Friday, 20 November 2020

పద్మనాయక మరియు రెడ్ల యొక్క వైరం --అనపోతా రెడ్డి వరకు

 నేను ఇదివరకు కూడా క్లుప్తంగా రాచకొండ రెడ్డి రాజ్యాల మధ్యన వైరం గురించి రాసాను. ఇప్పుడు దానినే   ఇంకా కొంచెం వివరంగా రాసాను. ఇందులో చాలా భాగం రెడ్ల చరిత్రల నుండి తీసుకున్నదే.

నేను కింద రాసినది కేవలం అనపోతారెడ్డి రాజ్యపాలనలో జరిగింది మాత్రమే. ఈ వైరం మిగిలిన రాజుల సమయంలో కూడా కొనసాగింది. వాటిని గురించి చదివి తరువాతి సమయంలో రాస్తాను. 

పద్మనాయకులకు రెడ్లకు మధ్య విరోధం 1361  సంవత్సరం లో  జరిగిన జల్లిపల్లి యద్ధం నుండి మొదలు అయ్యింది. ఈ సమయానికి ఆంధ్ర దేశం మొత్తం రాయలసీమ జిల్లాలు మినహా ఆంధ్రదేశాధీశ్వర బిరుదం వహించిన ముసునూరి కాపానాయకుని కింద పాలింపబడుతుంది.

ఆయన పెదనాన్న పుత్రుడు అయిన ప్రోలయనాయకుడికి, ముస్లిం సైన్యాలను ఆంధ్ర దేశం నుండి బయటకు తరమటానికి సహాయపడిన ముఖ్య నాయకులలో సింగమనాయకుడు కూడా ఒకడు. ఈయన మిగతా ముఖ్య నాయకులలాగే నామమాత్రంగా కాపానాయకుని కింద ఉన్నా తన రాచకొండ రాజ్యాన్ని స్వతంత్రంగానే పాలించాడు.

కాపానాయకుడు బహమనీ రాజ్యంతో వైరమువలన బలహీనపడ్డాడు. ప్రోలయనాయకుని సమయంలోనే రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టిన సింగమనాయకుడు ఇంకా అధికంగా తన రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు. ఆయన తన విస్తరణకు తూర్పు ఆంధ్ర దేశం వేపు కూడా చూసాడు. దానికి అక్కడ  ఉన్న క్షత్రియ రాజులు కలతచెంది సింగమనాయకుని రాజ్య విస్తరణ ను ఆపడానికి సమాలోచన చేసారు.

అప్పటికే సింగమనాయకుని పేరు ఒక గొప్ప వీరునిగా అందరికీ తెలుసు. ఆయనతో యుద్ధంలో తలపడి గెలవడం చాలా కష్టం. అందుచేత వారు కుతంత్రం చేసి మొదటిగా రేచెర్ల సింగమనాయకుని బావమరిది అయిన చింతపట్ల సింగమ ను బంధించి జల్లిపల్లి దుర్గంలో ఉంచారు. ఈ దుర్గం పరిపాలిస్తున్న పూసపాటి వారైన సోమవంశ క్షత్రియులు బహుశా చాళుక్యుడు అయిన అరవీటి సోమదేవరాజు బంధువులు కావొచ్చును. అది చూసి చింతపట్ల సింగమ అన్న అయిన వెల్లటూరు రాజు గన్నభూపాలుడు వచ్చి జల్లిపల్లి దుర్గాన్ని ముట్టడించి రేచెర్ల సింగమనాయకునికి జరిగిన విషయాన్ని వర్తమానం పంపించాడు.

జరిగిన విషయం విని ఆగ్రహోదగ్రుడయ్యి సింగమనాయకుడు తాను కూడా వచ్చి జల్లిపల్లి దుర్గాన్ని ముట్టడించాడు. వెంటనే సోమవంశ క్షత్రియులు చింతపట్ల సింగమ గురించి మంతనం చేయటానికి రేచెర్ల సింగమనాయకుని దుర్గంలోనికి ఆహ్వానించారు. మంతనాలు జరుగుతుండగా వారి సామంతుడు, ఒక దుర్గానికి అధిపతి అయిన తంబళ్ళ బొమ్మజియ్యరు చేత రేచెర్ల సింగమనాయకుడు ఏమరుపాటు లో ఉన్న సమయం చూసి  బాకుతో పొడిపించి చంపించారు. ఈ కుతంత్రంలో వారికి  వారికి రెడ్లు సాయపడ్డారు.      

