జిడ్డు
కృష్ణమూర్తి ఒక విశిష్టమైన తత్త్వవేత్త.
మనకు తెలిసిన తత్త్వవేత్తలు అందరూ వారికే
సర్వం తెలిసినట్టుగా మనకు బోధించారు. జిడ్డు
కృష్ణమూర్తి ముందుగా అదే విధంగా బోధించినా
తరువాత తన తత్వాన్ని మార్చుకుని
పూర్తిగా దానికి భిన్నంగా బోధించాడు.
అయన
బోధన చాల గహనం ఐనది,
చాలా మందికి సులువుగా భోధపడేది కాదు. పైగా అయన
ఏమి చెప్పదలిచినా మహా సంక్లిష్టంగా చెపుతాడు.
ఒక పంక్తి లో చెప్పవలసిన దాన్ని
ఒక పేజీ లో చెపుతాడు.
అసలు అయన ఏమి చెప్పాడు?
అది తెలుసుకునే ముందు కృష్ణమూర్తి జీవితం
ఎలా జరిగిందో చూద్దాము.
జిడ్డు
కృష్ణమూర్తి 1895 సంవత్సరం లో చిత్తూరు జిల్లాలోని
మదనపల్లె లో పుట్టాడు. అయన
తండి నారాయణయ్య బ్రిటిష్ వారి దగ్గర క్లర్క్
గా పని చేసేవాడు. వాళ్ళ
కుటుంబం తరువాత కడప కు మారింది.
అక్కడ కృష్ణమూర్తి కి మలేరియా సోకి
తగ్గి మళ్ళీ వచ్చి ఆలా
చాలా రోజులు బాధపెట్టింది. అయన ఆరోగ్యం సరిగా
ఉండేది కాదు. ఆయనను ఒక
మానసికంగా వెనుకబడ్డ పిల్లవాడిగా చూసేవారు. ఇంటి దగ్గర మరియు
బడి లోను ఆయనను తరచూ
కొట్టేవారు.
కృష్ణమూర్తి
తండ్రి అయిన నారాయణయ్య పదవీ
విరమణ చేసిన తరువాత మద్రాస్
లోని థియొసాఫికల్ సొసైటీ లో ఒక క్లర్క్
గా చేరాడు. ఆయనకు అడయార్ లోని
థియొసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయం దగ్గరలో నివాసానికి ఒక ఇల్లు ఇవ్వబడింది.
1909 సంవత్సరం
లో కృష్ణమూర్తి మరియు అతని అన్న
అయిన నిత్యానంద అడయార్ సముద్రం దగ్గర ఆడుకుంటూ ఉండగా
అనీ బీసెంట్ తో పాటు థియొసాఫికల్
సొసైటీ స్థాపించిన కల్నల్ చార్లెస్ లెడ్ బెట్టెర్ వారిని
చూసి ప్రభావితం అయ్యాడు. ఆయనకు వారిలో ఎదో
ప్రత్యేకత కనబడింది. కృష్ణమూర్తిలో ఎదో తేజం కనబడింది
ఆయనకు. దానితో వారిని గురించి అయన అనీ బీసెంట్
కు సిఫారసు చేసాడు. అనీ బీసెంట్ వారి
తండ్రితో మాట్లాడి వారిని
దత్తత తీసుకుంది.
దత్తత
చేసుకున్న తరువాత కృష్ణమూర్తి మరియు నిత్యానంద కు
విద్య థియొసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయం లో ఇవ్వబడింది. ఆ
సమయం లో కృష్ణమూర్తి అనీ
బీసెంట్ మధ్య ఒక ధృడమైన
బంధం ఏర్పడింది.
అనీ
బీసెంట్ 1911 సంవత్సరం
లో "Rising Star
of the East " అనబడే
ఒక సంఘాన్ని స్థాపించి కృష్ణమూర్తి దాని యొక్క దూత
గా అభివర్ణించింది. అప్పటికే థియోసోఫీ ప్రపంచంలోనే ఒక పెద్ద ఉద్యమం
లా మారింది. దానికి ప్రపంచం నలు మూలల అనుచరులు
ఉండేవారు. అనీ బీసెంట్ కృష్ణమూర్తి
ని ఒక దూత గా
చెప్పడంవల్ల వారు అందరు కృష్ణమూర్తి
ని ఒక దేవత లా
చూసి ఆయనకు బ్రహ్మ రధం పట్టారు.
