"డోంగ్రి to దుబాయ్" అనేది దావూద్ ఇబ్రహీం యొక్క బయోగ్రఫీ. దాన్ని నేను చాల కాలం కిందటే చదివాను. నేను కొద్దీ రోజుల క్రితం బొంబాయి వెళ్లనపుడు ఎందుకో ఎవరైనా దావూద్ ఇబ్రహీం లా క్రిమినల్ మాఫియా ని కుదిపిన వారు ఆడవారిలో ఎవరైనా ఉన్నారా అని ఒక క్యూరియాసిటీ కలిగి అలాంటివారి కోసం వెతికాను. బొంబాయిలో అలాంటి లేడీస్ ఉన్నారు అందులో ముఖ్యులు దాదాపు 5 మంది. ఆ
5 గురిలో నన్ను ఎక్కువ ఇంప్రెస్స్ చేసిన వ్యక్తి పేరు "అష్రఫ్ ఖాన్" (అది అబ్బాయి పేరులా ఉంది కానీ అమ్మాయి పేరే). ఆమె తరువాతి కాలంలో తన పేరు "సప్నా" గా మార్చుకుంది కూడా. నిజానికి ఆమె ఒక క్రిమినల్ కాదు కానీ దావూద్ ఇబ్రహీం నే భయపెట్టి చివరికి అతని చేత చంపబడింది. ఆమె ఒక వీర వనిత, అసలు ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా దావూద్ ఇబ్రహీం ని ఎదిరించింది ఆమె.
అష్రఫ్ ఖాన్ భర్త పేరు మహమ్మద్ ఖాన్. అయన అప్పటికే దుబాయ్ పారిపోయిన దావూద్ ఇబ్రహీం అనుచరుడు. కానీ అష్రఫ్ ఖాన్ కి భర్త దుబాయ్ లో ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అని తెలుసును కానీ అది ఎలాంటి ఉద్యోగమో ఆమెకి అసలు తెలియదు. అయన ఒక క్రిమినల్ అని కూడా తెలియదు.
ఆమెకి భర్త అంటే ప్రాణం. ఒక రోజు మహమ్మద్ ఖాన్ ఆమెకి ఫోన్ చేసి తాను ఇండియా వచ్చేస్తున్నాను అని చెప్పాడు. ఆమె చాల ఆనందపడి భర్తను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్ళింది. మహమ్మద్ ఖాన్ ఫ్లైట్ దిగి లాబీ లో ఆమెకి కనిపించాడు కానీ తరువాత మాయం అయిపోయాడు. అంతటిలో ఎయిర్పోర్ట్ లో ఒక పోలీస్ ఎన్కౌంటర్ అయ్యింది. అందులో పోలీస్ లు మె భర్తని కాల్చి చంపేశారు.
అష్రఫ్ ఖాన్ దుఃఖంలో ములిగిపోయింది కానీ చాల ధైర్యం అయిన వనిత కాబట్టి కళ్ళ నుండి నీరు రాకుండా ఆపుకోగలిగింది. భర్తనుఁ కప్పి పెట్టాక అష్రఫ్ కు తెలిసినది ఏమిటంటే ఆ ఎన్కౌంటర్ పోలీస్ ద్వారా దావూద్ ఇబ్రహీం చేయించాడు అని. ఆమె భర్త ఆలా దావూద్ ను వదిలేసి బొంబాయి వెళ్లిపోతాను అంటే దావూద్ ఇష్టపడలేదు. అందుకే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అష్రఫ్ భర్తను చంపించాడు.
