మహారాజా
రంజిత్ సింగ్ గురించి మన క్లాస్ పుస్తకాలలో కేవలం ఒక చిన్న వివరణ మాత్రమే ఉంటుంది కానీ
అయన ఒక ప్రభావవంతమైన రాజు. పంజాబీ ల గురించి నా బంధువు ఒకాయన Whatsapp లో ఒక వ్యాసం
పోస్ట్ చేసారు. అందులో ఒక చిన్న భాగం రంజిత్ సింగ్ మీద ఉంది. అది చూసి నాకు అయన మీద
అందరికి తెలిసేలా ఒక వ్యాసం రాయాలి అనిపించింది. రంజిత్ సింగ్ కి కొన్ని తప్పుడు అలవాట్లు ఉన్నా కూడా సిక్కులను సంఘటితం చేసి ఒక
ధృడమైన శక్తిగా చేయటంలో ఆయనదే ముఖ్య పాత్ర.
రంజిత్
సింగ్ 1780 లో
పశ్చిమ పంజాబ్ లోని గుజరాన్వాలా అనే
నగరం లో జన్మించాడు. అది
ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. ఆయనకు
చిన్నతనం లోనే మసూచి వ్యాధి
సోకి ఎడమ కంటికి చూపు
పోయింది. అంతే కాదు అయన
మొహం మీద మసూచి ఆనవాళ్లు
పడ్డాయి. ఆయనకు కేవలం 10 సంవత్సరాలు ఉన్నపుడే అయన తండ్రితో కలసి
ఒక యుద్ధం లో పాల్గొన్నాడు. అయన
పొట్టిగా ఉండేవాడు. ఆయనకు వచ్చిన చదువు
కూడా తక్కువ కేవలం గురుముఖి లిపి
చదవటం తెలుసు అంతే. ఆయనకు యుద్ధ
విద్యలలో మట్టుకు బాగా శిక్షణ ఇయ్యబడింది.
అయన
తండ్రి రంజిత్ సింగ్ కు 12 సంవత్సరాలు ఉన్నపుడు మరణించాడు. అప్పటికి సిక్కులు
అందరు 12 Misl’s గ
విడిపోయి వారిలో
వారు కలహించుకుంటూ ఉండేవారు.రంజిత్ సింగ్ తండ్రి ఒక
Misl కి
అధిపతి. తండ్రి మరణం తర్వాత ఆ
Misl కి చెందిన ఎస్టేట్ లను అయన తల్లి
రాజ్ కౌర్ ఇంకొక వ్యక్తి
సాయంతో పాలించింది. అతనికి 13 సంవత్సరాల వయసులో
రంజిత్సింగ్ మీద ఒక
హత్యా ప్రయత్నం జరిగింది
కానీ దానికి ప్రయత్నించిన వాడిని రంజిత్ సింగ్ చంపేశాడు.
ఆయనకు
13 -14 సంవత్సరాలు
ఉండగా మత్తు కలిగించే పానీయాలు
తాగటం అలవాటు అయ్యింది. ఆ అలవాటు తరువాతి
సమయం లో బాగా ఎక్కువ
అయ్యింది. కానీ అయన ధూమపానం
చేసేవాడు కాదు.
రంజిత్
సింగ్ కు 20 మంది
భార్యలు, ఇంకా చాల మంది
ఉంపుడు గత్తెలు ఉండేవారు. అయన ఒక ముస్లిం
భోగం పిల్లను కూడా వివాహం చేసుకున్నాడు.
ఆ వివాహం మరియు అతని ఇతర
సిక్కు మతానికి వ్యతిరేకంగా చేసిన చర్యలు సాంప్రదాయ
సిక్కులకు కోపం తెప్పించాయి. అప్పటి
అఖల్ తఖ్త్ జాతేదార్ ఐన
Phoola సింగ్ కి కూడా కోపం
వచ్చి రంజిత్ సింగ్ ను అఖల్
తఖ్త్ కు
పిలిపించి ఆయనకు కొరడా దెబ్బలు
శిక్ష విధించాడు కానీ అక్కడ ఉన్న
ప్రజలు విన్నపం మీద ఆ
శిక్ష రద్దు చేసాడు.
