ఈ
రోజు దేముడి మీద నాకు ఉన్న
భావం మీకు చెప్పాలి అనిపించింది.
క్కడ ఒక విషయం చెప్పాలి. ఇది చదివి మీలో
భగవంతుడు అంటే గాఢమైన భక్తి
ఉన్నవారికి నచ్చకపోవచ్చు. కానీ
ఇది నా ఆలోచన మాత్రమే.
ప్రతి తత్వ సిద్ధాంతి,
చివరికి అంత మహా మేధావి
ఐన శంకరాచార్యులు సిద్ధాంతంలో కూడా తప్పులు ఉన్నాయి.
అలాంటిది నేను ఎంత. ఇది
నాకు తెలిసిన విశేషాల నుండి
నాకు వచ్చిన ఆలోచన మాత్రమే.
ఇది
తత్త్వం కాబట్టి అది అంటే అభిరుచి
లేనివారు బోర్ అయిపోతారు. అలాంటివారు
ఇది రాసినందుకు నన్ను క్షమించాలి. కానీ
అలాంటి అభిరుచి ఉన్నవారిలో కొత్త ఆలోచనలను ప్రేరేపించడానికి
ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రాస్తున్నాను.
నేను
దేముడిని మన నుండి విడిగా
ఉంటాడు అని నమ్మను. నా
భావాన్ని దేముడు అని పిలవటం కన్నా
ఒక శక్తి అంటే బాగుంటుంది.
ఎందుకంటే దేముడు అనగానే మనం మనిషికి ఉన్న
గుణాలు అన్ని దేముడికి ఆపాదించేసాము.
అంటే మనకి ఉన్న శాంతం,
కోపం, ప్రేమ, ద్వేషం అన్ని
దేముడికి ఆపాదించి చివరికి ఆయనను మంత్రాలు తెలిసిన
ఒక మహా
మనిషి గా చేసేసాము. నేను
ఊహించే శక్తి కి అసలు ఏ లక్షణము
ఉండదు. అది వేదాల లోని
బ్రహ్మ పదార్థం లాంటిది.
నా
ఉద్దేశం ప్రకారం సర్వ విశ్వం యొక్క
మొత్తమే ఒక శక్తి. అందులో
మనం కూడా ఒక అంతర్భాగమే.
ఆ శక్తి ని మనం
ఎప్పుడూ నిర్వచించలేము ఎందుకంటే మనకు తెలిసిన ప్రమాణాలు
కేవలం 3 మాత్రమే.
అవి పొడవు, వెడల్పు మరియు ఎత్తు. ఐన్స్టెయిన్
చెప్పినట్టు మనం కాలాన్ని కూడా
ఒక ప్రమాణం గా తీసుకుంటే అప్పుడు
మనకు తెలిసిన ప్రమాణాలు నాలుగు అవుతాయి. కానీ విశ్వము అనబడే
శక్తి అనంతమైన ప్రమాణాల లో విస్తరించి ఉంది.
దాన్ని మనకు ఉన్న నాలుగు
ప్రమాణాల సాయం తో ఎప్పటికి
గ్రహించలేము. అంతే కాదు ఆత్మ
అనేది లేదు. శరీరం ఉన్నంత
కాలం ఉండే ఎరుక నే
మనకి మనం అనే ఒక
ప్రత్యేక గుర్తింపు ని ఇస్తుంది. శరీరం
నశించగానే ఈ ఎరుక కూడా
నశిస్తుంది.
మరి
ఆలా అయితే నేను అనే
ఈ భావం రావటానికి కారణం
ఏమిటి? దానికి సమాధానం మన మనసుకి కానీ
మన విఙ్నానానికి కానీ తెలియదు. అదే
కనుక తెలుసుకోగలిగితే మనము సర్వము తెలుసుకున్నట్టే.
ఆ సర్వమే బ్రహ్మ పదార్థం. అదే అంతిమ సత్యం.
నేను
అనే భావం కలిగించిన ఎరుక,
బ్రహ్మ పదార్థం ఒకటే కానీ వేరు
కాదు. వేదాలను ఉల్లేఖించి శంకరాచార్యుడు చెప్పాడు,
బ్రహ్మ పదార్థాన్ని అవిద్య అనేది ఆవరించి ఒక
భ్రమ ను కలిగించి ఆత్మ
కు ఒక ప్రత్యేకత లేదా
ఎరుక ఇచ్చింది అని. ఆ విషయం
తెలుసుకోగానే ఆత్మ బ్రహ్మ స్వరూపం
లో ఐక్యం అయ్యి నేను
అనే ఎరుక కోల్పోతుంది అని.
కానీ
నా ఉద్దేశంలో శంకరాచార్యుని భావంలో కూడా తప్పు ఉంది.
