Sunday, 22 September 2024

మానవ జాతి ఆవిర్భావం.

 


మానవ జాతి ఈనాడు  ప్రపంచంలో ఉన్న జంతు జాతులను అన్నిటినీ శాసిస్తుంది కానీ ఒకనాడు అది అనేక జాతులలో ఒకటి మాత్రమేమరి మానవ జాతి ఆలా ముందుకు పోయి మిగిలిన జాతులను ఎలా వెనక వదిలేయగలిగిందిదానికి కారణం మనిషి కి ఉన్న మేధాశక్తికానీ జంతువులూ మానవులు ఒకే విధంగా పుట్టినవారు అయితే మరి మేధాశక్తి కేవలం మనిషికే ఎందుకు ఉండాలిదానికి మన దగ్గర జవాబు లేదుభగవంతుడు తన ప్రతిరూపంలో మనిషిని సృష్టించాడు అని నమ్మేవారికి అయితే భగవంతుడే మనిషికి విశిష్ట లక్షణాలు ఇచ్చాడు అనుకోవడానికి ఊతం దొరుకుతుంది.  మరి మిగిలినవారికిఅసలు మానవుడి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి?  

మనలో అందరికి జీవులు వర్గీకరణ గురించి తెలుసునుకానీ కొంతమందికి తెలియకపోవడానికి chance  ఉంది కాబట్టి వారికోసం క్లుప్తంగా రాస్తున్నానుజీవరాశిలో ఇంత వైవిధ్యం ఉందివాటిని అన్నిటిని కొన్ని సాధారణ లక్షణాల ప్రకారం విభజించవచ్చును అని స్వీడిష్ శాస్త్రవేత్త ఆయన Carolus Von  Linnaeus కు ఒక భావం కలిగిందిఅయన అప్పటి జంతు జాతులను అన్నిటిని వర్గీకరించాడుముందుగా జీవజాతిని జంతు ప్రపంచంగావృక్ష ప్రపంచంగా విభజించాడువాటిని ముందుగా phylum ,  class , order , family , tribe, genus  మరియు species   విభజించాడు.

ఒక phylum  లో ఉన్న జాతులలో ఎక్కువ వైవిధ్యం ఉంటె మళ్ళీ దాన్ని sub  phylum ,ఇంకా ఎక్కువ ఉంటె infra  phylum ఆలా విభజించుకుంటూ పోయాడుచివరికి ఒక జీవిని దాని Genus  మరియు Species నామంతో పిలిచాడు

ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చింది అంటే భూమి మీద మొదటిగా అనేక రసాయన సంయోగాల వలన  ఒక ఏక కణ జీవి జన్మించిందితరువాత  క్రమంగా కొన్ని కణాలు కలసి సరళమైన జీవులుగా ఏర్పడ్డాయి జీవులనుండి ఇంకా సంక్లిష్ట జీవులు ఏర్పడుతూ పోయాయిఅంటే భూమి మీద ఉన్న సర్వ జీవరాసులు  మొదటి జన్మించిన కణం నుండి రూపొందినవేతరువాత వృక్ష మరియు జంతు రాజ్యాలనుండి వచ్చినవే

అంటే వీటి అన్నిటికి మూలం ఒకటేఅప్పటినుండి కాలం  గడిచే కొద్దీ లక్షణాలు వేరు కావటం వలన  నేను పైన చెప్పిన Phylum, క్లాస్ఆర్డర్ఫామిలీ,tribe, జీనస్ మరియు చివరికి స్పీసీస్ ఏర్పడ్డాయి. వర్గీకరణ లో ముందు వచ్చే భాగాలు అన్ని ముందు కాలం లో ఏర్పడినవిఅంటే Species  కంటే ముందు Genusదానికంటే ముందు Familyదానికంటే ముందు Order   విధంగా ఏర్పడ్డాయిఈ వర్గీకరణ ప్రకారం మనిషి పేరు Homo  Sapiens. మన జీనస్ Homo, మన స్పీసీస్ Sapiens.

మన జీనస్ Homo  25  లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండం లో Australopithecus  అనే జీవితో ప్రారంభం అయ్యిందిఅప్పటికి అది చింపాంజీ తో కలసి ఉన్న Tribe  ఆయన Hominini  నుండి వేరు పడింది.

దాని నుండి తరువాత 20  లక్షల సంవత్సరాల క్రితం Homo  Erectus  రూపొందిందిఅది మన జీనస్ కు చెందినది అయినా వాటి స్పీసీస్ వేరుదానికి మనలాంటి నడకమరియు శరీర ప్రమాణం ఉండేవిఅది హోమో జీనస్ లో చప్టా అయిన మొహం మరియు ముందుకు వచ్చిన ముక్కు కలిగిన మొదటి జాతిమొదట రెండు కాళ్ళ మీద నడిచిన జంతువు కూడా  అదే.      

ఇక్కడ ఒక విషయం చెప్పాలిచూడటానికి దాదాపు ఒకే విధంగా ఉన్నా స్పీసీస్ వేరు వేరు అని ఎలా చెప్పగలముదానికి ఒక కొలమానం రెండు అడ మగ జంతువులు సంయోగం చెందినపుడు వాటికి సంతానం కలిగితే అవి రెండు ఒకే Species  కి చెందినవిఉదారణకు ఇండియన్ ఏనుగులుఆఫ్రికన్ ఏనుగులు భిన్న జాతులకు చెందినవిరెండూ ఏనుగులేకానీ అవి రెండు సంయోగం చెందితే వాటికి సంతానం కలగదు.    

 Homo  Erectus   నుండి అనేక జాతులు ఆవిర్భవించాయిఅవి అన్ని నశించిపోయి చివరికి మన స్పీసీస్ యొక్క తాతగారుమరియు Neanderthal  మనిషి మిగిలారుమన స్పీసీస్ అయిన Homo  Sapiens  కేవలం 3 లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందిఅప్పటికి Neanderthal  మానవుడు ఇంకా జీవించి ఉన్నాడుచివరికి 110000  సంవత్సరాల క్రితం  నియాండర్తల్ మానవుడు కూడా నశించి కేవలం మన జాతి మాత్రమే మిగిలిందిఇప్పుడు హోమో అనబడే జీనస్ లో మన ఒక్కరి జాతి మాత్రమే మిగిలి ఉంది.


PhylumChordata  తో 54  కోట్ల సంవత్సరాల క్రితం మొదలైన మానవ వికాసం చివరికి మనతో పరిపూర్ణం అయ్యిందిజీవ రాసి ఆవిర్భావ సమయంతో పోలిస్తే మనిషి కేవలం నిన్ననే జన్మించాడుఅలాంటిది కేవలం 3  లక్షల సంవత్సరాల లో సర్వ జీవరాసు లను ఏలుతూ నశింపచేస్తున్నాడు కాలంలో మనిషి విజ్ఞానం సమయంతో అపారంగా పెరిగిపోతున్నదిచివరికి దాని పర్వయసానం ఏమిటో మనకు తెలియదుమనిషి తనను ఆవరించి వున్న ప్రకృతిని స్వాధీనలోనికి తెచ్చుకుని ఆనందంగా సుఖ శాంతులతో జీవిస్తాడా లేక అధిక విజ్ఞానంతో నశించిపోతాడా?

No comments:

Post a Comment

RAO BALASARASWATI DEVI-GREAT SINGER WHOSE CAREER WAS CUT SHORT.

  She was born in the year 1928 at Madras into a Telugu Brahmin family. Her grandfather was an advocate and used to practice at the Madras H...