తరువాత
1911 లో
అన్న తమ్ములు ఇద్దరినీ చదువుకోవడానికి అనీ బీసెంట్ ఇంగ్లాండ్
లోని Emily Lutyens ( ఢిల్లీ
నగరం యొక్క ఆర్కిటెక్ట్ Edward Lutyens
భార్య) దగ్గరకు
పంపింది. వారు ఆమె దగ్గర
ఉండి ప్రైవేట్ ట్యూటర్ పెట్టుకుని చదువుకున్నారు. ఆ తరువాత అనీ
బీసెంట్ చదువు కోసం వారిని
ఫ్రాన్స్ లోని Sorbonne కి
పంపింది.
మొదటి
ప్రపంచ యుద్ధం 1911 లో
మొదలు అయిన తరువాత నుండి
1914 వరకు
అన్న తమ్ములు ఇద్దరు అనేక ఐరోపా దేశాల
లో పర్యటించారు. వారు ఏ దేశానికీ
వెళ్లినా థియోసాఫిస్ట్ లు వారికి బ్రహ్మ
రధం పట్టారు.
కృష్ణమూర్తి
తండ్రి మొదటిలో తన పిల్లలను అనీ
బీసెంట్ దత్తత తీసుకోవటానికి అనుమతి
ఇచ్చినప్పటికీ తరువాత తన పిల్లల బాగోగుల
గురించి అనీ బీసెంట్ ఆయనను
అసలు సంప్రదించడం లేదు అని కోపం
వచ్చి అయన అనీ బీసెంట్
పేరులో రాసిన దత్తత పత్రాన్ని
రద్దు చేయడానికి దావా వేసాడు. ఆ
దావాలో అనీ బీసెంట్ నెగ్గింది.
అప్పుడు వారి పెంపకం అనీ
బీసెంట్ స్వాధీనం అయ్యింది.
కృష్ణమూర్తి
ఆటలు బాగా ఆడేవాడు కానీ
చదువులో మాత్రం వెనుక ఉండేవాడు. చివరికి
అయన విశ్వ విద్యాలయం లో
ప్రవేశం సంపాదించలేక చదువు వదిలేసాడు. భాష
లు నేర్చుకోవడంలో మాత్రం కృష్ణమూర్తి ముందు ఉండేవాడు. అయన
చాలా విదేశీ భాషలు నేర్చుకున్నాడు.
మొదటి
ప్రపంచ యుద్ధం తరువాత అంటే 1918 తరువాత
కృష్ణమూర్తి తన ఆర్డర్ యొక్క
సమావేశాలు నిర్వహిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ రచనలు కూడా
చేయటం మొదలుపెట్టాడు. ముందులో అయన మాట్లాడటానికి వెనుకాడుతూ
విషయాన్ని పునరావృతంగా మాట్లాడేవాడు కానీ అనుభవం తరువాత
ఆయనకు విశ్వాసం వచ్చింది. దానితో అయన ఉపన్యాసాలు మెరుగు
పడ్డాయి.
1922 సంవత్సరంలో
కృష్ణమూర్తి కాలిఫోర్నియా లోని Ojai లోయకు వెళ్లి అక్కడ
ఒక కుటీరంలో ఉన్నాడు. ఆ సమయానికి అయన
అన్న అయిన నిత్యానంద్ టీబీ
వ్యాధి సోకి అస్వస్థత తో
ఉన్నాడు. అక్కడ ఆ అన్న
తమ్ములు రోసలిండ్
విలియమ్స్ అనే అమెరికన్ యువతి
ని కలిశారు. తరువాత ఆమె వారి ఇద్దరికీ
మంచి సన్నిహితం అయ్యింది.
Ojai లోయ
లో ఉన్నపుడు మాత్రం అన్న తమ్ముళ్లకు మొదటిసారిగాథియోసాఫిస్ట్స్
ల తాకిడి తప్పింది. అంతకు ముందు అయితే
వారు ఎక్కడికి వెళ్లినా సరే
థియోసాఫిస్ట్ లు వారిని అనుసరించేవారు.
కొన్ని రోజుల తరువాత కృష్ణమూర్తి
శిష్యులు ఒక ట్రస్ట్ నెలకొలిపి
వారి ఉంటున్న కుటీరం చుట్టు పక్కల ఉన్న భూమిని
కొని ఇచ్చారు. అదే కృష్ణమూర్తి యొక్క
అధికారిక నివాసం అయ్యింది.
1922 సంవత్సరంలో
కృష్ణమూర్తి కి అయన జీవితాన్ని
మార్చే ఒక సంఘటన, బహుశా
ఒక రకమైన నరాల బలహీనత
వల్ల వచ్చింది. అయన అది ఒక
ఆధ్యాత్మికమైన సంఘటనగా భావించాడు. ఆ సంఘటన గురించి
సమాచారం అందగానే థియోసాఫిస్ట్ ల లో అయన
మీద భక్తి భావం పెరిగిపోయి
ఆయనకు ఉన్న దూత స్థితి
ని 1925 సంవత్సరం
లో వారి సమావేశం వచ్చే
సమయానికి ఇంకా ఆకాశానికి ఎత్తేసారు.
