Tuesday, 5 March 2024

ఉత్తర మీమాంస లేక వేదాంత.

 

నేను జన్మతః  హిందువు నే అయినా దేముడు అంటే చిన్నప్పటినుండి నమ్మను. కానీ దాదాపు 36  సంవత్సరాల వయసులో(అంటే 1987  లో) నాకు హిందూ తత్వ చింతన చదివి అర్ధం చేసుకోవాలి అని ఒక కోరిక పుట్టింది. కానీ దానికి పుస్తకం చదవాలో అర్ధం కాలేదు. అందుచేత దానికి MA  ఫిలాసఫీ టెక్స్ట్ పుస్తకం  ఎంచుకున్నాను. పుస్తకం పేరు " A  క్రిటికల్ సర్వే అఫ్ ఇండియన్ ఫిలాసఫీ". రాసినవారు Dr  Chandradhar  Sharma . అయన జబల్పూర్ యూనివర్సిటీ లో ఫిలాసఫీ ప్రొఫెసర్.  అప్పుడు నేను మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఉండేవాడిని.

అంతవరకూ  బాగానే ఉంది కానీ మరి ఫిలాసఫీ గహనం అయ్యింది కదా, పుస్తకం చదివినట్టు చదివితే అర్ధం అవుతుందా? కానీ ఎంతో ఇంటరెస్ట్ గా ఉండటం  వలన పుస్తకాన్ని తెరిచి కొన్ని రోజులలో (ఎన్ని రోజులో ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు) దాన్ని చదివేసాను. కానీ ప్రాబ్లెమ్ ఏమిటంటే అందులో దాదాపు 90 % నా నెత్తి మీదనుండి వెళ్లిపోయింది. నాకు అర్ధం అయ్యింది 10 % నే. ఇలా లాభం లేదు అని దాన్ని 2nd  రీడింగ్ చేశాను. సారి జాగ్రత్తగా కస్టపడి చదివాను, అది పూర్తి చేసేసరికి ఇంకొక 20% అర్ధం అయ్యింది. పట్టు వదలని విక్రమార్కుడిలా దాన్ని 3rd  రీడింగ్ చేశాను. సారి అయితే ఒక నోట్ బుక్ దగ్గర పెట్టుకుని అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడమే కాకుండా, దాని మీద నా కామెంట్స్ కూడ రాసాను. ఆలా చేయటం వలన సారి నాకు కొంచెం బాగానే అర్ధం అయ్యింది. బహుశా పుస్తకం లో ఒక 70 % అనుకోండి.

ఉపాధ్ఘాతం అంతా ఎందుకు  చెప్పాను అంటే నేను ఇప్పుడు ఉత్తర  మీమాంస  అనే  వేదాంతా  మీద ప్రజలకు అర్ధం అయ్యేలా ఒక చిన్న నోట్ రాసాను. అది కింద ఇస్తున్నాను. అది చాల బ్రీఫ్. ఇందులో ఫిలాసఫీ ని అతి కొంచెంగా మాత్రమే టచ్ చేశాను. ఎందుకంటే చదివేవారికి అది సులభంగా అర్ధం అవ్వాలి అనే ఉద్దేశంతో. మనలో చాలా మందికి గుడికి వెళ్లి నమస్కారం పెట్టడం తప్ప మన  ఫిలాసఫీ గురించి తెలిసింది చాలా తక్కువనే. వారికి తెలియడం కోసమే ఇది రాసాను.     

అయితే ఆలా హిందూ ఫిలాసఫీ చదివినా సరే నేను ఇప్పటికి కూడా నాస్తికుడినే. సర్వ ప్రపంచం భగవంతుడు అని నమ్ముతాను కానీ ఆయన కానిది ఏది లేదు అని కూడా నమ్ముతాను. అందుచేత నా ఉద్దేశంలో పాపం పుణ్యం అనేవి లేవు. అవి కేవలం మన సంఘం  యొక్క సూత్రాలను  బట్టి ఏర్పడతాయి. అలాగే నేను ఆత్మను కూడా నమ్మను. Ultimate  Reality  గురించి ఎవరి చింతన వారిదే. మీలో చింతన ఉంటె అదే మీకు సరి ఐనది. పైన చెప్పినవి నా భావాలు మాత్రమే.            

 

ఉత్తర మీమాంస లేక వేదాంత.

మన షడ్దర్శనాలలో ఆఖరిది ఉత్తర మీమాంస అనబడే వేదాంత దర్శనం 

 దర్శనానికి మూల గ్రంధం క్రిస్తు పూర్వం 5  శతాబ్దంలో రాయబడిన బాదరాయణుడి " బ్రహ్మసూత్రాలు". బాదరాయణుడు వేద వ్యాసుడు అనే పేరుతొ కూడా పిలువబడతాడు. 

 బ్రహ్మసూత్రాల మీద శంకరాచార్యులురామానుజాచార్యులు మరియు మధ్వాచార్యులు రాసిన భాష్యాలు ప్రామాణికమైనవి అని నమ్ముతారువేదాంతంలో వచ్చిన  3  ముఖ్య సంప్రదాయములు బ్రహ్మసూత్రాలకు  ముగ్గురు రాసిన భాష్యాల వలన వచ్చినవేఅవి 1 . అద్వైత, 2 . విశిష్టాద్వైత మరియు 3 . ద్వైత. 