అది తెలుసుకుని అష్రఫ్ కు కోపం వచ్చింది. దావూద్ ఇబ్రహీం ను ఎలాగైనా చంపాలి అనుకుంది ఆమె.కానీ అది ఎలాగు? అష్రఫ్ ఒక పక్కా ముస్లిం ఇల్లాలు. పైనుండి కిందవరకూ బురఖా ధరించి ఉండేది. కానీ అది ఎలా సాదించాలి అని తనకు తెలిసినవారిని అడిగింది. కానీ వాళ్ళు మట్టుకు ఏమి చెప్పగలరు. దావూద్ ఒక పెద్ద గ్యాంగ్స్టర్. ఇండియన్ పోలీస్ అంతా అయన కోసమే వెతుకుతుంది. అలాంటిది ఒక సాధారణ ఇల్లాలు ఆయనను ఏమి చేయగలదు అనుకున్నారు. అందులో ఎవరో బొంబాయి లో హుస్సేన్ ఉస్తారా అనే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు ఆయనకు దావూద్ అంటే కోపం, ఆయనను కలిస్తే ఏమైనా సాయం చేస్తాడు అని చెప్పారు.
హుస్సేన్ ఉస్తారా ఒక తిరుగుబోతు. అతనికి అసలు ప్రేమ అంటే ఏమిటో తెలియదు. అష్రఫ్ వెళ్లి ఉస్తారా ను కలిసి తనకు దావూద్ ను చంపాలి అని ఉంది అని చెప్పింది. ఉస్తారా కు నవ్వు వచ్చింది. ఈ బురఖా వేసుకున్న ఇల్లాలు ఏమిటి దావూద్ ని చంపడం ఏమిటి అని. కానీ ఆమె మాటల్లో ఉన్న దృఢత్వం చూసిన తరువాత ఆమెకు సహాయం చేద్దాము అనిపించింది ఉస్తారా కు. అష్రఫ్ ఉస్తారా కు తనకు షూటింగ్ నేర్పమని అడిగింది. అయన అందులో ఆమెను ట్రైన్ చేసాడు. అష్రఫ్ కూడా ఎంతో పట్టుదలతో షూటింగ్
మరియు కరాటే నేర్చుకుంది అయన దగ్గర. తరువాత మోటార్ బైక్ నేర్చుకోవడానికి బురఖా అడ్డు
పడటంతో బురఖా ను తీసేసింది అష్రఫ్. ఆమె ఒక అందమైన వనిత. పొడుగ్గా సున్నితంగా అందంగా
ఉండేది. ముందు సల్వార్ వేసుకునేది. నెమ్మదిగా జీన్స్ ట్ షర్ట్స్ లోకి మారిపోయింది.
ఉస్తారా ఒక పెద్ద womaniser. అలాంటివాడు అష్రఫ్ తో ప్రేమలో పడిపోయాడు. ఆమె అతనితో ఎంత దగ్గరగా ఉన్నా సరే అతన్ని ఒక మంచి ఫ్రెండ్ లాగానే చూసింది. ఆమె మనసులో దావూద్ ఇబ్రహీం ని చంపడం తప్ప ఇంకో ఉద్దేశం ఏమి లేదు అసలు. ఆమె బుర్ర అంతా దాని మీదే ఉంది. ఉస్తారా కు అది బాగా తెలుసు అందుకే ఆమెకు తన ప్రేమను చెప్పే ధైర్యం కూడా అతనికి లేకపోయింది.
ఉస్తారా కు దావూద్ నేపాల్ నుండి గన్స్ తరచు SMUGGLE చేస్తుంటాడు అని తెలుసు. దాన్ని ఆపితే Dawood కి పెద్ద నష్టం వస్తుంది. అందుకు ఉస్తారా అష్రాఫ్ ఇద్దరు బయలుదేరి నేపాల్ వెళ్లి చాలా సార్లు దావూద్ గన్ consignments ఆపేసారు.
ఒక రోజు ఉస్తారా అష్రాఫ్ మీద తన ప్రేమను ఆపుకోలేకపోయాడు. ఆమెను గబుక్కున కౌగలించుకున్నాడు అంతే అష్రఫ్ త్రాచుపాములా లేచింది. వెంటనే వీడుకోలు చెప్పి వెళ్లిపోయింది. ఇంక ఆమె మళ్ళీ చనిపోయేవరకు ఉస్తారా ను కలవలేదు.