1925 సంవత్సరం
లో నవంబర్ మాసం లో నిత్యానంద్
మరణించాడు. అన్న మరణం కృష్ణమూర్తి
ని కుదిపివేసింది. దానితో కృష్ణమూర్తి నెమ్మదిగా థియోసోఫీ యొక్క తత్త్వం నుండి
బయట పడి తన సొంతం
అయిన ఒక తత్వాన్ని నిర్విచించాడు.
చివరికి 1925 సంవత్సరం
లో అయిన "Rising Star
of the East " సమావేశం
లో కృష్ణమూర్తి ఆ ఆర్డర్ ని
రద్దు చేసేసాడు.
ఆర్డర్
ని రద్దు చేస్తూ
ఆయన అన్నాడు " నిజము అనేది దారి
లేనిది. ఎట్టి దారి నుండి
అయినా ఎట్టి మతం అవలంబించినా,
ఎట్టి శాఖ ను అనుసరించినా
సరే దాని దరికి చేరలేము
. నిజం అనేది హద్దులు లేనిది,
నియమాలు లేనిది, దారి లేనిది అందుచేత
దానిని వ్యవస్థీకృత చేయలేము కాబట్టి దానిని చేరటానికి ప్రపంచంలో ఏ సంస్థ అయినా
స్థాపించడంలో అర్ధం లేదు. ప్రజలను
బలవంతంగా ఒక మార్గం లో
తీసుకువెళ్లడానికి ఒక సంస్థ ప్రయత్నించడంలో
కూడా అర్ధం లేదు."
కృష్ణమూర్తి
ఆర్డర్ ని రద్దు చేసి
తరువాత ఆ ఆర్డర్ కి
సంభందించిన ట్రస్ట్స్ అన్నిటినుండి మరియు థియోసాఫికల్ సొసైటీ
నుండి రాజీనామా చేసాడు. భక్తులు ఆ ట్రస్ట్ కు
ఇచ్చిన డబ్బు ఆస్తులు మొత్తం
ఇచ్చినవారికి తిరిగి ఇచ్చేసాడు. వాటిలో హాలండ్ లోని ఒక కోట
5000 ఎకరాల
భూమి కూడా ఉంది.
1930 సంవత్సరం
నుండి 1940 వరకు
కృష్ణమూర్తి ఐరోపా, లాటిన్ అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా మరియు అమెరికా
ల లో పర్యటించి ఉపన్యాసాలు
ఇచ్చాడు. రాజగోపాల్ తో కలిపి అయన
ఒక ప్రచురణ ట్రస్ట్ స్థాపించాడు. Ojai వారి
కార్యకలాపాలకు కేంద్రం అయ్యింది. Ojai లోని
కృష్ణమూర్తి ఇంటికి "ఆర్య విహార" అనే పేరు
ఉండేది.
1927 సంవత్సరంలో
రోసలిండ్ విలియమ్స్ రాజగోపాల్ ను వివాహం చేసుకుంది.
1931 లో
రోసలిండ్ కు రాధా అనే
ఒక పుత్రిక జన్మించిన తరువాత రాజగోపాల్ దంపతుల మధ్య బంధం సడలిపోయింది.
అప్పటికి రోసలిండ్ కి కృష్ణమూర్తి కి
ఉన్న బంధం
ప్రేమ గా మారిపోయింది. ఈ
బంధం రాజగోపాల్ రోసలిండ్ ల మధ్య కలతలు
రేపింది.
1940 నుండి
1944 వరకు
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నపుడు కృష్ణమూర్తి ప్రజల ముందు మాట్లాడలేదు.
అయన తిరిగి 1944 లో
మాటలాడటం మొదలుపెట్టి 1947 సంవత్సరం
లో ఇండియా పర్యటన చేసాడు.
ఆ పర్యటనలో అయన భారత దేశంలో
ముఖ్యులు అందరిని జవహర్ లాల్ నెహ్రు
గారి తో సహా కలిసాడు.
1970 సంవత్సరం
లో కృష్ణమూర్తి ఇండియా టూర్ చేసి ఇందిరా
గాంధీ ని చాలా సార్లు
కలిసాడు. అప్పటికి రాజగోపాల్ తో కృష్ణమూర్తి కి
ఉన్న బంధం క్షీణించి కృష్ణమూర్తి
రాజగోపాల్ మీద ట్రస్ట్ సొమ్ము
దుర్వినియోగం చేసాడు అని చెప్పి కోర్ట్ లో
దావా వేసాడు. ఆ దావా 1971
లో మొదలు అయ్యి చివరికి
1986 సంవత్సరంలో
పూర్తి అయ్యింది. అదే సంవత్సరం లో
కృష్ణమూర్తి మరణించాడు. అప్పటికి ఆయనకు 90 సంవత్సరాలు.
