మహారాణా
సంగ్రామ్ సింగ్ ( రణ సంగా ) భారతదేశంలోని
గొప్ప రాజపుత్ర రాజులలో ఒకరు,
ఆయన బాబర్కు వ్యతిరేకంగా నిలిచాడు,
అయితే దురదృష్టవశాత్తు మోసం మరియు ద్రోహం
కారణంగా బాబర్ చేతిలో క్రిస్తు శకం 1527 లోఖన్వా
యుద్ధంలో ఓడిపోయాడు. అయినప్పటకి బాబర్ వద్ద ఫిరంగులు
లేకపోతే విజయం రాణా నే
వరించి ఉండును.
ఆ
కాలంలో ఏ భారత రాజ్య
పాలకుల వద్ద కూడా ఫిరంగులు
లేవు, అందుచేత బాబర్ ఫిరంగులు మోగుతుండగా రణ సంగా సైన్యంలోని
రాజపుత్రులు వాటిని గుర్రాలపైన కేవలం కత్తులు బల్లాలు
ధరించి ముట్టడించారు. అసలు అలాంటి యుద్ధం
గెలవడం ఎవరి తరం? వారు
ఆ ఫిరంగుల చేరువకు వచ్చేలోగా వారు ముక్కలు ముక్కలు
అయిపోతారు.
రణ
సంగా అని కూడా పిలువబడే
మహారాణా సంగ్రామ్ సింగ్ 1484 సంవత్సరంలో సిసోడియా వంశం నుండి మేవార్కు చెందిన రాణా
Raimal జన్మించాడు. రణ సంగా తన సోదరులతో
వారసత్వ యుద్ధం తర్వాత 1508 సంవత్సరంలో తన తండ్రి రాణా
Raimal తరువాత
రాజ్యానికి వచ్చాడు. అతను
రాణా కుంభా మనవడు, అతని
తాత పేరుతో కుంబల్గర్ కోట నిర్మించబడింది.
రణ
సంగా అధికారంలోకి వచ్చినప్పుడు గుజరాత్ సుల్తానేట్ సుల్తాన్ ముజఫర్ షా II ఆధ్వర్యంలో దాని
శక్తి యొక్క ఉచ్ఛస్థితిలో ఉంది.
ఇదార్ గుజరాత్ సరిహద్దులో ఉన్న ఒక చిన్న
రాజపుత్ర సంస్థానం. రాజు మరణం తర్వాత
రాయ్ మల్ మరియు భర్
మల్ మధ్య వారసత్వ పోరాటం
జరిగింది. రాయ్ మల్ మైనర్, ఆయన చిత్తోర్ ఘర్ లో రాణా
సంగా వద్ద ఆశ్రయం పొందాడు,
భర్ మల్ ఇదార్ పాలకుడు అయ్యాడు.
1514లో రానా
సంగ సహాయంతో రాయ్ మల్ ఇదార్పై నియంత్రణ సాధించాడు.
భర్ మల్ సహాయం కోసం
గుజరాత్ సుల్తాన్ ముజఫర్ షా II కి విజ్ఞప్తి
చేశాడు. సుల్తాన్ నిజాం ఉల్ ముల్క్ను సైన్యంతో పాటు
భర్ మల్ను తిరిగి
నియమించడానికి పంపాడు. ఇందులో రాయ్ మల్ ఓడిపోయి
పర్వతాలలో తల దాచుకోవలసి వచ్చింది.
భర్
మల్ను రాజుగా చేసిన తరువాత, నిజాం ఉల్ ముల్క్
లో తల దాచుకున్న రైమాల్
ను వెంబడించి అతని చేతిలో 1517 లో
ఘోరంగా ఓడిపోయాడు. యుద్ధంలో సుల్తాన్ యొక్క ముఖ్య అధికారులు
వధించబడ్డారు. సుల్తాన్, నిజాం ఉల్ ముల్క్
ను వెనక్కు పిలిచి, జహీర్ ఉల్ ముల్క్ను పెద్ద సైన్యంతో
పంపాడు, అతను రాయ్ మల్
చేతిలో చిత్తుగా ఓడిపోయాడు మరియు అతని సైన్యంలో
చాలా మంది సైనికులు వధించబడ్డారు.