రంజిత్
సింగ్ యొక్క Misl ఇదివరకు
చెప్పిన 12 Misl ల
లో ముఖ్యమైనది. అయన ఇతర ముఖ్యమైన
Misl ల
తో వివాహ సంబంధాలు చేసుకుని
నెమ్మదిగా అప్పుడు ఉన్న 12 Misl’s కు
అధిపతి అయ్యి మహారాజ అన్న
బిరుదం వహించాడు.
రంజిత్
సింగ్ యొక్క ఖ్యాతి, పేరు
అయన
ఆఫ్ఘన్ సైన్యాలను ఓడించడంవల్ల వచ్చింది. 1801 సంవత్సరంలో
అయన తనను పంజాబుకు మహారాజు
గా ప్రకటించుకున్నాడు. 1806 సంవత్సరంలో
అయన ఇంగ్లీష్ వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు.
దాని ప్రకారం సిఖ్ సామ్రాజ్యం సట్లెజ్
నదికి దక్షిణ దిశలోనికి విస్తరించదు, ఈస్ట్ ఇండియా కంపెనీ
వారి వైపు నుండి వారు
సట్లెజ్ నది దాటి పంజాబ్
సీమలోకి అడుగు పెట్టరు.
.
అయన
అలవాటుల కారణంగా 1830 సంవత్సరం
తర్వాత రంజిత్ సింగ్ ను అనేక
జబ్బులు చుట్టు ముట్టాయి. హృద్రోగం కూడా వచ్చి ఒక
స్ట్రోక్ వచ్చింది. అతిగా తాగడం వాళ్ళ
అయన లివర్ కూడా దెబ్బ
తింది. చివరకు అయన 1839 సంవత్సరంలో
నిద్రలో మరణించాడు. ఆయనతో పాటు 4 గురు భార్యలు 7
మంది ఉంపుడుకత్తెలు సతీ సహగమనం చేసారు.
రంజిత్
సింగ్ సిక్కు లను అందరిని కూడగట్టి
ఒక ధృడమైన శక్తిగా తయారు చేసాడు. ఇంకా
చుట్టూ పక్కల ఉన్న రాజ్యాలను
జయించి ఒక శక్తివంతమైన
సిఖ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయన బ్రిటిష్ వారితో
స్నేహం చేసాడు.
ఆశ్చర్యకరమైన
విషయం ఏమిటంటే సిక్కు సామ్రాజ్యం లో కేవలం 3% సిక్కులు
ఉండేవారు. మిగిలినవారు 74% ముస్లిములు, 23% హిందువులు ఉండేవారు. ఈ సిక్కు సామ్రాజ్యం
మొఘుల్ పాదుషా ఔరంగజెబ్ మరణం తర్వాత జన్మించింది.
దాని యొక్క అత్యున్నత దశలో
అది పడమర Khyber పాస్ నుండి తూర్పున
టిబెట్ వరకు, దక్షిణాన మిఠాన్కోట్
(పాకిస్తాన్) నుండి కాశ్మీర్ వరకు
విస్తరించింది. ఢిల్లీ కూడా ఆయన సామ్రాజ్యంలో
భాగమే.
జమ్మూ
అండ్ కాశ్మీర్ రాష్ట్రము రంజిత్ సింగ్ సామ్రాజ్యంలో ఒక
భాగం. రంజిత్ సింగ్ మరణించిన తర్వాత
ఐన మొదటి ఆంగ్లో సిఖ్
యుద్ధంలో బ్రిటిష్ వారు దాన్ని 1846
లో గెలిచి రాజపుత్రుడైన మహారాజా గులాబ్
సింగ్ ను మహారాజు ను
చేసారు.
రంజిత్
సింగ్ ఆఫ్ఘన్లు కొల్లగొట్టిన హారమందిర్ సాహెబ్ ను బాగు చేయించి చలువరాయి వేయించి బంగారు తొడుగు చేయించాడు. అయన సమయం లో
సిక్కు సంస్కృతి మరియు కళలు వృద్ధి
చెందాయి.
No comments:
Post a Comment