కాపానాయకుడు కూడా రేచెర్ల సింగమనాయకుని రాజ్య విస్తరణ ను నిరసించాడు ఎందుకంటే అది తన రాజధాని ఓరుగంటికి దగ్గర గానే  ఉన్న రాజ్యం కదా మరి. అందుచేత ఈ కుట్రలో ఆయన హస్తం కూడా ఉండి ఉండవచ్చు.      

ఈ విషయం తెలియగానే రాజ్య విస్తరణ లో భాగంగా విడి విడి ప్రదేశాలలో  యుద్ధాలు చేస్తున్న సింగమనాయకుని తనయులు అయిన అనపోతానాయకుడు, మాదానాయకుడు  క్రోధంతో ఊగిపోయారు. వారు వెంటనే వచ్చి జల్లిపల్లి దుర్గాన్ని ముట్టడించి సోమవంశ క్షత్రియులను యుద్ధంలో ఓడించి దుర్గంలో దొరికిన  క్షత్రియులను అందరిని వారి కుటుంబ సహితంగా సంహరించారు.

జల్లిపల్లి యుద్ధం తరువాత అనపోతా, మాదానాయకులు రణం కుడిపారు. రణం కుడపడం అనేది యుద్ధ అనంతరం జరిపే పద్మనాయక పధ్ధతి. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే ఆచారం అది. దానిలో అర్ధరాత్రి సమయంలో సంహరించిన శత్రువుల పుర్రెల లో అన్నం వారి రక్తంతో కలిపి, నగ్నంగా శరీరానికి విభూది మట్టి రాసుకుని దానిని డాకినీ శాకినీ పిశాచాలకు తర్పణం ఇయ్యటం.     

తదుపరి వారు దుర్గం లోనుండి తప్పించుకున్న క్షత్రియులను వెంబడించి పోయారు. దానిలో భాగంగా వారు కృష్ణా నది ని దాటి దానికి దక్షిణాన ఉన్న కర్నూలు గుంటూరు ప్రాంతాన్ని అంతటిని జయించారు. అంత   చేసినా  కూడా వారి క్రోధం శాంతించక ఆ ప్రాంత క్షత్రియ రాజులను అందరిని వారి పరివార సమేతంగా సంహరించారు. ఆ తరువాత అనపోతానాయకుడు "సోమకుల పరశురామ" అనే బిరుదం వహించాడు.

వారు జయించిన ప్రాంతం పడమర  శ్రీశైలం నుండి అప్పటికి అద్దంకి వేమా రెడ్డి మరణించగా ఆయన పుత్రుడు ఐన అనపోతా రెడ్డి రాజ్యం లోనిది. దానిని అనపోతా మాదానాయకులు  రాచకొండ రాజ్యంలో కలుపుకున్నారు.

తరువాతి కాలంలో అనపోతానాయకుని పుత్రుడు ఐన సింగభూపాలుడు రచించిన "రసవర్ణ  సుధాకరము"  అనే గ్రంధంలో ఆయన తన తండ్రి ఐన అనపోతానాయకుడు శ్రీపర్వతానికి (అంటే శ్రీశైలం) మెట్లు కట్టించాడు అని రాసాడు. 

తదుపరి మాదానాయకుడు తన చిన్నాన్న పుత్రుడు ఐన నాగానాయకునితో కలసి అక్కడికి తూర్పున ఉన్న కొండవీటి రెడ్డి రాజు అయిన అనపోతా రెడ్డి సామ్రాజ్యంలో ప్రవేశించి ఆయనను ధరణికోట దగ్గర యుద్ధంలో ఓడించాడు. యుద్ధంలో పరాజితుడు అయ్యి అనపోతారెడ్డి  తిరోగమించగా ఆయన చివరికి నాగానాయకుని చేతికి  చిక్కాడు. నాగానాయకుడు, పరాజయానికి చిహ్నంగా అనపోతారెడ్డి వీపు మీద అనపోతానాయకుని రాజలాంఛనం ముద్రించి అతనిని విడుదల చేసాడు.

