నేను అలెగ్జాండర్ పోరాడిన Gaugamela యుద్ధం
గురించి చదివినప్పుడు చాల ప్రభావితం అయ్యి అయన గురించి రాయాలి అనుకున్నాను. అయన యొక్క
ధైర్యం మరియు బలమైన శత్రువు అంటే ఆయనకు ఉన్న
నిర్లక్ష్య వైఖరి అయన వేపు నన్ను ఆకర్షితుడిని చేసాయి. అదే ఈ చిన్న వ్యాసం అయన మీద.
ప్రపంచ విఖ్యాత చక్రవర్తుల లో అలెగ్జాండర్ ఒకడు.
మనకు అలెగ్జాండర్ గురించి తెలుసును ఎందుకంటే అయన ఇండియా మీద
దండెత్తి దక్షిణ పంజాబ్ లో మన రాజు
ఆయన పురుషోత్తముడితో యుద్ధం చేసాడు. కానీ మనకు అయన
గురించి తెలిసింది క్లుప్తంగానే.
అలెగ్జాండర్ క్రిస్తు పూర్వం 356 లో
మేసిడోనియా సామ్రాజ్యం లో పుట్టాడు. అయన
తండ్రి ఐన ఫిలిప్ మేసిడోనియా
సామ్రాజ్యానికి మహారాజు. తల్లి పేరు ఒలింపియా.
ఫిలిప్ కు 7 గురు
రాణులు ఉన్నారు కానీ ఒలింపియా కొంత
కాలం అయన ముఖ్య రాణి
గా ఉంది.
అలెగ్జాండర్ కు 10 సంవత్సరాలు
ఉండగా Thessaly అనే
రాజ్యం నుండి వచ్చిన ఒక
వ్యాపారస్తుడు ఒక గుర్రాన్ని ఫిలిప్
కు బహుమతిగా ఇచ్చాడు. ఆ గుర్రాన్ని ఎక్కడం
ఎవరికీ సాధ్యం కాలేదు ఎందుకంటే ఎక్కగానే అది వాళ్ళను పడేసింది.
కానీ అలెగ్జాండర్ ఆ గుర్రాన్ని పరిశీలించి
దాని నీడ ను చూసి
అదే భయపడుతుంది అని గ్రహించాడు. దాని
భయాన్ని వాడుకుని అలెగ్జాండర్ ఆ గుర్రాన్ని ఎక్కి
విజయవంతంగా స్వారీ చేసాడు. దాన్ని చూసి తండ్రి ఫిలిప్
అలెగ్జాండర్ కు మేసిడోనియా మరీ
చిన్న రాజ్యం అని వ్యాఖ్యానించాడు. అలెగ్జాండర్
ఆ గుర్రానికి "Bucephalus
" అని పేరు పెట్టాడు. ఆ
గుర్రం అలెగ్జాండర్ చేసిన అన్ని యుద్ధాల
లోను అలెగ్జాండర్ ని తీసుకెళ్లింది.
అలెగ్జాండర్ కు 13 సంవత్సరాలు
ఉండగా ఫిలిప్ అలెగ్జాండర్ కి గురువుగా సోక్రటీస్
ను నియమించాడు. అలెగ్జాండర్ కు గ్రీకు కవి
హోమర్ రచనలు అంటే ఇష్టం,
ముఖ్యంగా అయన రచన ఐన
"ఇలియాడ్" అంటే. . ఆయనకు సోక్రటీస్ ఒక
ఇలియాడ్ గ్రంధాన్ని బహూకరించాడు. దాన్ని అలెగ్జాండర్ తన యుద్ధాలు అన్నిటిలో
కూడా తీసుకుని వెళ్ళేవాడు.
అలెగ్జాండర్ కు 16 సంవత్సరాలు
ఉండగా ఫిలిప్ బైజాంటియమ్ మీద యుద్ధానికి వెళ్తూ
రాజ్యాన్ని అలెగ్జాండర్ చేతుల్లో పెట్టాడు. దానితో సోక్రటీస్ దగ్గర అలెగ్జాండర్ శిష్యరికం
అంతం అయ్యింది. అలెగ్జాండర్ సామ్రాజ్యంలో జరిగిన ఒక తిరుగుబాటు ను
అణచివేసి Alexandropolis
అనే నగరాన్ని స్థాపించాడు.