సుల్తాన్ తర్వాత నుస్రత్ ఉల్ ముల్క్ను
పంపాడు, కానీ కానీ ఆయన
కూడా రైమాల్ ను ఏమి చేయలేకపోపోయాడు.
రాయ్
మల్ విజయాలన్నీ రాణా సంగ సహాయంతో
సాధించబడ్డాయి.
1517లో ఇబ్రహీం
లోడి ఢిల్లీ సింహాసనంపై విజయం సాధించాడు. అతను
తన సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాల పైన మేవార్ల ఆక్రమణల
వార్తలను అందుకుని మేవార్ కు వ్యతిరేకంగా తన
సైన్యాన్ని నడిపాడు. రాణా సంగ ఖటోలీ
వద్ద అతనిని యుద్ధంలో కలవడానికి ముందుకు వచ్చాడు, అక్కడ వారి సైన్యాలు
యుద్ధంలో చేసాయి. ఢిల్లీ
సైన్యం రాజ్పుత్లను
తట్టుకోలేక కేవలం 5 గంటల వ్యవధిలో సుల్తాన్తో సైన్యం ఓడిపోయి
సుల్తాన్ తో సహా పారిపోయింది.
పారిపోయింది. ఒక లోడి రాకుమారుడు
రాణా సంగ చేతిలో ఖైదీగా
విడిచిపెట్టబడ్డాడు, అయితే సుల్తాన్ అతని
మోచన క్రయధనం చెల్లించటం వలన తరువాత విడుదల
చేయబడ్డాడు.
యుద్ధంలో,
రాణా కత్తి దెబ్బ తగిలి
ఒక చేతిని పోగొట్టుకున్నాడు. అంతే కాక, కాలికి
ఒక బాణం దెబ్బ వలన
కుంటివాడు కూడా అయిపోయాడు.
ఇబ్రహీం
లోడి రాణా చేతిలో తన ఓటమిని మరచిపోలేదు. ఆయన తన సైన్యాన్ని జాగ్రత్తగా సన్నాహం
చేసి తిరిగి 1519 లో తిరిగి ధోల్పూర్ వద్ద
రానా సైన్యంతో యుద్ధం చేసాడు. ఎప్పటిలాగే సుల్తాను
సైన్యం రాజపుత్ర అశ్విక దళం దాడిని తట్టుకోలేక
చిత్తుగా ఓడిపోయింది. ఈ యుద్ధంతో దాదాపు
రాజస్థాన్ మొత్తం రాణా చేతుల్లోకి వెళ్లిపోయింది.
రాణా
సంగా చందేరి ప్రాంతాన్ని మేదినీ రాయి కి జాగీర్ గా ఇచ్చాడు. అందులో కొంత భాగాన్ని మాల్వా సుల్తాన్
మహమ్మద్ ఖిల్జీ II ఆక్రమించాడు. అది రాణా కు అవమానం. అతను చిత్తోర్ నుండి రాథోర్స్ ఆఫ్
మెర్టాచే బలపరచబడిన పెద్ద సైన్యంతో ముందుకు
సాగి 1519 సంవత్సరంలో గాగ్రోన్ యుద్ధంలో అసఫ్ ఖాన్ నేతృత్వంలోని
గుజరాత్ సుల్తాన్ సహాయకులచే
బలపరచబడిన మాల్వా సుల్తాన్ దళాలతో యుద్ధం చేసాడు.
సుల్తాన్
అశ్విక దళం రాజ్పుత్
అశ్విక దళం యొక్క ముట్టడి
తట్టుకోలేకపోయింది మరియు వారి రక్షణ
గోడ చీలిపోయింది. తరువాత రాజ్పుత్ అశ్వికదళం
మిగిలిన మాల్వా దళాలపై పడింది, అవి నిర్ణయాత్మకంగా ఓడిపోయాయి.
సుల్తాన్ల సైన్యంలో చాలా
వరకు నిర్మూలించబడ్డాయి మరియు అసఫ్ ఖాన్
కొడుకుతో సహా అతని అధికారులు
చాలా మంది చంపబడ్డారు. అసఫ్
ఖాన్ యుద్ధ స్థలం నుండి
పారిపోయాడు మరియు మాల్వా సుల్తాన్ గాయపడి రక్తస్రావం అయ్యి ఖైదీగా బంధించబడ్డాడు.