కానీ ఈ రాజలాంఛన ముద్రణ నిజంగా జరిగినదా లేదా అని చరిత్రకారులకు అనుమానం. ఎందుచేతనంటే అప్పటి రాచకొండ పాలకులు అరివీరభయంకరులు. యుద్ధంలో మట్టుపెట్టకుండా శత్రువులు ఎవరినీ ఆలా వదిలెయ్యలేదు. యుద్ధంలో దయ అనేది ఎరుగరు. అలాంటిది అనపోతారెడ్డి ని యుద్ధంలో బందీగా పట్టుబడిన తరువాత కేవలం లాంఛనం  ముద్రించి ఎలా వదిలిపెట్టారు అని వారి సందేహం. 

కానీ ధరణికోట యుద్ధం గెలిచినా తరువాత కూడా అది రాచోకొండ పాలకుల అధికారంలోనికి రాలేదు. రెడ్ల మీద ఆ విజయం తరువాత రెడ్ల బిరుదులు ఐన "జగదొబ్బగండ" " సంగ్రామ ధనంజయ", "రాయవేశ్యాభుజంగ" మరియు ఇతరములు రాచకొండ దొరలు ధరించారు.  

కానీ రెడ్డి సామ్రాజ్యంలో శ్రీశైల ప్రాంతం లో పెద్ద భాగాన్ని రాచకొండ వశం చేసుకుంది. కానీ ఈ భూభాగం అనపోతానాయకుని తరువాత సింగభూపాలుని పాలనలో 1397 సంవత్సరంలో విజయనగర రాజ్యం చే జయించబడింది.

రెడ్లతో రాచకొండ రాజులకు కొనసాగిన వైరం రెడ్డి రాజ్యం అంతరించేవరకు సాగింది. ముందుగా కొండవీటి రెడ్డి రాజ్యం 1402  సంవత్సరంలో (77  సంవత్సరాలు ) అంతం అయ్యింది. తదుపరి రాజమండ్రి రెడ్డి రాజ్యం 1448  సంవత్సరంలో (53  సంవత్సరాలు )  అంతం అయ్యింది. రాచకొండ రాజ్యంతో పోరాడి బలహీనపడిన రెడ్డి రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యం జయించింది.

రాజమండ్రి రెడ్డి రాజులలో ఒకరు విజయనగర హరిహరరాయలు II పుత్రికను వివాహం చేసుకున్నారు. అంటే రెడ్లు విజయనగర రాజుల బంధువులు. మరి ఐనా సరే వారు రెడ్డి రాజ్యం ఎందుకు ఆక్రమించారో తరువాత చదివి తెలుసుకోవలసి ఉంది.                                                              

Sunday, 15 November 2020

PADMANAYAKAS- FROM THE KAKATIYA KINGDOM TO THE BHIMAVARAM BATTLE.

 The first known Velama’s in the Kakatiya kingdom were the brothers Dama, Prasaditya and Rudra Nayakas. All the 3 were in the service of Ganapatideva (1199-1262) of which Prasadityanayaka was the most prominent.

When Ganapatideva died, some of the commanders and tributary kings were averse to accepting Rudramadevi as a King as she was a lady. Then, Prasadityanayaka along with the Kayastha chief Ambadeva and Gona Gannareddy supported her and defeated the opposing commanders and tributaries.  For this Rudramadevi conferred the title of “Kakathiya Rajya Sthapanacharya” to both Prasadityanayaka as well as Ambadeva.

Nothing is known in history about Prasadityanayaka’s brothers Dama and Rudra Nayakas. Also nothing is known about Damanayaka’s sons Vennamanayaka and Sabbinayaka. However, in the Velugotivari Vamsavali it is mentions that Vennamanayaka defeated a Muslim army.

Vennamanayakas son is Dachanayaka or Era Dachanayaka with whom the Rachakonda kingdom begins.

Dachanayaka had 3 sons, Singama, Vennama and Yachama Nayakas.

Dachanayaka and his son Singamanayaka were commanders with Prataparudra. When Prataparudras army under Muppidi Nayaka  attacked the Pandyas in 1316 AD, Dachanayaka accompanied him and had shown great valor and helped  in winning the battle. For this Dachanayaka was conferred with the title of “Panchapandyadala Vibhala” by Prataparudra. Singamanayaka accompanied his father to Kanchi and took active part in the battle. Dachanayaka probably died in the battle of Orugallu with the Muslims in 1323 AD when many of Prataparudra’s commanders perished and Prataparudra himself was taken prisoner by the Muslims.