అప్పటివరకు మేసిడోనియా గ్రీస్ లో ఒక చిన్న
రాజ్యం. ఫిలిప్ అలెగ్జాండర్ తో కలిసి నెమ్మదిగా
గ్రీస్ లో ఉన్న ఇతర
రాజ్యాలను గెలిచి సామ్రాజ్యం విస్తరించాడు. గ్రీకు చిన్న రాజ్యాలు అన్ని
కలిపి ఏకం అయ్యి ఏథెన్స్
ను Thebes ను
ఓడించారు. తరువాత ఈ రాజ్యాల సమ్మేళనానికి
ఫిలిప్ పెద్ద అయ్యాడు. ఈ
సమ్మేళనం లో గ్రీసులో ఉన్న రాజ్యాలలో స్పార్టా రాజ్యం మాత్రమే లేదు.
ఫిలిప్ యుద్ధ తంత్రం లో
అందె వేసిన చెయ్యి. అతను
మెసిడోనియన్
phalanx అని
చెప్పి ఒక కొత్త యుద్ధ
తంత్రం ఆవిష్కారించాడు. అందులో సైనికులు 6.5 కిలోగ్రాముల
బరువు ఉండి 18 అడుగులు
పొడవైన ఒక బల్లెం ధరించేవారు.
దానిని సరిస్సా అని పిలిచేవారు. ఒక్కో
Phalanx లో 16 మంది సైనికులు
అడ్డంగాను 16 మంది సైనికులు
నిలువుగాను అంటే చతురస్రంలో మొత్తంగా
256 మంది
సైనికులు ఉండేవారు. ముందు పంక్తిలో ఉండే
సైనికులు సరిస్సా ను తమ ముందుకు
చాచి మెడకు డాలు ధరించి
శత్రు సైనికులు తమ వద్దకు వచ్చే
లోపే పొడిచి సంహరించేవారు. ఈ కొత్త యద్ద
తంత్రం వలన మాసిడోనియన్ సైన్యం
శత్రు దుర్భేద్యం అయ్యింది.
ఫిలిప్ తిరిగి మేసిడోనియా వచ్చాక ప్రేమలో పడి క్లియోపాత్రా యూరిపిడిస్
(ఈజిప్షియన్ క్లియోపాత్రా కాదు) అనే
ఒక సైన్యాధిపతి మేనకోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక మాసిడోనియన్
కానీ అలెగ్జాండర్ తల్లి సగం మాసిడోనియన్
అంటే ఆమె తల్లితండ్రుల లో
ఒకరు మాసిడోనియన్ కాదు. ఒకవేళ ఈ
క్లియోపాత్రా కి కానీ కొడుకు
పుడితే మొత్తం మాసిడోనియన్ కాబట్టి అతనే రాజ్యానికి చక్రవర్తి
అవుతాడు.
ఫిలిప్ మరియు క్లియోపాత్రా యూరిపిడిస్
పెళ్లి లో క్లియోపాత్రా చిన్నాన్న
అలెగ్జాండర్ ను అవమానించాడు. అయన
మీద తిరగబడిన అలెగ్జాండర్ ను ఫిలిప్ కత్తి తీసి
చంపబోయాడు. కానీ మద్యం మత్తులో
ఉండటం వల్ల కింద పడిపోయాడు.
ఆ తరువాత అలెగ్జాండర్ తన తల్లి ఐన
ఒలింపియా ను తీసుకుని మేసిడోనియా
నుండి పారిపోయాడు. తల్లిని ఆమె అన్న దగ్గర
వదిలిపెట్టి తాను ఇల్లిరియా అనే
దేశంలో 6 నెలలు
తలదాచుకున్నాడు. చివరికి ఒక కుటుంబ స్నేహితుడు
ఫిలిప్ మరియు అలెగ్జాండర్ మధ్యన
సహోద్య
కుదిర్చాడు.