అతి
సులభంగా చెప్పాలి అంటే కృష్ణమూర్తి తత్త్వం
ప్రకారం నిజం అన్నదానికి దారి
లేదు. అందుచేత ఒక సంస్థ కానీ
గురువు కానీ ఒక వ్యక్తిని
ఒక పద్ధతిలో నడిపించి దారి చూపించలేరు. ఎవరి
దారి వాళ్లే వెతుక్కోవాలి.
అంతవరకూ
ఉన్న పధ్ధతి ప్రకారం ఒక వ్యక్తికి దారి
చూపించేవారు అంటే ఒక గురువు
కావాలి. దాన్ని కృష్ణమూర్తి శీర్షాసనం వేయించాడు. ఎవరి దారి వారిదే,
ఇంకొకరు వారికి దారి చూపించలేరు అని
చెప్పేసాడు. అంటే దానికి గురువు
అనే విధానం పని చేయదు అని
అర్ధం.
ఆశ్చర్యం
ఏమిటంటే మరి ఆలా చెప్పిన
తరువాత అయన ఇంకొకరికి దారి
చూపించడం సాధ్యం కాదు. కానీ అయన
ప్రపంచం నలు మూలలూ తిరుగుతూ
ప్రజలు అడిగిన ప్రశ్నలకు రకరకాల భాష్యాలు చెప్పాడు. అంటే గురువు అనేవాడు
మనకు ఏమి చెప్పలేడు అని
చెప్పి ఆయనే ఒక గురువు
లా ప్రజలకు ప్రవచనాలు చేసాడు. అంటే ఆయన సిద్ధాంతాన్ని
ఆయనే ఉల్లఘించాడు.
కృష్ణమూర్తి
జీవితం మనకు ఒక విషయాన్ని
చెపుతుంది. ఎంత గురువు అని
చెప్పుకునేవారు అయినా వారు కూడా
మనుష్యులే. మనకు ఉన్న బంధాలు
బలహీనతలు వారికి కూడా ఉంటాయి. ఇంకొకరు
చెప్పేది వినడం ఎప్పుడూ తప్పు
కాదు. కానీ దాన్ని విశ్లేషించి
తీసుకోవడం మన జీవితానికి సరి
అయిన మార్గాన్ని చూపిస్తుంది. ప్రపంచంలో ఏ ఒక్కరు పరిపూర్ణం
అయిన వారు కారు. ఎలాంటి
విషయం ఎవరు చెప్పినా సరే
ఎప్పుడూ విశ్లేషించకుండా స్వీకరించడం పెద్ద తప్పు.
రిషీ
వాలీ స్కూల్ భారత దేశం లో విద్యా విధానానికి కృష్ణమూర్తి ఇచ్చిన సహకారం. అది ఒక కొత్త
పధ్ధతి లో విద్యార్థులకు బోధన చేయటం మొదలుపెట్టింది. రిషి వాలీ స్కూల్ అనీ
బీసెంట్ చేత మొదటలో ప్రపంచ
విశ్వవిద్యాలయం కల్పిద్దాము అనే ఉద్దేశంతో 1925
లో ప్రారంభించబడింది. దానిని జిడ్డు కృష్ణమూర్తి యొక్క స్వగ్రామం అయిన
మదనపల్లె దగ్గర ఆమె ప్రారంభించింది.
కానీ దానికి సమయం కేటాయించలేక వదిలేసింది.
అప్పటికి కృష్ణమూర్తి అమెరికా లో ఉన్నాడు.
అయన 1947 ఇండియా
వచ్చి ఆ స్కూల్ ని
తిరిగి పునరుద్ధరించాలి అని ప్రయత్నం మొదలు
పెట్టాడు. 1950 సంవత్సరం
నుండి ఆ స్కూల్ తిరిగి
పుంజుకుంది.
స్కూల్
లో సంగీతం, నృత్యం, హైకింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్ మరియు కృష్ణమూర్తి తత్త్వం
కూడా బోధించబడింది. అంతే కాక అక్కడ
బోధనా పధ్ధతి వేరుగా ఉండటంవల్ల తరువాతి కాలంలో అది విద్యార్థులకు శిక్షణ
ఇచ్చే ఒక ప్రత్యేక సంస్థ
గా పేరు పొందింది.
No comments:
Post a Comment