All the commanders of Prataparudra perished in the battle of Orugallu except for three. 1. Gaja Sahini Bendapudi Annaya who was a minister of Prataparudra, 2. Kolani Prataparudra  ( from the Induluri family) whose grandfather was  a minister of Ganapatideva and 3. Recherla Singamanayaka.

Kolani Prataparudra was a powerful commander under Kakatiya Prataparurda and he was also the superintendent of the 72 Kakatiya forts. To release the Andhra area from the Muslims Bendapudi Annaya along with Kolani Prataparudra united the remaining commanders and tributary kings.

The important ones among the kings so united  are  1. Recherla Singamanayaka, 2. Ana Vema Reddy of Addanki, 3. Musunuri Prolayanayaka, 4. Koppula Prolaya Nayaka who ruled the surrounding areas of Pithapuram, 5. Manchikonda Ganapati Nayaka. This is more or less a confederacy of the kings of the coastal Andhra region except for Recherla Singamanayaka who is from Nalgonda district. If that is so then he would not have been left with any kingdom because all the Telengana area went into the control of the Muslims. It is also possible that after the fall of the Kakatiya kingdom, Singamanayaka must have taken some territory in the Andhra area and ruled it.  

Bendapudi Annaya and Kolani Prataparudra being elders went to the sidelines and acted as advisors to this confederacy. Kolani Prataparudra strongly recommended the leadership of the confederacy to Musnuri Prolayanakaka and Bendapudi Annaya accepted it. Due to this reason Singamanayaka had no choice but to accede to the arrangement.  The name of Prolayanayaka was unknown before the battle of Orugallu in 1323 AD. He was not heard of before that either as a commander, tributary king or minister to the king. Solely by the strong backing of both Kolani Rudradeva and Bendapudi Annaya he became the head of the confederacy. But both Annaya and Prataparudra are seasoned warriors and if they elevated Prolayanayaka to that position, obviously he had some special merit in him.  

Prolayanayaka was the son of Pochinayaka. His capital was Rekapalli near Bhadrachalam near Malyavanta mountain which meant possibly the Eastern Ghats. With the support of the above mentioned important and several other smaller nobles, Musunuri Prolayanayaka freed the coastal Andhra Area form Muslim domination by about after 1324 AD but the exact year when he freed it was unavailable from historical sources. Sultan Ghiyasuddin Tughlak died in 1325AD and Prince Ulugh Khan was busy attending to the matters at home when Prolayanayaka and his other supporting chiefs sallied forth and rapidly freed the Coastal Andhra area from Muslim garrisons. These conquests of Prolayanayaka are mentioned in the Mallavaram stone inscription of Vema Reddy.

After the death of Kolani Rudradeva in 1326 Prolayanayaka ruled the coastal Andhra country as an independent king. The others chief nobles helped him ruled as his nominal vassals over their own territories.

What Prolayanayaka freed were the districts of Godavari, Krishna, Guntur and Nellore. Contigous to the Godavari district is the Vizagapatam and Ganjam districts which were a part of Kalinga. The Rayalaseema region came under Muslim rule after the battle of Orugallu and stayed with them till the Vijayanagar kingdom took it. The Telangana area too remained with the Muslims till Prolayanayka’s cousin Kapanayaka conquered it later in 1344 AD.

Prolayanayaka ruled till about 1333 AD when his cousin Kapanayaka who was the son of Devanayaka, the brother of Prolayanayakas father took over. Kapanayakas aim then was to free the Telangana area  from the Muslims. Kapanayaka achieved this by 1344 AD and ruled the Telangana area from Orugallu.

It was mentioned in the Velugotovari Vamsavali that Singmanayaka while trying to expand his territory has defeated Musunuri Kapanayaka. However, this does not seem a complete victory because as per the Pillalamarri sasana of Kapanayaka dated 1357 AD  found in Nalgonda district he was then still in possession of the Telangana area.

Finally in about 1368 AD Recherla Anapotanayaka and Madanayaka marched against Kapanayaka as they suspected his hand in the assassination of their father Rechrela Singamanayaka. They defeated Kapanayaka in the Bhimavaram battle and Kapaya was killed. The Telangana area fell into the hands of the Anapotanayaka and Madanayaka. The Ainavolu sasana of Anapotanayaka of 1369 AD describes him to be control of the Tribhuvanagiri(Bhongir),  Orugallu and Singavaram forts.    