ఫిలిప్ ను తన అంగరక్షక
దళ అధ్యక్షుడు హత్య చేయగా రాజకీయ
ప్రముఖులు, సైన్యం అలెగ్జాండర్ ను క్రిస్తు పూర్వం
336 లో
మహారాజు గా ప్రకటించారు. అప్పుడు
అలెగ్జాండర్ వయసు 20 సంవత్సరాలు.
ఫిలిప్ మరణ వార్త వినగానే
Thebes , Athens , Thessaly మరియు Thracian తెగలు తిరుగుబాటు
చేసాయి. అలెగ్జాండర్ ఆ తిరుగుబాటులను అణచివేసాడు.
ఆయనను గ్రీకు రాజ్యాలు అన్నీ కలిసి పెర్షియన్
సామ్రాజ్యం మీద చేసే దండయాత్రకు
సైన్యాధ్యక్షుడిగా ప్రకటించాయి.
అలెగ్జాండర్ 48,000 కాల్బలం
6 ,000 గుర్రపు
రౌతులను తీసుకొని క్రిస్తు పూర్వం 334 సంవత్సరంలో
పెర్షియన్ సామ్రాజ్యం లోని టర్కీ లో ప్రవేశించాడు.
ఈ సందర్భం లో ఎవరు విప్పలేని
ముడిని అలెగ్జాండర్ ఖండించాడు అని విని ఉంటారు.
అది Phrygian రాజ్య
రాజధాని ఐన Gordium అనే
నగరం లో జరిగింది. ఆ
ముడిని విప్పే వాడు ప్రపంచ విజేత
అవుతాడు అని అక్కడి వారు
అనుకునేవారు.
అలెగ్జాండర్ ఆ ముడి ఉన్న
గుడి వద్దకు వచ్చాడు. ఆ ముడిని ఎలా
విప్పుతాడో అని చూస్తున్న తన
అనుచరులు, ఆ గుడి పూజారులు
నిర్ఘాంతపోయేలా అయన తన కత్తి
ఎత్తి ఆ ముడిని రెండుగా
ఖండించాడు. తరువాత ఆ ముడిని విప్పమన్నారు
కానీ ఏ విధంగా విప్పాలో
చెప్పలేదు కదా అందుకే తాను
చేసింది సరి అయినదే
అని చెప్పుకున్నాడు అయన.
అప్పటి పెర్షియన్ సామ్రాజ్యంలో ఇప్పుడు ఉన్న దేశాలలో 20
పైన ఉన్నాయి. వాటి మొత్తం జనాభా
కలిపి ఇప్పుడు దాదాపు 70 కోట్లు.
అవి
1. ఇరాన్, 2.
ఇరాక్, 3. అర్మీనియా, 4. ఆఫ్ఘనిస్తాన్ 5.
టర్కీ, 6. బల్గేరియా, 7. ఈజిప్ట్
, 8. సిరియా, 9. పాకిస్తాన్, 10. జోర్డాన్ , 11. ఇస్రేల్, 12. లెబనాన్, 13. లిబియా, 14. అజర్బైజాన్, 15. పాలస్తీనా, 16. UAE ,17. సౌదీ
అరేబియా, 18. జార్జియా, 19. తుర్కమేనిస్తాన్, 20. ఉజ్బేకిస్తాన్,
21. తద్ఝికిస్తాన్, 22. కువైట్, 23. ఒమాన్,24. సైప్రస్
25. టర్కీ
సైన్యంతో పెర్షియన్ సామ్రాజ్యంలో ప్రవేశించిన అలెగ్జాండర్ ముందుగా Granicus నది దగ్గర
పెర్షియన్ సామంతులను ఓడించాడు. తరువాత పెర్షియన్ సామ్రాజ్యంలోనికి చొచ్చుకుపోయాడు. తిరిగి Issus అనే చోట Darius
III స్వయంగా సైన్యంతో
వచ్చి అలెగ్జాండర్ సైన్యాన్ని అడ్డగించాడు. అక్కడ ఐన యుద్ధంలో
అలెగ్జాండర్ Darius III ని ఓడించగా అయన
యుద్ధం నుండి పారిపోయాడు. ఆ
యుద్ధంలో Darius III రాణి, అయన తల్లి,
ఇద్దరు కూతుర్లు అలెగ్జాండర్ కి బందీలుగా చిక్కారు.