ఆమెకు ఆమె బొంబాయి లో దావూద్ సారా, జూదం వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయో కూపీ లాగి పోలీస్ కి చెప్పేసి వాటిని మూయించేసింది. అసలు ఏకాకిగా ఒక housewife అంత పని చేయగలిగింది ఆంటే ఆమె ఎంత ధైర్యవంతురాలో తెలుస్తుంది. అప్పుడు దావూద్ ఇబ్రహీం దుబాయిలో ఉన్నా బొంబాయి లో మట్టుకు నెంబర్
1 గ్యాంగ్స్టర్.
చివరికి ఆమె Sharjah లో దావూద్ ఇబ్రహీం క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చినపుడు చంపడానికి ప్లాన్ వేసింది. దాని ప్రకారం ఆమె మనుషులు కొనలు పదునుగా గా ఉన్న గొడుగులతో మైదానం లోకి వచ్చి వాటితో దావూద్ ను పొడిచి చంపాలి. కానీ ఆ ప్లాన్ విషయం ఆమె ఆ పనికి పెట్టిన మనుషులలో ఒకడు దావూద్ అనుచరుడు ఆయన చోట షకీల్ కు చేరవేసాడు.
చివరికి ఆమె Sharjah లో దావూద్ ఇబ్రహీం క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చినపుడు చంపడానికి ప్లాన్ వేసింది. దాని ప్రకారం ఆమె మనుషులు కొనలు పదునుగా గా ఉన్న గొడుగులతో మైదానం లోకి వచ్చి వాటితో దావూద్ ను పొడిచి చంపాలి. కానీ ఆ ప్లాన్ విషయం ఆమె ఆ పనికి పెట్టిన మనుషులలో ఒకడు దావూద్ అనుచరుడు ఆయన చోట షకీల్ కు చేరవేసాడు.
దానితో ఛోటా షకీల్ ఆమెను చంపడానికి ఏకంగా 20 మంది మనుషులను పంపాడు. ఆమె తన దగ్గర వున్న Mauser పిస్టల్ వాడటంతో దిట్ట అయినా సరే వాళ్ళు ఆమెని surprise చేసి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దావూద్ కి ఆలా అపకారం చేసినవాళ్లు సులభంగా చనిపోతే మరి ఇతరులకు హెచ్చరిక ఎలా వెళుతుంది. అందుకే వాళ్ళు ఆమెను షూట్ చెయ్యలేదు. కత్తులతో వళ్ళంతా గాయపరిచి ఆమె ఆలా రక్తం కోల్పోతూ మరణించేలా చేసి వదిలేసారు. దానితో అష్రఫ్ మరణించింది.
అష్రఫ్ ధైర్యం ఆమె పట్టుదల చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. చాలా మంది మనుషులు పేరు వింటే వణికిపోయే దావూద్ ఇబ్రహీం ని వీసమెత్తు కూడా భయపడకుండా ఎదిరించి కలవర పెట్టింది ఆమె. ఆమె జీవితం సజావుగా సాగి ఆమె సైన్యంలో ఉంటే దేశం కోసం పోరాడి పరమ వీర్ చక్ర తెచ్చుకుందును ఆమె. కానీ ఆమె జీవితం చివరి క్షణం వరకు ఆమె దావూద్ ఇబ్రహీం ని చంపాలి అనే తపన తోనే జీవించింది. ఆమె ఉద్దేశం లో అదే ఆమె ధర్మం.
అన్నట్టు ఆమె తన పేరును మధ్యలో "సప్నా" గ మార్చుకుంది. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం ఆంటే పడని ఒక హిందూ గ్యాంగ్స్టర్ సాయం తీసుకోవాలి అని చెప్పి. అయనకు ముస్లిమ్స్ ఆంటే పడదు అందుకే ఆలా చేసింది.
No comments:
Post a Comment