రాజపుట్
ధీరోదాత్తత ప్రకారం రాణా మాల్వా సుల్తాన్
ను గౌరవంగా చూసి అతని రాజ్యాన్ని
తిరిగి అతనికి ఇచ్చాడు. దానికి కృతజ్ఞత గా సుల్తాన్ తన
వజ్రపు కిరీటాన్ని, బెల్ట్ ను రాణా కు
సమర్పించాడు. రానా సుల్తాన్ భవిష్యత్తు మంచి ప్రవర్తన
కోసం చిత్తోర్గఢ్లో సుల్తాన్
కుమారుడిని బందీగా ఉంచాడు.
ఈ
క్షమాపణ అబుల్ ఫజల్తో
సహా అందరు ముస్లిం చరిత్రకారులచే
గుర్తించబడింది. అది వారిచే ఒక
గొప్ప చర్యగా పరిగణించబడింది. కానీ ఈ పని
తరువాతి కాలంలో రాజపుట్ లకు హాని చేసింది.
1520 సంవత్సరంలో
ఒక Minstrel (అంటే జానపద పాటలు
పాడే వాడు) రాణా సంగా
యొక్క ధైర్యాన్ని, ఉదార గుణాన్ని
పొగడగా, గుజరాత్ సుల్తాన్ యొక్క జాగీర్దారు అయిన
నిజాం ఉల్ ముల్క్ అతనిని అవమానించాడు. రాణా కు కోపం
వచ్చి ఇతర రాజపుట్ సైన్యాలతో
కలసి వచ్చి గుజరాత్ ను
ముట్టడించాడు. సుల్తాన్ దళాలు రాణా చేతిలో
ఘోరంగా ఓడిపోగా నిజాం ఉల్ ముల్క్
పారిపోయాడు. తరువాత రాణా గుజరాత్ ను
కోపంతో దోచుకున్నాడు. సుల్తాన్ కు వచ్చి రాణా
ను ఆపే ధైర్యం లేకపోయింది. రాణా
తన లక్ష్యం నెరవేరిందని భావించి చిత్తూరుకు తిరిగి వచ్చాడు.
ఈ
అవమానాన్ని గుజరాత్ సుల్తాన్ మరిచిపోలేదు. అదే సంవత్సరం తరువాత,
అతను 100,000 అశ్వికదళం మరియు 100 ఏనుగులతో కూడిన పెద్ద సైన్యాన్ని
తయారుచేసి దానిని మాలిక్ అయాజ్ కింద పంపాడు.
ఈ సైన్యంలో మాండూ నుండి వచ్చిన
మాల్వా సుల్తాన్ మహమ్మద్ ఖిల్జీ సైన్యం చేరింది. రాజ్పుత్ ముఖ్యులంతా
రణ సంగా ఆధ్వర్యంలో నిల్చున్నారు.
సుల్తాన్
సైన్యం రణ సంగా గవర్నర్ అశోక్ మల్ ఆధ్వర్యంలో
ఉన్న మందసౌర్ను ముట్టడించింది. అశోక్
మల్ చంపబడ్డాడు కానీ కోట పడిపోలేదు.
సుల్తాన్ మరియు రాణా సంగాలచే
సమీకరించబడిన అపారమైన దళాలు ఒకదానికొకటి తలపడ్డాయి.
మాలిక్
అయాజ్పై అమీర్లకు
ఉన్న అనారోగ్య భావన కారణంగా అతను
పూర్తి శక్తితో కోటపైకి వెళ్లలేకపోయాడు. తాను ఓడిపోవడం ఖాయమని
భావించి, రణ సంగతో సంధి చేసుకుని, గుజరాత్కు తిరిగి వెళ్లిపోయాడు.
అక్కడ అందరూ అతనిని ఒక
పిరికివాడిలా చూసారు.
రణ
సంగా అనేక విజయాల తరువాత
అతని లక్ష్యం కూడా పెరిగింది. అదే
సమయంలో బాబర్ భారతదేశానికి వచ్చి
ఢిల్లీ కి అధిపతి అయ్యాడు.
