Blackholes అతి సాంద్రంగా కుదించుకుపోయిన దట్టమైన పదార్థం తో ఏర్పడతాయి. వాటిలో గురుత్వాకర్షణ అన్ని ఇతర శక్తులను అధిగమిస్తుంది. మీరు ఒక చిన్న ప్రదేశంలో అతి ఎక్కువ ద్రవ్యరాశిని ప్యాక్ చేయగలిగితే, అది అతి బలమైన గురుత్వాకర్షణ ను సృష్టిస్తుంది. ఇది చివరికి కాంతి కిరణాలను కూడా ప్రసరించనీయదు.
కాంతిని కూడా ప్రసరించనీయవు కాబట్టి వాటిని చూడటం కానీ, మన పరికరాల ద్వారా వాటిని గుర్తించడం కానీ మనకు సాధ్యం కాదు. కాని వాటికి అతి తీవ్రమైన గురుత్వాకర్షన ఉంటుంది. అవి ఇతర నక్షత్రాల మీద, గాలక్సీ ల మీద చేసే గురుత్వాకర్షణ ప్రభావాన్ని బట్టి వాటి ఉనికిని మనం గుర్తించవచ్చు.
భారీ నక్షత్రాలు వారి జీవితాల చివరిలో కూలిపోయినప్పుడు (మరియు బహుశా మనకు ఇంకా తెలియని ఇతర పరిస్థితులలో) Blackholes సృష్టించబడతాయి. చికాగో యూనివర్శిటీ ప్రొఫెసర్ మన దేశస్తుడు అయిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, నక్షత్రాలు వేడిగా మరియు ప్రకాశవంతంగా ఉంచే ఫ్యూజన్ రియాక్షన్ల కోసం ఇంధనం అయిపోయిన తర్వాత అవి కూలిపోవాల్సి(explode) వస్తుందని గ్రహించినప్పుడు, బ్లాక్ హోల్స్ కనుగొనడంలో మొదటి అడుగు వేసాడు.
విశ్వమంతా బ్లాక్ హోల్స్తో నిండి ఉంది. గత దశాబ్దంలో, శాస్త్రవేత్తలు వాటి ఢీకొనే సంకేతాలను గుర్తించారు మరియు వాటి చుట్టూ తిరుగుతున్న వాయువు నుండి కాంతి చిత్రాలను తీశారు-ఇది విశ్వం గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి మనకు సహాయపడింది.
ఉదాహరణకు, ఐన్ స్టెయిన్ యొక్క సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని పరీక్షించడంలో Blackholes మనకు సహాయపడాయి, ఈ సిద్ధాంతం ద్రవ్యరాశి, స్థలం మరియు సమయం ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉందో వివరిస్తుంది. ఈ Blackholes విశ్వం యొక్క ఇతర ముఖ్యమైన నియమాల గురించి మనకు చాలా ఎక్కువ చెప్పగలవు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరింత వ్యక్తిగత స్థాయిలో, మన స్వంత పాలపుంత గెలాక్సీ మధ్యలో ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ భూమి ఇక్కడ ఎలా వచ్చింది అనే దానిలో పాత్ర పోషించి ఉండవచ్చు!
బ్లాక్ హోల్ లో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది ఈవెంట్ Horizon. ఇది కేవలం ఒక ఊహామాత్రపు రేఖ. ఆ రేఖ దాటిన తరువాత ఏ పదార్థం అయినా, వస్తువు అయినా సరే బ్లాక్ హోల్ నుండి ఎట్టి పరిస్థితి లోను బయటకు రాలేదు. ఒక వస్తువు Event Horizon దాటిన వెంటనే Blackhole యొక్క Schwarzschild radius లోనికి ప్రవేశిస్తుంది.రెండవది Singularity.
Blackhole లోనే పదార్థం అతి సాంద్రంగా ఉంటుంది. ఇక దాని కేంద్రం దగ్గర సింగులారిటీ అంటే ఒకే బిందువు దగ్గర అనంతం అయిన పదార్థం, గురుత్వాకర్షణ ఉంటాయి. దాని లక్షణాలను మనం ఊహించలేము కూడా.
విశ్వ పదార్థం యొక్క సగటు సాంద్రత 10-22 gms/cc. అదే ఒక Blackholeయొక్క Event Horizon లోపల సాంద్రత అయితే 4*1014gms/cc.
మన మూవీస్ లో మనుషులు ఒక స్పేస్ షిప్ లో Blackhole దగ్గరకు వెళ్లినట్టు చూపిస్తారు. అసలు మనం దాని దగ్గరకే కాదు దాని చుట్టు పక్కలకు కూడా మనం వెళ్లలేము ఎందుకంటే Blackhole ను సమీపించే కొద్దీ గురుత్వాకర్ష శక్తి అపారంగా పెరిగిపోయి ఆ ప్రదేశంలో ఉన్న ఏ వస్తువును అయినా సరే వదలదు. ఏదైనా స్పేస్ షిప్ దాని దరిదాపుల లోనికి వెళితే కూడా దానికి కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలోనే కంట్రోల్ కోల్పోతుంది. కోల్పోయి, అతి వేగంతో అది blackhole వైపు పడిపోతుంది. మనం మొత్తం భూమి మీద ఖర్చు చేసే ఎనర్జీ అంతా ఆ స్పేస్ షిప్ కు ఇచ్చినా సరే మనం దానిని ఆపలేము.
No comments:
Post a Comment