  

పద్మనాయకులు- కాకతీయ సామ్రాజ్యం నుండి భీమవరం యుద్ధం వరకు.

 కాకతీయ సామ్రాజ్యంలో చరిత్రకు తెలిసిన మొదటి పద్మనాయకులు సోదరులు ఐన దామ, ప్రసాదిత్య రుద్ర నాయకులు. ఈ మువ్వురు కూడా కాకతీయ చక్రవర్తి ఐన గణపతిదేవుని (1199 -1262 ) సైన్యాధిపతులు. ఈ మువ్వురిలోను ప్రసాదిత్యనాయకుడు ముఖ్యుడు. 

గణపతిదేవుని మరణం తరువాత చాల మంది సైన్యాధిపతులు, సామంతులు స్త్రీ కావడం వలన రుద్రమదేవి రాజ్యానికి అధిపతి కావడం ఇష్టపడలేదు. అప్పుడు రేచెర్ల ప్రసాదిత్యనాయుడు, కాయస్థ అంబదేవుడు ఆమె పక్షం వహించి పోరాడి రుద్రమదేవిని సింహాసనం మీద కూర్చొనపెట్టారు. దానికి మెచ్చి ఆమె వారి ఇద్దరికీ కూడా "కాకతీయరాజ్య స్థాపనాచార్య" అనే బిరుదం ఇచ్చింది. వారి ఇద్దరికీ గోన గన్నారెడ్డి సహకరించినా కూడా ఆయన వీరి ఇరువురి కంటే చిన్న సైన్యాధ్యక్షుడు. 

ప్రసాదిత్యనాయకుని తమ్ములు ఐన దామ, రుద్ర నాయకుల గురించి చరిత్రలో ఏమీ లేదు.అలాగే దామనాయకుని పుత్రులు ఐన వెన్నమ, సబ్బి నాయకుల గురించి కూడా చరిత్రలో ఏమీ లేదు. కానీ వెలుగోటివారి వంశావళి లో మాత్రం వెన్నమనాయకుడు ఒక ముస్లిం సైన్యాన్ని ఓడించాడు అని చెప్పబడింది.   

వెన్నమనాయకుని పుత్రుడే ఎర దాచానాయకుడు అనబడే దాచానాయకుడు. ఈయన సమయం నుండే రాచకొండ రాజ్యం మొదలు అయ్యింది. దాచానాయకునికి మువ్వురు పుత్రులు. వారు సింగమ, వెన్నమ మరియు యాచమ నాయకులు.

దాచానాయకుడు, అతని పుత్రుడు సింగమనాయకుడు ప్రతాపరుద్రుని కొలువులో సైన్యాధిపతులు. 1316  సంవత్సరంలో ముప్పిడి నాయకుని నాయకత్వంలో ప్రతాపరుద్రుని సేనలు కంచిలో పాండ్యులను ముట్టడించి గెలిచినప్పుడు దాచానాయకుడు గొప్ప పరాక్రమం చూపించాడు. దానికి మెచ్చి ఆయనకు ప్రతాపరుద్రుడు "పంచపాండ్యదల విభాల" అనే బిరుదం ఇచ్చాడు. దాచానాయకుడు బహుశా 1323  సంవత్సరం లో ప్రతాపరుద్రునికి ముస్లిం సైన్యాలతో జరిగిన యుద్ధం లో అనేక కాకతీయ సేనాపతులతో సహా మరణించాడు. ఈ యుద్ధంలో ముఖ్య సేనాపతులు అందరు మరణించగా ముస్లిం సైన్యాలు ప్రతాపరుద్రుని బందీగా పట్టుకున్నాయి. ఆ తరువాత వారు ప్రతాపరుద్రుని బందీగా ఢిల్లీ తీసుకుని పోతుండగా ఆయన నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ప్రతాపరుద్రుని సైన్యాధిపతులు, మంత్రులు అందరు ముస్లింల తో యుద్ధంలో మరణించగా చివరకు మువ్వురు మాత్రం మిగిలారు. వారు 1 . గజ సాహిణి బెండపూడి అన్నయ మంత్రి, 2 . కొలని ప్రతాపరుద్రుడు అనబడే రుద్రదేవుడు (ఇందులూరి కుటుంబానికి చెందినవాడు మరియు 72  దుర్గాలకు అధికారి), 3 . రేచెర్ల సింగమనాయకుడు.

