పల్నాటి
యుద్ధం క్రిస్తు శకం 1178 -82 మధ్యలో జరిగింది.
అందులో బ్రహ్మనాయుడు రేచెర్ల గోత్రజుడైన వెలమ దొర
అని చెప్పబడింది. ఆ తరువాత క్రిస్తు శకం 1199 లో రాజ్యానికి వచ్చిన గణపతిదేవుని
కొలువులో పద్మనాయక వెలమలు ముఖ్య పాత్ర పోషించారు.
అలాగే
వారు అయన వారసులు ఐన రుద్రమదేవి, ప్రతాపరుద్రుని కొలువులో ముఖ్యపాత్రలు పోషించారు.
వారు కాకతీయ సామ్రాజ్య విచ్చిన్నం తరువాత నల్గొండ లోని రాచకొండ రాజధానిగా చేసుకుని
స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.
వెలమల
చరిత్ర కాకతీయ సామ్రాజ్యంతో ఘాడంగా ముడిపడి ఉంది. అందుచేత వెలమ చరిత్రకు కాకతీయ సామ్రాజ్య
చరిత్ర మూలం. ఇక్కడ కాకతీయ సామ్రాజ్య చివరి చరిత్ర క్లుప్తం గా పరిశీలిద్దాము.
రాణి
రుద్రమ దేవి కి కొడుకులు
లేరు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారు రుయ్యమ, రుద్రమ
మరియు ముమ్మిడమ్మ. ముమ్మిడమ్మ పుత్రుడు ప్రతాపరుద్రుడు. ఆయనను రుద్రమదేవి దత్తత
స్వీకరించి తన తరువాత కాకతీయ
సామ్రాట్ గ చేసింది. ప్రతాపరుద్రుని
కాలం లో కాకతీయ సామ్రాజ్యం ఉచ్చ స్థితిని చేరింది,
కానీ తరువాత అది ముక్కలుగా విడిపోవడం
కూడా ప్రారంభం అయ్యింది. ప్రతాపరుద్రుడు తన రాజ్యం లోనే
వెలమ రెడ్డి, కాయస్థ రాజుల తిరుగుబాటులను ఎదుర్కోవలసి
వచ్చింది.
నాయంకర
విధానాన్ని ప్రతాపరుద్రుడు ప్రక్షానలం చేసి సామ్రాజ్యాన్ని 77 నాయంకరాలు
గా విడతీసి వాటిని తనకు విశ్వాసపాత్రులైన సైన్యాధిపతులకు
అప్ప చెప్పాడు. ఈ ప్రక్షానలం లో
వాటిలో ఎక్కువ నాయంకరాలు వెలమలకు ఇవ్వబడటం వల్ల అప్పటి స్థానిక
చరిత్రల
ప్రకారం రెడ్డి సైన్యాధిపతులకు కోపం వచ్చింది.
1303 -1310 సమయ
లో కాకతీయ సామ్రాజ్యం మీద ముస్లిం దండయాత్రలు
జరిగాయి. అది అదనుగా చూసుకుని
గండికోట సామంత రాజు ఐన
వైదుంబ మల్లిదేవుడు మరియు నెల్లూరు రాజైన
రంగనాథుడు స్వతంత్రం ప్రకటించారు. అప్పుడు కాకతీయ సైన్యాలు జుట్టాయిలెంక గొంకారెడ్డి
నాయకత్వం లో మల్లిదేవుని తిరుగుబాటు
అణచి గండికోట ను స్వాధీనం చేసుకున్నాయి.
ఇంతలో
పాండ్య రాజ్యం లో అంతః కలహాలు
చెలరేగాయి. అది అదనుగా చూసుకుని
ప్రతాపరుద్రుడు సైన్యంతో పాండ్యులను ముట్టడించారు. ఈ యుద్ధం లో
ప్రతాపరుద్రుని సైన్యాధిపతులు ఐన
ముప్పిడి నాయక, పెదరుద్ర, రేచెర్ల
ఎర దాచానాయక మరియు దేవరినాయకులు ముఖ్య
భూమిక పోషించారు.
