Friday, 16 October 2020

మానవ జాతి ఆవిర్భావం.

 

మానవ జాతి ఈనాడు  ప్రపంచంలో ఉన్న జంతు జాతులను అన్నిటినీ శాసిస్తుంది కానీ ఒకనాడు అది అనేక జాతులలో ఒకటి మాత్రమే. మరి మానవ జాతి ఆలా ముందుకు పోయి మిగిలిన జాతులను ఎలా వెనక వదిలేయగలిగింది? దానికి కారణం మనిషి కి ఉన్న మేధాశక్తి, కానీ జంతువులూ మానవులు ఒకే విధంగా పుట్టినవారు అయితే మరి మేధాశక్తి కేవలం మనిషికే ఎందుకు ఉండాలి? దానికి మన దగ్గర జవాబు లేదు. భగవంతుడు తన ప్రతిరూపంలో మనిషిని సృష్టించాడు అని నమ్మేవారికి అయితే భగవంతుడే మనిషికి విశిష్ట లక్షణాలు ఇచ్చాడు అనుకోవడానికి ఊతం దొరుకుతుంది.  మరి మిగిలినవారికి? అసలు మానవుడి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి?  

మనలో అందరికి జీవులు వర్గీకరణ గురించి తెలుసును, కానీ కొంతమందికి తెలియకపోవడానికి chance  ఉంది కాబట్టి వారికోసం క్లుప్తంగా రాస్తున్నాను. జీవరాశిలో ఇంత వైవిధ్యం ఉంది. వాటిని అన్నిటిని కొన్ని సాధారణ లక్షణాల ప్రకారం విభజించవచ్చును అని స్వీడిష్ శాస్త్రవేత్త ఆయన Corolous Von  Linnaeus కు ఒక భావం కలిగింది. అయన అప్పటి జంతు జాతులను అన్నిటిని వర్గీకరించాడు. ముందుగా జీవజాతిని జంతు ప్రపంచంగా, వృక్ష ప్రపంచంగా విభజించాడు. వాటిని ముందుగా phylum ,  class , order , family , tribe, genus  మరియు species  విభజించాడు.

ఒక phylum  లో ఉన్న జాతులలో ఎక్కువ వైవిధ్యం ఉంటె మళ్ళీ దాన్ని sub  phylum , ఇంకా ఎక్కువ ఉంటె infra  phylum ఆలా విభజించుకుంటూ పోయాడు. చివరికి ఒక జీవిని దాని Genus  మరియు Species నామంతో పిలిచాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చింది అంటే భూమి మీద మొదటిగా అనేక రసాయన సంయోగాల వలన  ఒక ఏక కణ జీవి జన్మించింది, తరువాత  క్రమంగా కొన్ని కణాలు కలసి సరళమైన జీవులుగా ఏర్పడ్డాయి. జీవులనుండి ఇంకా సంక్లిష్ట జీవులు ఏర్పడుతూ పోయాయి. అంటే భూమి మీద ఉన్న సర్వ జీవరాసులు మొదటి జన్మించిన కణం నుండి రూపొందినవే. తరువాత వృక్ష మరియు జంతు రాజ్యాలనుండి వచ్చినవే. అంటే వీటి అన్నిటికి మూలం ఒకటే. అప్పటినుండి కాలం  గడిచే కొద్దీ లక్షణాలు వేరు కావటం వలన  నేను పైన చెప్పిన Phylum, క్లాస్, ఆర్డర్, ఫామిలీ, tribe, జీనస్ మరియు చివరికి స్పీసీస్ ఏర్పడ్డాయి.     వర్గీకరణ లో ముందు వచ్చే భాగాలు అన్ని ముందు కాలం లో ఏర్పడినవి. అంటే Species  కంటే ముందు Genus , దానికంటే ముందు Family , దానికంటే ముందు Order  విధంగా ఏర్పడ్డాయి.  

వర్గీకరణ ప్రకారం మనిషి పేరు Homo  Sapiens. మన జీనస్ Homo, మన స్పీసీస్ Sapiens . మన జీనస్ Homo  25  లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండం లో Australopithecus  అనే జీవితో ప్రారంభం అయ్యింది. అప్పటికి అది చింపాంజీ తో కలసి ఉన్న Tribe  ఆయన Hominini  నుండి వేరు పడింది.

దాని నుండి తరువాత 20  లక్షల సంవత్సరాల క్రితం Homo  Erectus  రూపొందింది. అది మన జీనస్ కు చెందినది అయినా వాటి స్పీసీస్ వేరు. దానికి మనలాంటి నడక, మరియు శరీర ప్రమాణం ఉండేవి. అది హోమో జీనస్ లో చప్టా అయిన మొహం మరియు ముందుకు వచ్చిన ముక్కు కలిగిన మొదటి జాతి. మొదట రెండు కాళ్ళ మీద నడిచిన జంతువు కూడా  అదే.      

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చూడటానికి దాదాపు ఒకే విధంగా ఉన్నా స్పీసీస్ వేరు వేరు అని ఎలా చెప్పగలము. దానికి ఒక కొలమానం రెండు అడ మగ జంతువులు సంయోగం చెందినపుడు వాటికి సంతానం కలిగితే అవి రెండు ఒకే Species  కి చెందినవి. ఉదారణకు ఇండియన్ ఏనుగులు, ఆఫ్రికన్ ఏనుగులు భిన్న జాతులకు చెందినవి. రెండూ ఏనుగులే, కానీ అవి రెండు సంయోగం చెందితే వాటికి సంతానం కలగదు.    

Homo  Erectus   నుండి అనేక జాతులు ఆవిర్భవించాయి. అవి అన్ని నశించిపోయి చివరికి మన స్పీసీస్ యొక్క తాతగారు, మరియు Neanderthal  మనిషి మిగిలారు. మన స్పీసీస్ అయిన Homo  Sapiens  కేవలం 3 లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. అప్పటికి Neanderthal  మానవుడు ఇంకా జీవించి ఉన్నాడు. చివరికి 1 ,10 ,000  సంవత్సరాల క్రితం  నియాండర్తల్ మానవుడు కూడా నశించి కేవలం మన జాతి మాత్రమే మిగిలింది. ఇప్పుడు హోమో అనబడే జీనస్ లో మన ఒక్కరి జాతి మాత్రమే మిగిలి ఉంది.

Phylum  Chordata  తో 54  కోట్ల సంవత్సరాల క్రితం మొదలైన మానవ వికాసం చివరికి మనతో పరిపూర్ణం అయ్యింది. జీవ రాసి ఆవిర్భావ సమయంతో పోలిస్తే మనిషి కేవలం నిన్ననే జన్మించాడు. అలాంటిది కేవలంలక్షల సంవత్సరాల లో సర్వ జీవరాసు లను ఏలుతూ నశింపచేస్తున్నాడు. కాలంలో మనిషి విజ్ఞానం సమయంతో అపారంగా పెరిగిపోతున్నది. చివరికి దాని పర్వయసానం ఏమిటో మనకు తెలియదు. మనిషి తనను ఆవరించి వున్న ప్రకృతిని స్వాధీనలోనికి తెచ్చుకుని ఆనందంగా సుఖ శాంతులతో జీవిస్తాడా లేక అధిక విజ్ఞానంతో నశించిపోతాడా?

No comments:

Post a Comment