కొలని ప్రతాపరుద్రుడు పెద్ద సైన్యాధిపతి, కాకతీయుల 72  దుర్గాలకు ఆయన అధికారి. ఆంధ్ర దేశాన్ని ముస్లిం పాలన నుండి విముక్తం చేయడానికి ఆయన బెండపూడి అన్నయ మంత్రితో కలసి మిగిలి ఉన్న కాకతీయ సైన్యాధిపతులను, సామంత రాజులను ఏకం చేసారు. 

ఆలా ఏకం చేసిన వారిలో ముఖ్యులు 1 . రేచెర్ల సింగమనాయకుడు, 2 . అద్దంకి వేమా రెడ్డి, 3 . ముసునూరి ప్రోలయనాయకుడు (రేకపల్లి రాజధానిగా భద్రాచలం ప్రాంతాన్ని ఏలినవాడు) , 4 . కొప్పుల ప్రోలయనాయకుడు (పిఠాపురం పరిసర ప్రాంతాన్ని ఏలినవాడు) 5 . మంచికొండ గణపతినాయకుడు. (కోరుకొండ పరిసర ప్రాంతాన్ని ఏలినవాడు).  

వీరు అందరూ,సింగమనాయకుడు తప్ప తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజులు. సింగమనాయకుడు నల్గొండ ప్రాంతంలో పాలించినవాడు. బహుశ ముస్లిం సైన్యాలతో యుద్ధ అనంతరం ఆయన ఏలిన ప్రదేశం ముస్లిం సైన్యాల పరం అయ్యింది. అందుచేత ఆయన తరువాత తీరాంధ్ర దేశంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించి పాలించి ఉండవచ్చు.

బెండపూడి అన్నయ, కొలని ప్రతాపరుద్రుడు వయసులో పెద్దవారు కావటం వలన వారు ఈ సమాఖ్య లో భాగం కాకుండా దానికి సలహాదారులుగా ఉన్నారు.  సమాఖ్య కు అధిపతిగా ముసునూరి ప్రోలయనాయకుని పేరును కొలని ప్రతాపరుద్రుడు ధృడంగా ప్రతిపాదించగా దానిని బెండపూడి అన్నయ సమర్ధించాడు. దాని కారణం వలన సింగమనాయునికి వేరే దారి లేక దానిని అంగీకరించాల్సి వచ్చింది.

1323  సంవత్సరం లో జరిగిన ఓరుగల్లు  యుద్ధానికి ముందు చరిత్ర ప్రకారం అసలు ముసునూరి ప్రోలయనాయకుని పేరు సైన్యాధిపతి గా కానీ, సామంతుడిగా కానీ మంత్రిగా కానీ ఎక్కడా వినబడలేదు కానీ కొలని ప్రతాపరుద్రుని, మరియు బెండపూడి అన్నయ యొక్క ఆదరణ ఉండటంవలన ఆయన సమాఖ్య కు నాయకుడు అయ్యాడు.  కానీ కొలని ప్రతాపరుద్రుడు, బెండపూడి అన్నయ ఎంతో అనుభవం ఉన్నవారు. అలాంటివారు ముసునూరి ప్రోలయనాయకుని ఏక పక్షంగా సమర్ధించారు అంటే ఆయన ప్రతిభావంతుడు అయ్యి ఉండాలి. 

ముసునూరి ప్రోలయనాయకుడు పోచినాయకుని పుత్రుడు. అయన రాజధాని పైన చెప్పినట్టు గా భద్రాచలం దగ్గరగా ఉన్న మాల్యవంత పర్వత ప్రాంతంలో ఉండేది. మాల్యవంత పర్వతం అంటే బహుశా ఇప్పటి మన తూర్పు కనుమలు. పైన చెప్పిన సమాఖ్య లోని ముఖ్య నాయకుల సహాయంతో ప్రోలయనాయకుడు తీరాంధ్ర దేశాన్ని దాదాపుగా 1325  సంవత్సరానికి విముక్తం చేసాడు. 1325  సంవత్సరం లో ఘియాజుద్దీన్ తుగ్లక్ మరణించగానే ఉలుఘ్ ఖాన్ అనబడే మహమ్మద్ బీన్ తుగ్లక్ ఢిల్లీలో వ్యహారాలు చూసుకునే సమయాన్ని చూసి ముసునూరి ప్రోలయనాయకుడు, ఆయనకు సహాయపడుతున్న మిగిలిన నాయకులు బయలుదేరి కోటలలో ఉండే ముస్లిం సైన్యాలను ఒకటొకటిగా ఓడించి కోటలను  స్వాధీనం చేసుకున్నారు. తరువాత కొలని ప్రతాపరుద్రుడు 1326  సంవత్సరంలో మరణించగానే ముసునూరి ప్రోలయనాయకుడు తీరాంధ్ర దేశాన్ని ఒక స్వతంత్ర రాజుగా పాలించాడు.  కానీ పైన చెప్పిన మిగిలిన నాయకుల మీద ఆయన ఆధిపత్యం నామ మాత్రమే.