వాళ్లతో అలెగ్జాండర్
మర్యాదగా వ్యవహరించాడు.
ఆ తరువాత అలెగ్జాండర్
పెర్షియన్ సామ్రాజ్యంలోనికి ఇంకా లోతుగా తన
సేనను నడిపాడు. తిరిగి Gaugamela అనే
చోట Darius III స్వయంగా సైన్యంతో తరలి వచ్చి అలెగ్జాండర్
ని క్రిస్తు పూర్వం 331 లో
ఎదుర్కొన్నాడు. పురాతన చరిత్రకారుల ఆధారాల ప్రకారం పెర్షియన్ సైన్యం లో కనీసం 250 ,000
మంది సైనికులు
ఉన్నారు కానీ నూతన చరిత్రకారులు
అది కేవలం 100 ,000 మంది
మాత్రమే అని చెప్తున్నారు. ఏది
నిజం ఐనా అలెగ్జాండర్ వద్ద
అప్పుడు ఉన్నది కేవలం 50 ,000 మంది
సైనికులు మాత్రమే. అంటే పెర్షియన్ సైన్యం
అలెగ్జాండర్ సైన్యం కంటే కనీసం రెట్టింపు
ఉంది.
అలెగ్జాండర్ ముఖ్య సేనాధిపతి ఐన
Parsimonius ఆ పెర్షియన్ సైన్యంతో యుద్ధాన్ని వ్యతిరేకించాడు. ఆ యుద్ధాన్ని గెలవడం
అసాధ్యం అని అలెగ్జాండర్ తో
చెప్పాడు అయన. కానీ అలెగ్జాండర్
పట్టు విడవకపోవడం వలన చివరికి రాత్రి వేళ పెర్షియన్ సైన్యాన్ని
ముట్టడిస్తే బాగుంటుంది సలహా ఇచ్చాడు. దానికి
అలెగ్జాండర్ ఒప్పుకోలేదు. తనకు మోసం చేసి యుద్ధాన్ని
గెలిచే ఉద్దేశం లేదు అని Parsimonius
కు చెప్పాడు. అలెగ్జాండర్
గొప్ప యుద్ధ తంత్రం తో
పగటి సమయంలోనే పెర్షియన్ సైన్యాన్ని ముట్టడించాడు. అతని యుద్ధ తంత్రం
వల్ల పెర్షియన్ సైన్యాలు ఓడిపోయి పారిపోయాయి. యుద్ధంలో కేవలం 1000 మంది
గ్రీకు సైనికులు మరణించగా పెర్షియన్ సైనికులు 40 ,000 మంది
మరణించారు. అది అలెగ్జాండర్ కి
ఒక గొప్ప విజయం.
అలెగ్జాండర్ విశిష్టత ఏమిటంటే అయన తన అశ్వదళం
ముందు బాగాన ఉండి సైన్యాన్ని
నడిపించేవాడు. సైన్త్యంలో ముందు యుద్ధం లోకి
దూకేవాడు అలెగ్జాండర్ నే. ఆయన పర్షియా మీద
దండయాత్రకు బయలుదేరినప్పుడు ఆయనకు కేవలం 22 సంవత్సరాలు. ఆయన చేసిన అనేక
యుద్ధాలలో చనిపోయేవరకు అపజయం అనేది ఎరుగడు
అయన.
అలెగ్జాండర్ గురించి న వ్యాసం ఇంకా పూర్తి
కాలేదు. ఇప్పటికే వ్యాసం పెద్దదిగా అయిపొయింది. తరువాతి భాగం మళ్ళీ ఇంకోసారి
రాస్తాను.
No comments:
Post a Comment