రణ సంగా కు అప్పుడు
ఢిల్లీ ని జయించాలి అనే
ఆలోచన వచ్చింది. ముందుగా రాణా ఆఫ్ఘన్ అయిన
మహమ్మద్ లోడీ ని తనకు
సహాయంగా బాబర్ మీద యుద్ధానికి
వప్పించాడు. అలాగే మేవాతి ముస్లిమ్స్
హాసన్ ఖాన్ మేవాతి ఆధ్వర్యంలో
రాణా కు తమ సహాయాన్ని
ఇచ్చారు.
1527 సంవత్సరం లో
బాబర్ ను ఇండియా వీడి
వెళ్ళమని రాణా హెచ్చరిక పంపాడు.
దాని కోసం తన సామంత
రాజు అయిన రైసెన్ కు
చెందిన సర్దార్ సిల్హాది
ని బాబర్ తో మంతనాలు
చేయటానికి పంపాడు.
సిల్హాది ని బాబర్ ప్రలోభపెట్టి
తన వైపు తిప్పుకున్నాడు. వారు
ఇద్దరూ కలిసి యుద్ధం కీలక
స్థితి లో ఉండగా 35 ,000
సైనికులు ఉన్న
సిల్హాది సైన్యం బాబర్ వైపు తిరిగిపోతుంది
అని పన్నాగం వేశారు. సిల్హాది చిత్తూర్ తిరిగి వెళ్లి యుద్ధం చేయక తప్పదు అని
బాబర్ కు చెప్పాడు. అది
ఒక పచ్చి
మోసం.
వారి
సైన్యాలు Fatehpur సిక్రీ సమీపంలోని కాన్వా అనే ప్రదేశంలో యుద్ధానికి
తలపడ్డాయి. యుద్ధం ప్రబల స్థితిలో ఉండగా
సిల్హాది 35 ,000 మంది
సైన్యం పధకం ప్రకారం బాబర్
వైపు తిరిగిపోయింది. దానితో యుద్ధం బాబర్ వైపు తిరిగింది
కానీ అప్పటికి కూడా రాణా తన
సైన్యం ముందు భాగాన్ని బలపరుస్తుండగా
ఆయనకు గాయం తగిలి మూర్ఛపోయి
గుర్రం మీదనుండి కిందకు పడిపోయాడు. రాజపుట్ సైన్యాలు తమ రాజు మరణించాడు
అని భావించి యుద్ధరంగం, లోనుండి పారిపోగా మొఘుల్ సైన్యాలు యుద్ధం గెలిచాయి.
రాణా
ను రాథోర్ బలగాలు రక్షించి చిత్తూరు కి తిరిగి తీసుకుని
వెళ్లారు. అయన తన బలగాలను
బాబర్ తో తిరిగి యుద్ధం
చేయడానికి సమీకరించడం మొదలు పెట్టాడు. కానీ
అయన సైన్యాధిపతులు కొందరు అది ఆత్మహత్యా సదృశ్యమైనది
అని భావించి ఆయనను 1528 లో విషం
ఇచ్చి చంపేశారు. ఫిరంగులు లేకుండా గుర్రాలతో వాటిని ముట్టడించడం అనేది నిజంగా అత్మహత్య
తో
సమానం మరి.
రాణా
భార్య అయిన రాణి కర్ణావతి
తరువాత Jauhar చేసింది. రాణా ప్రతాప్ సింగ్
రాణా సంగ్రామ్ సింగ్ మనుమడు.
ఈ
వంశంలో ముగ్గురు గొప్ప శక్తివంతమైన రాజులు
ఉన్నారు. మొదటి వాడు రణ
కుంభా, ఈయన రణ సంగా
తాతగారు. ఈయన తన జీవితంలో
56 యుధాలు
చేసి అందులో ఒకటి కూడా ఓడిపోలేదు.
ఈయన పేరు మీదే కుంబల్గర్హ్
దుర్గం నిర్మించబడింది.
రణ
సంగా మనుమడు రాణా ప్రతాప్. ఈయన
అక్బర్ పాలించిన అతి ధృడమైన ముఘల్
సామ్రాజ్యాన్ని యుద్ధంలో ఓడినా సరే బ్రతికి
ఉన్నంత కాలం ప్రతిఘటించాడు.
ఈ మువ్వురూ మువ్వురే.
No comments:
Post a Comment