ప్రోలయనాయకుడు, అతని కింద మిగిలిన నాయకులు విడిపించిన ప్రదేశాలు గోదావరి, కృష్ణా, గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలు. గోదావరి జిల్లాను అనుకొని ఉండే విశాఖపట్నం గంజాం జిల్లాలు కళింగ రాజుల అధీనంలో ఉండేవి. రాయలసీమ ప్రదేశం విజయనగర సామ్రాజ్యంలోనికి వచ్చేంతవరకు ముస్లిం సైన్యాల ఆధీనంలోనే ఉంది. తెలంగాణ ప్రదేశం కూడా 1344  సంవత్సరంలో ముసునూరి కాపానాయకుడు జయించేవరకు ముస్లిం సైన్యాల అధీనం లోనే ఉంది.  

ప్రోలయనాయకుడు 1325  నుండి 1333  సంవత్సరం వరకు అంటే కేవలం 8  సంవత్సరాల కాలం రాజ్యం చేసి మరణించాడు. ఆయన తరువాత ప్రోలయనాయకుని చిన్నాన్న దేవనాయకుని పుత్రుడు ఐన ముసునూరి కాపానాయకుడు రాజ్యానికి వచ్చాడు. కాపానాయకుడు  1344  సంవత్సరంలో తెలంగాణ ప్రదేశాన్ని ముస్లిం పాలన నుండి విముక్తం చేసాడు. ఆయన ఆంధ్రదేశాధీశ్వర  అనే బిరుదాన్ని వహించి తీరాంధ్ర, తెలంగాణ ప్రదేశాలను ఓరుగల్లు నుండి పాలించాడు.

వెలుగోటివారి వంశావళి లో తన రాజ్య విస్తరణలో భాగంగా రేచెర్ల సింగమనాయకుడు ముసునూరి కాపానాయకుడిని ఓడించాడు అని చెప్పబడింది. కానీ అది పూర్తి విజయం కాదు అని 1357  లో కాపానాయకుడు వేయించిన పిల్లలమఱ్ఱి శాసనం చెప్తుంది. ఆ శాసనం వేయించే సమయానికి కూడా తెలంగాణ ప్రదేశం కాపానాయకుడి రాజ్యంలోనే ఉంది

రేచెర్ల సింగమనాయకుడు జల్లిపల్లి యుద్ధం ముందే కుతంత్రంతో చంపబడ్డాడు. ఆ కుతంత్రం చేయించింది సోమవంశ క్షత్రియులు, రెడ్లు వారికి సాయపడ్డారు. కాపానాయకుడు కూడా ఆ కుట్రలో పాలు పంచుకున్నాడు అని భావించి సింగమనాయుకుని పుత్రులు ఐన అనపోతానాయకుడు, మాదానాయకుడు 1368  సంవత్సరంలో ఓరుగల్లును ముట్టడించి భీమవరం యుద్ధంలో గెలిచి కాపానాయకుని సంహరించారు. అప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతం వారి హస్తగతం అయ్యింది.     

 

Sunday, 1 November 2020

RAMANUJACHARYA

 Ramanuja propounded the “Visihtadvaita” as opposed to “Advaita” of Sankaracharya and “Dvaita” of Madhvacharya.

Ramanuja was born to Kanthimati and Asuri Kesava Somayaji at Sriperambudur in Tamilnadu. His original name was Ilaya Perumal. His date of life is stated as 1017-1137 or 120 years. Modern scholars say that evidence suggests that he may have lived between 1077-1157 AD.

Ramanuja got married and moved to Kanchipuram. He studied in an Advaita monastery as the Advaitin Yadava Prakasa as his guru.  Ramanuja and his guru frequently differed on the interpretation of the Vedic texts, particularly the Upanishads. Thereafter they separated and Ramanuja continued his studies on his own.

