేదు.
అప్పుడు గాలి కూడా లేదు, దాని వెనుక ఉండే ఆకాశం కూడా లేదు.
దానిని అప్పుడు ఏమి ఆవరించి ఉంది? ఎవరి పర్యవేక్షణలో ఉంది?
అప్పుడు మనకు తెలియని అతి nighoodamaina  లోతుల్లో నీరు ఉండేదా?"

పాదం తరువాత 5  పాదాలు దాన్ని నిర్వచించటానికి ప్రయత్నిస్తాయి. దాని తర్వాత వచ్చే పాదం మనకి ఆశ్చర్యం కలిగించే చింతన. అది కింద ఇస్తున్నాను.

" విశ్వం అంతా ఎక్కడనుండి ఎలా వచ్చింది?
సృష్టి కర్త దీనిని సృష్టించాడా లేదా?
సర్వ సృష్టి ని పైనుండి చూసే సృష్టికర్త,
ఆయనకు విషయం తెలుసా లేక ఆయనకు కూడా తెలియదా?

ఇందులో చూసారా అసలు సృష్టి కర్త విశ్వాన్ని సృష్టించాడా లేదా? అసలు ఆయనకు అది ఎలా వచ్చిందో  తెలుసా లేదా అని  ఆలోచిస్తున్నారు వేద రచయితలు.

ప్రపంచం లో ఉన్న మతం లో కూడా విశ్వం గురించి ఇలాంటి గహనమైన చింతన లేదు. 3500  సంవత్సరాల క్రితమే వేదకారులు ఆలా ఆలోచించటం చాల ఆశ్చర్యకరమైన విషయం.  .