Friday, 23 August 2019

జల్లిపల్లి యుద్ధం.


పద్మనాయక వెలమ చరిత్రలో జల్లిపల్లి యుద్ధం ఒక ముఖ్యమైన ఘట్టం. యుద్ధం 1361  లో జరిగింది.

కాకతీయ సామ్రాజ్యం తుగ్లక్ అధీనం ఐన తర్వాత మొత్తం ఆంధ్ర  దేశం అంతా ముస్లిం పరిపాలనలోకి వచ్చింది. అప్పుడు ప్రతాపరుద్రుని మంత్రి ఆయన ఇందులూరి అన్నయ యుద్ధంలో చావగా ఉన్న కాకతీయ  సామంత రాజులందరిని ముసునూరి ప్రోలయనాయకుని నాయకత్వంలో ఏకం చేసాడు. అందులో కాకతీయ సైన్యాధిపతి ఐన రేచెర్ల సింగమనాయకుడు ఒకడు.

ఐకమత్యం వలన ఆంధ్ర భూ భాగం మొత్తం తిరిగి పూర్వ కాకతీయ సామంతుల ఆధీనంలోకి వచ్చింది. ముస్లిం పాలనలోనుండి ఆంధ్ర దేశాన్ని తప్పించగానే ఐకమత్యం సమాప్తం అయిపోయి సైన్యాధిపతులు సామంత రాజులూ ఎవరికి వారు సామ్రాజ్య విస్తరణ  లో పడ్డారు. సమయంలో రేచెర్ల సింగమనాయకుని రాజ్యం క్రమంగా విస్తరించడం మొదలు పెట్టింది. ఇది క్షత్రియ నాయకుల కు కానీ రెడ్డ్డి నాయకులకి కానీ రుచించలేదు.

క్షత్రియులు జల్లిపల్లి  (విజయవాడ) దుర్గాధీశుడు ఐన పూసపాటి మాధవ వర్మ నాయకత్వంలో కుట్ర చేసారు. సింగమనాయకుని యుద్ధంలో గెలవడం కష్టం అందుకని వారు రెడ్డి నాయకులు సాయం చేయగా ముందు పైసాల గోత్రజుడు, రేచెర్ల సింగమనాయకుని  బావగారు ఐన చింతపల్లి సింగమ ను ముట్టడించారు. యుద్ధంలో సింగమ ఏమరుపాటులో ఉండగా కొండ మల్రాజు, మచ్చ ఓబులరాజు,   కొమ్మలదేవ పిన్నమరాజు ఆయనను అపహరించి జల్లిపల్లి దుర్గం లో బంధించారు.

చర్య వారు సింగమనాయకుని పుత్రులు అనపోతానాయకుడు మరియు మాదానాయకుడు దక్షిణ దేశ దండయాత్రలో ఉండగా చేసారు. 

విషయం తెలిసి చింతపల్లి సింగమ అన్న ఐన వెల్లటూరు అధిపతి గన్న భూపాలుడు తన సేనతో తరలి వచ్చి జల్లిపల్లి దుర్గాన్ని ముట్టడించాడు.   

గన్న భూపాలుడు ఒక్కడే జల్లిపల్లి దుర్గాన్ని జయించలేడు  అని తెలిసి రేచెర్ల సింగమనాయకుడు బావమరిది కి సాయంగా వచ్చి జల్లిపల్లి దుర్గాన్ని ముట్టడించాడు.

ఇది చూసి ప్రత్యర్థి రాజులు అందరు దుర్గంలో సమావేశం అయ్యారు. రేచెర్ల సింగమనాయకుడు అప్పటికి వృద్ధుడు ఐనా మహా పరాక్రమవంతుడు. అతనికోసం  పూసపాటి మాధవవర్మ  ఒక కుతంత్రం రచించాడు. పధకం ప్రకారం శ్రీశైల అధిపతి ఐన తంబళ్ళ బొమ్మ జియ్యరు రాయబారము పేరుతొ సింగమనాయకుని గుడారంలోకి వెళ్లి అయన ఏమరుపాటులో ఉండగా ఆయనను బాకు తో పొడిచి హత్య చేసాడు.

విషయం గన్న భూపాలుడు వార్తాహరుల ద్వారా చేజెర్ల యుద్హానికి వెళ్లిన అనపోతానాయకుడి కి, మొగుళ్ళూరు లో యుద్ధం చేసున్న మాదానాయకునికి పంపించి జల్లిపల్లి ముట్టడిని కొనసాగించాడు.

మాధవవర్మ కుతంత్రం కాకతీయ సామంతులు  పెక్కు మందిలో, క్షత్రియ రాజులకి సైతం అసహ్యం పుట్టించింది. ముసునూరి కాపయనాయకుడు కూడా చర్యను నిరసించాడు. అనపోతానాయకుడు, మాదానాయకుడు తమ సైన్యాలతో వచ్చి జల్లిపల్లి కోటను ముట్టడించారు.

అంత మోసం చేసిన మాధవవర్మ కి సురవరం మరియు అంతర్వేది కి చెందిన క్షత్రియ రాజులు సాయం చేయటానికి నిరాకరించారు. అంతే కాదు మాధవ వర్మ మిత్రులైన రాజులు కొందరు, రెడ్లు కొందరు తమ సైన్యాలతో కోటను విడిచిపెట్టి వెళ్లిపోయారు.

మాధవ వర్మ వర్గం నుండి కొండ మల్రాజు, కొమ్మలదేవ పిన్నమరాజు, మచ్చ ఓబుళరాజు నాయకత్వంలో వినుకొండ మారా రెడ్డి, పోలూరి పేరా రెడ్డి, బండి కాటా రెడ్డి, గోన మల్లా రెడ్డి, గోరగిరి నారాయణ రెడ్డి కొండ రాఘవరాజు, స్వర్ణసేనమరాజు, సాళ్వ రాఘవరాజు, వరరాజు, తిరుమల పాల్రాజు యుద్ధానికి వచ్చిరి.

సంకుల సమరంలో పద్మనాయక సైన్యాలు గెలుపొందాయి. యుద్ధం తర్వాత అనపోత నాయకుడు రణము కుడిపాడు.

యుద్ధంలో ఓడిపోయి పూసపాటి మాధవ వర్మ సంతతి వారు ఒరిస్సా గజపతుల శరణు వేడగా గజపతుల వారికి ఆశ్రయం ఇచ్చి కళింగ రాజ్య తెలుగు ప్రాంతం ఐన విజయనగరానికి పాలకులుగా నియమించిరి.  వారే ఈనాటి విజయనగర రాజులు.

1 comment: