Sunday, 1 November 2020

రామానుజాచార్యులు.

 వేదాంత దర్శనంలో ముఖ్యంగా మూడు విభిన్న తత్వాలు  ఉన్నాయి. అవి 1 . అద్వైత, 2 . ద్వైత, 3 . విశిష్టాద్వైత. అద్వైత వేదాంతాన్ని విశిష్ట స్థితికి చేర్చినవాడు శంకరాచార్యులు. అలాగే ద్వైత వేదాంతాన్ని విశిష్ట స్థితికి చేర్చినవాడు మద్వాచార్యుడు. మూడవది ఐన విశిష్టాద్వైతాన్ని విశిష్ట స్థితికి చేర్చినది రామానుజాచార్యులు.  

రామానుజాచార్యులు కాంతిమతి, అసురి కేశవ సోమయాజి దంపతులకు 1077  సంవత్సరంలో శ్రీపెరంబుదూరు లో జన్మించాడు. రామానుజాచార్యులు అసలు పేరు ఇళయ పెరుమాళ్. తరువాత కాలంలో అయన తన పేరును రామానుజుడు గా మార్చుకున్నాడు. ఆయన మీద, అయన మరణించిన వందల సంవత్సరాల తరువాత రాయబడిన  హాజియోగ్రఫీ (అంటే అతి భక్తిభావంతో రాసిన జీవిత చరిత్రలు) లో అయన 1017 - 1137  మధ్యలో అంటే 120  సంవత్సరాలు జీవించాడు అని రాసారు. కానీ ఆధునిక పండితుల పరిశోధన ప్రకారం అయన 1077 -1157 సంవత్సరాల మధ్యలో అంటే 80  సంవత్సరాలు జీవించాడు.   

రామానుజుడు వివాహం చేసుకుని తన మకాం కాంచీపురానికి మార్చుకున్నాడు. అయన యాదవ ప్రకాశుడు అనబడే అద్వైత  వేదాంతి దగ్గర విద్య నేర్చుకోవడానికి చేరాడు. రామానుజుడు, అయన గురువు వేదం మీద వ్యాఖ్యానం లో, ముఖ్యంగా ఉపనిషత్తుల వ్యాఖ్యానం మీద  ఎప్పుడూ భేదించేవారు. తరువాత వారు విడిపోయారు. తదుపరి రామానుజుడు తన చదువు సొంతంగానే చదువుకున్నాడు.

తరువాత రామానుజుడు కాంచీపురం లో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో పూజారి అయ్యాడు. అక్కడ అయన మోక్షం పొందటానికి అద్వైతులు చెప్పే నిర్గుణ బ్రహ్మ ద్వారా సాధ్యం కాదని, అది సకారుడు ఐన విష్ణువు వల్లనే సాధ్యం అని బోధించాడు. అయన వివాహం చేసుకున్నప్పటికీ 30  సంవత్సరాల వయసులో వివాహ జీవితాన్ని త్యజించాడు.

రామానుజాచార్యులకు ముందుగానే యమునాచార్యుల ఆధ్వర్యంలో వైష్ణవ సంప్రదాయం స్థాపించబడి ఉంది. భక్తి పాటలు, భక్తితో కొలిచే పధ్ధతి తమిళ సంస్కృతిలో 12 మంది  ఆళ్వారుల వలన అలవాటు అయ్యాయి. రామానుజాచార్యులు ప్రఖ్యాతి గడించడానికి కారణం అప్పటికి ధృడంగా ఉన్న అద్వైత సంప్రదాయాన్ని ఆయన సవాలు చేయడం, వేదాలకు మరొక విధంగా భాష్యం చెప్పడం.

యమునాచార్యులు శ్రీరంగం లోని వైష్ణవ దేవాలయానికి ముఖ్య అధిపతి. ఆయన రామానుజాచార్యుడిని పిన్న వయసునుండి గమనిస్తున్నాడు. యమునాచార్యునకు తన పదవి ఇంకొక తగిన ఆచార్యులకు దత్తం చేసే సమయం వచ్చింది. దానికి రామానుజాచార్యుడు తగినవాడు అని తలచి అయన తన శిష్యుడైన మహాపూర్ణుడి  ద్వారా కంచి లోని రామానుజాచార్యులకు కబురు పంపాడు. కానీ ఆయన శిష్యుడు, రామానుజాచార్యులు కలసి శ్రీరంగం చేరేలోగా యమునాచార్యుడు మరణించాడు.

రామానుజుడు గుండె పగిలి కంచికి తిరిగివెళ్ళి యమునాచార్యుని లోకం నుండి తీసుకుని వెళ్లినందుకు రంగనాథుని పూజించడం మానేసాడు. యమునాచార్యుడి పుత్రుడు శ్రీరంగ ఆలయ ముఖ్య అధిపతి పదవిని చేపట్టాడు. కానీ కొంత కాలం తరువాత అయన, మరియు అక్కడి వైష్ణవ పెద్దలు యమునాచార్యుని మరణం తరువాత అయన వలె వేదాలను, శాస్త్రాలను భాషించగల వ్యక్తి కావాలి అని అనుకున్నారు. అప్పుడు వారు తిరిగి మహాపూర్ణుని రామానుజాచార్యుని శ్రీరంగానికి తోడ్కొనిరావడానికి పంపారు.

అదే సమయంలో రామానుజుడు కంచిలో కంచిపూర్ణుని కలసి అతని దగ్గర శిష్యరికం చేద్దాము అనుకున్నాడు, కానీ కంచిపూర్ణుడు వారి ఇరువురి కులాలు వేరు అని చెప్పి, రామానుజాచార్యులకు ఇంకా మంచి గురువు దొరుకుతాడు అని చెప్పి నిరాకరించాడు.

రామానుజాచార్యులు పూర్వం కూడా వైష్ణవ సంప్రదాయంలో నిమ్న కులాల వారిని తీసుకునే పధ్ధతి ఉంది. మహాపూర్ణుడు, కంచిపూర్ణుడు, ఇద్దరు కూడా నిమ్న కులాల వారే. రామానుజాచార్యులు హరిజనులను కూడా వైష్ణవ సంప్రదాయలోనికి అనుమతించాడు. అయన నివసించింది 12  శతాబ్దం కాబట్టి అప్పటికి అది ఒక పెద్ద విప్లవాత్మక చర్యగా మనం భావించాలి. చర్య ప్రకారమే రామానుజాచార్యులు శ్రీరంగం లో పూజలు పద్ధతులు నిమ్న జాతులవారిచేత కూడా చేయించాడు.

రామానుజాచార్యుని మరణం తరువాత వైష్ణవులు Vadakalai  (ఉత్తర మరియు సంస్కృత), Thenkalai  (దక్షిణ మరియు తమిళ్పద్ధతులుగా విడిపోయారు. Vdakalai  వారు సంస్కృత పద్ధతులను అనుసరించగా Thenkalai  వారు తమిళ పద్ధతులు అనుసరించారు. Vadakalai  పధ్ధతి కాంచీపురం దాని పరిసరాలలో అనుసరించబడగా, Thenkalai పధ్ధతి శ్రీరంగం పరిసరాల లో అనుసరించబడింది. రెండు పద్ధతులు కూడా వైష్ణవులలోనికి ప్రవేశం పంచ సంస్కార పద్ధతుల ద్వారా మాత్రమే సాధ్యం అని నమ్ముతారు.

రామానుజాచార్యుని చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అందులో రెండు ఒకప్పుడు స్వయంగా  ఆయన గురువు ఆయన Yadava  ప్రకాశుడే చేయించాడు. ఇంకొక రెండు ప్రయత్నాలు అప్పటి శ్రీరంగం ముఖ్య పూజారి స్వయంగా చేసాడు. ఒకసారి విష ఆహారం ద్వారా, మరొకసారి విష తీర్థం ద్వారా రామానుజాచార్యుడిని మట్టుపెట్టాలి అని చూసాడు.. అయినా నాలుగు  యత్నాలు భగ్నం అయ్యి రామానుజాచార్యులు దీర్ఘ కాలం జీవించాడు.

రామానుజాచార్యులు శ్రీరంగం లో ఉండి కొంత కాలం తరువాత భారతదేశం అంతా 20  సంవత్సరాల దీర్ఘ పర్యటన చేసాడు. ఆయన తిరిగి వచ్చిన తరువాత శివ భక్తుడు ఆయన చోళ రాజు ఆయనను హింసలు పెట్టాడు. అప్పుడు రామానుజాచార్యులు శ్రీరంగం నుండి వెళ్లి మైసూర్ లో తల దాచుకున్నాడు. అక్కడ ఆయన హొయసల రాజైన బిట్టిదేవుని వైష్ణవునిగా మార్చాడుతరువాత అనేకమందిని వైష్ణవ సంప్రదాయం లోనికి మార్చాడు. చివరికి ఆయన 1157  సంవత్సరం లో మరణించాడు.

వైష్ణవ సంప్రదాయం రామానుజాచార్యులుగ్రంధాలూ రాసాడు అని ఉటంకిస్తుంది. కానీ అందులోముఖ్యం అయినవి. అవి 1 . శ్రీ భాష్యం (బ్రహ్మసూత్రాల మీద భాష్యం) 2 . వేదార్ధసంగ్రహ (వేదాల సారం), 3 . భగవద్గిత భాష్యం

No comments:

Post a Comment