కాకతీయ
సామ్రాజ్యం పైన ముస్లిం ల
మొదటి దండయాత్ర 1303 సంవత్సరం
లో జరిగింది.ఢిల్లీ సుల్తాన్ అయిన
అల్లాఉద్దీన్ ఖిల్జీ తన సైన్యాధిపతి మాలిక్
ఫ్యాక్రుద్దిన్ జునా ను ఒక
పెద్ద సైన్యంతో ఓరుగంటిని ముట్టడించడానికి పంపాడు. ఈ సైన్యాన్ని వెలమ
నాయకులు ఐన రేచెర్ల వెన్నమనాయక
మరియు పోతుగంటి మైలి ఉప్పరపల్లి దగ్గర
ఓడించారు.
తిరిగి
1309 లో
అల్లాఉద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ ను ఓరుగంటిని
ముట్టడించడానికి పంపాడు. ఈ యుద్ధంలో ప్రతాపరుద్రుడు
ఓడి సంధి చేసుకున్నాడు. అల్లాఉద్దీన్
ఖిల్జీ మరణించగానే ప్రతాపరుద్రుడు ఢిల్లీ కి కడుతున్న కప్పం
చెల్లించడం ఆపేసాడు.
అప్పుడు
ముబారక్ ఖిల్జీ ఖుస్రో ఖాన్ కి సైన్యం
ఇచ్చి ఓరుగంటిని ముట్టడించడానికి పంపాడు. ఈ యుద్ధం లో
ఏమి జరిగిందో చారిత్రక ఆధారాలు లేవు. కానీ అమిర్
ఖుస్రో ప్రకారం ప్రతాపరుద్రుడు ఈ యుద్ధంలో ఓడించబడి
పెద్ద మొత్తం ఢిల్లీ సుల్తానుకు చెల్లించాడు.
కాకతీయ
సామ్రాజ్యం మీద చివరి ముస్లిం
దండయాత్ర సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ సమయంలో 1321 -22 లో
జరిగింది. ముస్లిం సైన్యాలు వచ్చి యువరాజు అయిన
జునా ఖాన్ లేదా ఉలుఘ్
ఖాన్ లేదా మహమ్మద్ బీన్
తుగ్లక్ సారధ్యంలో ఓరుగంటిని ముట్టడించాయి. ముట్టడి 6 మాసాలు
సాగినా సరే ముస్లిం
సైన్యాలు గెలవలేక పోయాయి. ఇంతలో ముస్లిం గుడారాల్లో
ఢిల్లీ సుల్తాన్ చనిపోయాడు అని ఒక పుకారు
పుట్టింది. అది చూసి ఇద్దరు
ముస్లిం సైన్యాధిపతులు తిరుగుబాటు చేసి ప్రతాపరుద్రుని తో
మంతనాలు చేసారు. దాని వలన ఉలుఘ్
ఖాన్ సైన్యం వేణు తిరగవలసి వచ్చింది.
తిరోగమనం చేస్తున్న ముస్లిం సైన్యాలను ప్రతాపరుద్రుని సైన్యం వెంబడించి గొప్ప నష్టం కలిగించింది.
ఉలుఘ్
ఖాన్ దేవగిరి దుర్గానికి తిరోగమించి అక్కడ కొత్త సైన్యం
కోసం నిరీక్షించాడు. ఢిల్లీ నుండి సైన్యం రాగానే
ఉలుఘ్ ఖాన్ తిరిగి ఓరుగంటిని
ముట్టడించాడు. ఇంతలో
ప్రతాపరుద్రుని సైన్యం లో కుల బేధాలు
పెరిగి పోయాయి. రెడ్డి సైన్యాధిపతులకు కాకతీయుల మీద వెలమ సైన్యాధిపతుల
మీద కోపం వచ్చింది. దానికి
తోడు వారి అశ్వ దళం
కానీ ఫిరంగులు కానీ ముస్లిం సైన్యాల
వాటికి దీటు అయినవి కాదు.
పులి
మీద పుట్ర లా సంకుల సమరం
జరుగుతుండగా బొబ్బా రెడ్డి అనే సైన్యాధిపతి తన
సైన్యాన్ని యుద్ధ భూమి నుండి
వెనక్కు తీసుకున్నాడు. కాకతీయ సైన్యం ఓడిపోయింది. అనేక మంది ప్రతాపరుద్రుని
సైన్యాధిపతులు ఈ యుద్ధం లో
అసువులు కోల్పోయారు. ప్రతాపరుద్రుడు ముస్లిం సైన్యాలకు బందీగా చిక్కి అవి ఆయనను ఢిల్లీ
తీసుకుని పోతుండగా నర్మదా నది లో దూకి
ఆత్మ హత్య చేసుకున్నాడు.