బ్రహ్మ స్వరూపమే సర్వం అని అయన
స్వయంగా వప్పుకున్నాడు. కానీ తరువాత దానిని
మాయ భ్రమింప చేసి ఆత్మ అనే
భావం కలిగించింది అన్నాడు.
బ్రహ్మ
స్వరూపమే సర్వం అయితే మరి
మాయ ఎక్కడనుండి వచ్చింది. మాయ కూడా అందులోనుండి
వచ్చి ఉండాలి కదా. అంటే బ్రహ్మ
స్వరూపం తనకు తానే మభ్య
పెట్టుకుంటుందా.
దానికి
తోడు బ్రహ్మ స్వరూపాన్నే మభ్య పెట్టగల శక్తి
మాయకి ఉంటె అది బ్రహ్మ
స్వరూపం కంటే శక్తివంతమైనదా. దీనికి
జవాబులు లేవు. అంటే అంతటి
గొప్ప తత్వ వేత్త ఐన
శంకరాచార్యులు కూడా ఈ విషయం లో
పొరపాటు పడ్డాడు.
నా
ఉద్దేశ ప్రకారం బ్రహ్మ పదార్థం మనము ఒకటే కానీ
అవి ఎప్పుడూ వేరు కాదు.
మరి ఈ భిన్నమైన రూపాలు
ఏమిటి, ఈ విశ్వం ఏమిటి,
ఈ జంతువులు, చెట్లు, పుట్టలు అన్ని ఏమిటి. మనం
అనే ఈ ఎరుక ఎలా
వచ్చింది. దానికి నా సమాధానం
ఏమిటంటే మనము
తెలుసుకోలేము అని. మనకి ఉన్న
మితమైన బుద్ధితో అపరిమితమైన నిజాన్ని మనం ఎప్పటికి తెలుసుకోలేము.
మనం
అన్ని తెలుసుకోగలం అని అనుకోవటానికి కారణం
మన అహంకారం. మనిషి దేముని దృష్టిలో
ఎదో ప్రత్యేకం అని
మనం నమ్ముతాము. కానీ దేముడు అనేదే
ఒక శక్తి. దానికి మనిషికి, ఒక ధూళి కణానికి
ఏమి తేడాలేదు. పైగా దానికి మనిషి
దాని నుండి వేరు అనే
భావమే లేదు. ఎందుకంటే ఆ
శక్తి కి భావం అనేదే
ఉండదు. భావం అనేది మనిషి
యొక్క లక్షణం. దాన్ని దేముడికి మనం ఆపాదిస్తాము.
ఆశ్చర్యం
ఏమిటంటే అంత పురాతనమైన వేదాల
లో కూడా విశ్వం గురించి
అతి గహనమైన ఆలోచన ఉంది. "Hymn
of Creation " అనేది
రుగ్వేదం 10 వ
మండలం లో ఉన్న Nasadiya
సూక్తం. చూడండి. దాన్ని కింద ఇస్తున్నాను.
" అప్పుడు ఏమి
లేకపోవటం కూడా లేదు, ఉండటం
కూడా లేదు.
అప్పుడు
గాలి కూడా లేదు, దాని
వెనుక ఉండే ఆకాశం కూడా
లేదు.
దానిని
అప్పుడు ఏమి ఆవరించి ఉంది?
ఎవరి పర్యవేక్షణలో ఉంది?
అప్పుడు
మనకు తెలియని అతి nighoodamaina లోతుల్లో
నీరు ఉండేదా?"
ఈ
పాదం తరువాత 5 పాదాలు
దాన్ని నిర్వచించటానికి ప్రయత్నిస్తాయి. దాని తర్వాత వచ్చే
పాదం మనకి ఆశ్చర్యం కలిగించే
చింతన. అది కింద ఇస్తున్నాను.
"ఈ విశ్వం
అంతా ఎక్కడనుండి ఎలా వచ్చింది?
సృష్టి
కర్త దీనిని సృష్టించాడా లేదా?
సర్వ
సృష్టి ని పైనుండి చూసే
సృష్టికర్త,
ఆయనకు
ఈ విషయం తెలుసా లేక
ఆయనకు కూడా తెలియదా?
ఇందులో
చూసారా అసలు సృష్టి కర్త
విశ్వాన్ని సృష్టించాడా లేదా? అసలు ఆయనకు
అది ఎలా వచ్చిందో తెలుసా లేదా అని ఆలోచిస్తున్నారు వేద రచయితలు.
ప్రపంచం
లో ఉన్న ఏ మతం
లో కూడా విశ్వం గురించి
ఇలాంటి గహనమైన చింతన లేదు. 3500
సంవత్సరాల క్రితమే వేదకారులు ఆలా ఆలోచించటం చాల
ఆశ్చర్యకరమైన విషయం. .
No comments:
Post a Comment