 ముగ్గురిలో అతి ప్రాచీనం అయినవాడు శంకరాచార్యులుఈయన దాదాపు క్రిస్తు శకం 790  సంవత్సరంలో పుట్టి 32  సంవత్సరాలు జీవించాడు  ఆయన తరువాత రామానుజాచార్యులు దాదాపు క్రిస్తు శకం 1020  సంవత్సరంలో పుట్టి 102  సంవత్సరాలు జీవించాడుఅయన తరువాత మధ్వాచార్యులు క్రిస్తు శకం 1120  లో పుట్టాడు.     

 మూడు సంప్రదాయాలలోను అద్వైతం ముఖ్యం ఐనదివిశిష్టాద్వైతంద్వైతం కేవలం భక్తి మార్గంలోనే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడం సాధ్యం అని నమ్ముతాయికాగా అద్వైతంజ్ఞానం ద్వారా మాత్రమే బ్రహ్మస్వరూపాన్ని చేరుకోగలము అని భావిస్తుంది. 

వైష్ణవానికి 5  ముఖ్య సంప్రదాయాలు ఉన్నాయి 

1.      మధ్వాచార్యుని  ద్వైతం

2.      శంకరాచార్యుని అద్వైతం

3.      రామానుజాచార్యుని విశిస్టాద్వైతం

4.      వల్లభాచార్యుని శుద్ధాద్వైతం

5.      నింబార్కుని ద్వైతాద్వైతం

 

 

తాను జీవించిన కేవలం 32  సంవత్సరాల లోనే శంకరాచార్యులు భారతదేశ నాలుగు మూలల పర్యటించిహిందూ ధర్మాన్నిఅద్వైతాన్ని బోధిస్తూ అనేక పూర్వ మిమాంసికులతోబౌద్ధులతోజైనులతో వాదనలు చేస్తూ దేశం 4 మూలలలోను  మఠాలు స్థాపించాడు. 

ఆయన  పర్యటన సమయంలో భారతదేశంలో ఒక పెద్ద సామ్రాజ్యంలేదుదేశం అంతా చిన్న రాజ్యాలుగా ముక్కలుగా విడివడి ఉందిఅందుచేత దేశంలో మార్గాలు అన్ని దొంగలతోదోపిడీదారులతో నిండి ఉండేవిఇక అరణ్య మార్గాలు అయితే చెప్పనక్కరలేదుఅయినా సరే శంకరాచార్యులు దేశాన్ని పర్యటించినపుడు  విషయాన్ని  మాత్రం లెక్కచేయలేదు. 

 సంప్రదాయం యొక్క మొదటి గ్రంధం క్రిస్తు శకం 5   శతాబ్దం లో గౌడపాదుడు రాసిన "మాండూక్య కరిక".దీనినే "ఆగమ శాస్త్రఅని కూడా అంటారు గ్రంధం మాండూక్యబ్రిహదారణ్యక మరియు చాందోగ్య ఉపనిషత్తుల నుండి భావాలను గ్రహిస్తుందిశంకరాచార్యులు  కరిక మీద భాష్యం రాసాడు. 

శంకరాచార్యుని ప్రకారం అంతిమ సత్యంఆత్మ మరియు బ్రహ్మ స్వరూపంఅవి రెండు ఒకటే కానీ వేరు కాదు. 

బ్రహ్మ స్వరూపం గుణాలువర్గాలు లేని ఒక స్వచ్ఛమైన స్పృహబ్రహ్మ స్వరూపం దాని యొక్క సామర్ధ్యం అయిన మాయ తో సృష్టించేరక్షించే మరియు వినాశనం చేసే భగవంతుడిగా అగుపిస్తాడుసర్వ ప్రపంచం  బ్రహ్మస్వరూపం యొక్క రూపం మాత్రమే. 

శంకరాచార్యుల ప్రకారం దృగ్గోచరం అయ్యే ప్రపంచం నిజమైనదే కానీ మాయ కాదుఅది ఈశ్వరుని యొక్క సృష్టిజీవుడు బ్రహ్మస్వరూపం అనే నిజాన్నిమరచిపోయి కనబడే ప్రపంచం మాత్రమే నిజం అని నమ్మి అందులో తాను చేసేవాడిగాను అనుభవించేవాడిగాను భావిస్తుంది. 

జీవుడు జ్ఞానం ద్వారాకర్మతో నిమిత్తం లేకుండా తాను బ్రహ్మస్వరూపమే కానీ వేరు కాదు అని ఎప్పుడు గ్రహిస్తుందో అప్పటికి అప్పుడే మోక్షం సిద్ధిస్తుందిదాని తరువాత  జీవి మరణించాక చివరికి అది బ్రహ్మస్వరూపం లో ఐక్యం అవుతుంది. 

ఈశ్వరుడు సర్వ సృష్టి కి మూలం కానీ వివిధ ప్రాణులు తమ కర్మల వలన వివిధ ఫలాలను సంక్రమించుకుంటాయిసృష్టి కి ఎలా ఆది లేదో అలాగే కర్మలకు కూడా ఆది లేదు. 

అందువలన సృష్టి అనేది అసలైన నిజం కాదుఅది కేవలం మాయ వలన ఆత్మ కు కలిగే భ్రమ మాత్రమే మాయ నుండి ఆత్మ జ్ఞానం వలన తన స్థానం తాను తెలుసుకోగలుగుతుందో అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది

 

 

No comments:

Post a Comment