Then Ramanuja became a priest in the Varadaraja Perumal temple at Kanchipuram, where he began to teach that moksha can be attained not through Nirguna Brahman but through a personal god Vishnu. Although he married Rakshakambal, he gave up married life at the age of 30. 

Prior to Ramanuja, the Vaishnava tradition was already established under Yamunacharya and Bhakti songs and devotional culture was already a part of Tamil culture on account of the 12 Alwars. Ramanuja became famous because he challenged the Advaita system, which was very influential then and offered an alternative interpretation of Vedic scriptures.    

Yamunacharya, who was the head of the Vaishnava temple at Srirangam was following Ramanuja from a very young age. When it was time for Yamunacharya to pass on the legacy, Yamunacharya summoned Ramanuja through his close disciple Sri Mahapurna. But, by the time Ramanuja and his disciple could reach Srirangam, Yamunacharya passed away.

Ramanuja was heart broken and left for Kanchi and refused to worship Ranganatha for taking away Yamunacharya from this world. Yamunacharyas son took over the management of the Sri Ranaganatha temple at Srirangam. But after sometime he and the elders of the Vaishnavaite order felt that there is a vacuum after the demise of Yamunacharya the temple required a person who can interpret the Vedas and Sastras like Yamunacharya. So they decided to send Sri Mahapurna again to invite Ramanujacharya to Srirangam.

In the meantime at Kanchi, Ramanuja met Kanchipurna and decided to be his devotee but Kanchipurna refused as Ramanuja is from a different caste and told Ramanuja that he would get a more appropriate guru. After that Kanchipurna left for Tirupati to worship Lord Venkateswara and came back only after 6 months when he advised Ramanuja that the Lord wishes him to proceed to Srirangam. Ramanuja then started for Srirangam. From the other side Mahapurna started along with his wife to Kanchi for inviting Ramanuja. Both met at Madhurantakam and both found each other. Ramanuja immediately wanted to be initiated as a Vaishnavaite and Ramanuja received the Pancha Samskarams for entering into Vaishnavism from Mahapurna.

Even before Ramanuja the Vaishnavas are not averse to accepting castes other than Brahmins into their fold. In fact both Mahapurna and Kanchipurna were non Brahmins. Ramanuja carried this tradition forward. He also allowed the untouchables to be initiated into Vaishnavism. Accordingly at Srirangam he reorganized the rituals and the involvement of non Brahmin people in Vaishnava worship.

After the death of Ramanuja the Vaishnavaites split into Vadakalai( Northern and Sanskritic) and Thenkalai ( Southern and Tamil) sects.Both believe in initiation into Vaishnavism through the Pancha Samskaras. While The Vadakalai used Sanskrit systems, the Thenkalai used the Tamil systems. While Vadakalai was dominant at Kanchi and the surrounding areas, the Thenkalai was dominant around Srirnagm.

There were several attempts to kill Ramanuja but he escaped all of them. The first attempt was by his guru Yadavaprakasa. He made Ramanuja join him on a pilgrimage to Varanashi along with his other pupils and plotted to kill him. However, a cousin who was accompanying Ramanuja came to know of the plot and warned Ramanuja and helped him to escape. Yadava Parakas made another attempt to kill Ramanujacharya. Yadavaprakasa tried to get Ramanuja murdered once more but he escaped again. The head priest of the Ranganatha temple at Srirangam did not like Ramanuja and tried to murder with poisoned food first and later with poisoned teertham but Ramanujacharya escaped that attempt as well.

Ramanuja remained at Srirangam and he undertook a long 20 year pilgrimage all over India. On his return, the king of the Chola dynasty who was a fanatical follower of Shiva persecuted him. Ramanuja fled to Mysore where he converted a lot of people to Vaishnavism. He converted the Hoysala king Bittideva to Vaishnavism. Finally he died in the year 1157 AD.

Vaishnava tradition attributes 9 texts to Ramanuja but the principal among them are 3. They are 1. Sri Bhashya(Commentary on the Brahma Sutras), 2. Bhagavadgita Bahshya, 3. Vedartahasangraha (meaning the essence of the Vedas)

JUSTICE KARNAN-USED CASTE TO JUSTIFY HIS ENDS.

  CS Karnan passed away on 12 th November at Chennai. He was one of the most controversial Judges of the High Courts in India. He never sto...